Brahmamudi October 9th: కావ్యకి సపోర్ట్‌గా మాట్లాడిన అపర్ణ- రాజ్‌ని నిలదీసిన కనకం, కళావతి పయనం ఎటువైపు?
రాజ్ తాతయ్యకి ఇచ్చిన మాట కోసమే తనతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తున్నాడని కావ్యకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
కావ్య కోసం రాజ్ ఇల్లంతా వెతుకుతాడు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అప్పుడే అందరూ హాల్లోకి వస్తారు. కావ్య ఇంట్లో ఎక్కడా లేదని అపర్ణ శుభాష్కి చెప్తుంది. దీంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. తాతయ్య కోసం నటిస్తున్నానని నోరు జారినప్పుడు నిజం తెలుసుకుని ఇంట్లోనుంచి వెళ్లిపోయిందా ఏంటని రాజ్ మనసులో అనుకుంటాడు. కావ్య ఏడుస్తూ దిగులుగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లిపోతుంది.
అపర్ణ: కావ్య ఏం చేసినా ఇంట్లో ఎవరికి చెప్పినా చెప్పకపోయిన నీకు చెప్తుంది
రాజ్: ఈసారి మాత్రం నిజంగా ఎక్కడికి వెళ్లిందో నాకు తెలియదు మమ్మీ
ఇంద్రాదేవి: మీ ఇద్దరూ మాట మాట అనుకున్నారా?
రాజ్: అలాంటిది ఏమి లేదు
సీతారామయ్య: మనసు వికలం అయితే తప్ప ఇంట్లో నుంచి వెళ్లదు
Also Read: సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన లాస్య- హనీ పరిస్థితి చూసి విలవిల్లాడిపోయిన తులసి
రాజ్: కావ్య ఎక్కడ ఉన్న నేను తీసుకొస్తాను మీరు రెస్ట్ తీసుకోండి
సీతారామయ్య: దుగ్గిరాల ఇంటి కోడలి అయిన తర్వాత కావ్య ఈ ఇంటి మనిషి అయ్యింది. ఎవరి ద్వేషాన్ని అయినా కూడా చిరునవ్వుతో స్వాగతించింది. అలాంటిది అమ్మాయి కనిపించకపోతే ప్రశాంతంగా ఎలా ఉంటారు
రుద్రాణి: మొగుడు ఏమి అనలేదు అంటే అత్త ఏమైనా అన్నదేమో
అపర్ణ: ఇప్పుడు నాకేం సంబంధం లేదు
రుద్రాణి: ఇలా చెప్పకుండా వెళ్లడం నీ కోడలికి కొత్తేమీ కాదు కదా. అత్తింటి గడపలో అడుగుపెట్టిన మొదటి రోజు చెప్పకుండా పోలీస్ స్టేషన్‌కి వెళ్లొచ్చిన వీరవనిత. వీళ్ల ఫ్యామిలీకి అవసరాలు ఉంటే వెళ్తారా?
స్వప్న: నన్ను ఎవరో ఎత్తుకుపోతే కనిపించకుండ వెళ్లాను అంతే కానీ కావ్యలాగా తిన్నది అరగక ఇంత సీన్ క్రియేట్ చేసి వెళ్లలేదు
రాజ్: వాహ్ సూపర్ బాగా చెప్పావ్ స్వప్న. నువ్వు కనిపించకుండ పోతే నీకోసం ఎంత తల్లడిల్లిపోయిందో నాకు తెలుసు. నీ పెళ్లిలో మైఖేల్ ఎత్తుకెళ్తే ప్రాణాలకి తెగించి వెతకడానికి వెళ్లింది. తిన్నది అరగక కాదు కళావతి ఏం చేసినా నీ మంచి కోసమే చేసింది. ఆ సంగతి నీ మొగుడికి తెలుసు
రుద్రాణి: నా కోడలు వెళ్లిపోవడానికి కారణాలు ఉన్నాయి. మరి నీ భార్య వెళ్లడానికి కారణం ఏంటి
అపర్ణ: కావ్య గురించి తక్కువ చేసి మాట్లాడే హక్కు నీకు, నీ కోడలికి లేదు. కావ్య నాకు నచ్చిన నచ్చకపోయిన నీ కొడుకు విషయంలో మంచే చేసింది. నీలాగా నీకోడలిలాగా బాధ్యత లేకుండా ప్రవర్తించలేదు
రుద్రాణి: కావ్య తిరిగి రాకపోతే అత్తాకోడలి మధ్య ఏదైనా గొడవ జరుగుతుందని ఇలా నటిస్తున్నావా?
శుభాష్: ఆపుతావా ఒక మనిషి ఇంట్లో నుంచి కనిపించకుండా పోతే ఇలాగేనా మాట్లాడేది
ప్రకాశం: వదినది నీకులాగా రెండు నాలుకలతో మాట్లాడే మనస్తత్వం కాదు
Also Read: ముకుందకి కృష్ణ అదిరిపోయే ఝలక్- మురారీని అపార్థం చేసుకున్న ప్రభాకర్!
ధాన్యలక్ష్మి: కోడలు కనిపించకపోతే సానుభూతి చూపించడం మనుషుల లక్ష్యం
సీతారామయ్య: కావ్యకి ఎవరైనా అపాయం తలపెట్టారు ఏమో ముందు తనని వెతకండి అనేసరికి ఇంట్లో మగవాళ్ళు అందరూ కావ్యని వెతకడం కోసం వెళ్లిపోతారు. రోడ్డు మీద తలా ఒక వైపు కావ్య కోసం వెతుకుతూ ఉంటారు. రాజ్ తనతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుని కావ్య బాధగా ఉంటుంది. కనకం ఇంటి కాగితాలు తీసుకొచ్చి కృష్ణమూర్తికి ఇస్తుంది. చేసిన తప్పుకి క్షమాపణ అడుగుతుంది. రాజ్ కనకానికి ఫోన్ చేసి కావ్య అక్కడికి వచ్చిందేమోనని అడుగుతాడు. ఆ మాట వినేసరికి కనకం టెన్షన్ పడుతుంది. కావ్య గుడిలోకి అడుగుపెడుతుంది.
కనకం: కావ్య ఇక్కడికి ఎందుకు వస్తుంది? అంటే తను మీ దగ్గర లేదా?
రాజ్: ఏదో పని ఉందని చెప్పి బయటకి వెళ్లింది. ఇంకా రాకపోతే మీకు ఫోన్ చేశాను
ఇంత అర్థరాత్రి కావ్య ఎక్కడికి వెళ్లి ఉంటుందని కృష్ణమూర్తి వాళ్లు కంగారుగా కూతురి ఫోన్‌కి ట్రై చేస్తారు. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. కళ్యాణ్‌కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఎంత వెతికినా కూడా కావ్య కనిపించదు. మళ్లీ కళ్యాణ్‌కి కనకం ఫోన్ చేసి విషయం తెలుసుకుంటుంది. వదిన చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. అందరం తన కోసమే వెతుకుతున్నాం. ఆచూకీ తెలియడం లేదని చెప్తాడు. ఎందుకు వెళ్లిపోయిందని కనకం ఆందోళనగా అడుగుతుంది. ఏమో తెలియదు అన్నయ్య ఏమి అనలేదని అంటాడు. కావ్య విషయం ఏదో దాస్తున్నారని వెంటనే నిలదీయాలని కనకం ఆవేశంగా వెళ్లబోతుంటే కృష్ణమూర్తి ఆపుతాడు.