Guppedanta Manasu June 28th: ఓ గూటికి చేరిన రిషిధార, దేవయాని-శైలేంద్ర కుట్ర మొత్తం వినేసిన ధరణి!
Guppedantha Manasu June 28th: కాలేజీ ఎండీ సీటుకోసం శైలేంద్ర-దేవయాని ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. రిషి ఇంట్లోంచి వెళ్లిపోయాడు, జగతిపై మహేంద్ర కోపం కంటిన్యూ అవుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
గుప్పెడంతమనసు జూన్ 28 ఎపిసోడ్
వసుధారకి యాక్సిడెంట్ జరగడంతో కంగారుపడిపోయిన రిషి హాస్పిటల్ కి తీసుకొచ్చి చేర్పిస్తాడు. ఓ వైపు డాక్టర్ డాక్టర్ అని మరోవైపు ‘వసుధార.. వసుధార’ అంటూ అల్లాడిపోతాడు. వసుని లోపలకు తీసుకెళతారు..ఆమె తరపున ఎవరున్నారని డాక్టర్ అడిగితే ఆ పక్కనే ఉన్న మరో మేడంతో మీరు ఫార్మాలిటీస్ పూర్తిచేయండి అని చెప్పి మీరు ఇక్కడే ఉండండి, ఆమెను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి డబ్బులిచ్చి కష్టంగా బయటకు వెళ్లిపోతాడు. మరోవైపు వసుధారని లోపలకు తీసుకెళుతుండగా వసు చేతికున్న రింగు రిషి చేతికున్న బ్రాస్ లెట్ కి చిక్కుకుంటుంది. దానిని తీసేసి బయటకు వచ్చేస్తాడు రిషి.
లెక్చరర్: ‘మీకు పెద్ద పరిచయం లేదు.. అయినా తన గురించి చాలా ఆందోళన పడుతున్నారు. చాలా సాయం చేశారు. తను సృహలోకి వచ్చాక తనకు మీ గురించి అంతా చెబుతాను’ అంటుంది ఆ లెక్చరర్. ఆ అవసరం లేదు మనం చేసే పనిలో మంచి ఉంటే చాలు, మన పేరు ఉండక్కర్లేదు.. తనని జాగ్రత్తగా చూసుకోండి అనేసి రిషి వెళ్లిపోతాడు. వెళ్లి ఆసుపత్రి ముందే కారు దగ్గర నిలబడి చాలా మథనపడతాడు. కారు స్టార్ట్ చేసి ఇంటికి వెళ్తూ వెళ్తూ కూడా వసు గురించి ఆలోచిస్తాడు.
రిషి: ఇదంతా ప్రేమేనా , ‘ఏంటిది? ఎందుకు? ఎందుకు స్పందించాను? ఎందుకు చలించిపోయాను. ఎందుకు వసుధారని ఆ పరిస్థితుల్లో చూసి ఆందోళన పడ్డాను. మానవత్వంతోనే కదా.. లేదా తన మీదున్న ప్రేమతోనా?’ ‘ప్రేమతో కాదు’. ‘ఒక్కసారి ఆలోచించు రిషి.. పొరబాటు పడుతున్నావేమో..?’ అని అంతరాత్మ నిలదీస్తుంది. దాంతో ఆలోచనలో పడతాడు. క్షణం ఆగి.. ‘ఊహూ.. పొరబాటు ఏం లేదు.. ఆమెని ఆ పరిస్థితుల్లో చూసి మానవత్వంతో స్పందించాను, అంతే’ అనుకుంటాడు రిషి మనసులోనే. అయినా రోడ్డు మీద వెళ్తుంటాం ఎవరికో ముక్కు ముఖం తెలియని వాళ్లకి యాక్సిడెంట్ అవుతుంది వాళ్లకి కూడా ఇలానే చేస్తాను. ఇలానే ఆసుపత్రికి తీసుకుని వెళ్తాను. ఇలానే డబ్బులు ఇస్తాను అంతే ఇంతకు మించి ఇంకేం లేదని గట్టిగా అని సర్దిచెప్పుకుంటాడు.
Also Read: వసుకి యాక్సిడెంట్ - అల్లాడిపోయిన రిషి, చక్రపాణి నుంచి నిజం తెలుసుకుని పాండ్యన్ ని కలసిన మహేంద్ర!
కాసేపటికి మెలుకువ వచ్చిన వసుకి జరిగినదంతా ఆ లెక్చరర్ వివరంగా చెబుతుంది. ‘ఏదో సొంతమనిషికి యాక్సిడెంట్ అయినట్లుగా రిషి సార్ అల్లాడిపోయారు మేడమ్’ అని ఆమె చెబుతుంటే.. వసుకి పట్టలేనంత ఆనందం సొంతం అవుతుంది. ఇంతలో కాల్ చేసిన ఏంజెల్ కి ఆ లెక్చరర్ విషయం చెబుతుంది. వస్తున్నా అని బయలుదేరుతుంది ఏంజెల్. మరోవైపు రిషి చేసిన సహాయం తలుచుకుని వసుధార మురిసిపోతుంది.
శైలేంద్ర-దేవయాని
రోజురోజుకీ జగతి పిన్నికి ధైర్యం ఎక్కువవుతోంది. అందుకే బాబాయ్ ని అడ్డు తప్పించడమే అందుకు పరిష్కారం అని మాట్లాడుకుంటారు ఇంతలో ధరణి వస్తుంది. ఇద్దరూ కంగారు పడి ధరణిని బెదిరిస్తారు . కానీ ధరణి అసలు తానేం వినలేదని చెప్పి తప్పించుకుంటుంది. సమయం చూసి ఈ విషయం చిన్న అత్తయ్యకి చెప్పాలి అనుకుంటుంది
ఏంజెల్-వసుధార
ఇంతలో హాస్పిటల్ కి వచ్చిన ఏంజెల్..వసుని బెడ్ పై చూసి కంగారుపడుతుంది. ఆ లెక్చరర్‌కి థాంక్స్ చెప్పి పంపించి తనే డిశ్చార్జ్ చేయించి.. వసు ఇళ్లు ఆసుపత్రికి దూరం కావడంతో వసు వద్దు అన్న వినకుండా ఇంటికి బయలుదేరుతుంది.
Also Read: జూన్ 28 రాశిఫలాలు , ఈ రోజు ఈ రాశివారికి గ్రహస్థితి కలిసొస్తుంది!
రిషి దగ్గరకు వసు
మరోవైపు రిషి మాత్రం వసు గురించే ఆలోచిస్తుంటాడు. మనసులోనే మథన పడతాడు. చివరికి ఆ లెక్చరర్‌కి కాల్ చేసి వసుధార మేడమ్‌కి ఎలా ఉంది? అని ఆరా తీస్తాడు. బాగానే ఉందని ఆ లెక్చరర్ చెప్పడంతో హమ్మయ్య అనుకుంటాడు. ఆ తర్వాత కాల్ కట్ చేసిన తర్వాత రిషి..విశ్వనాథంతో కూర్చుని కాలేజీ గురించి మాట్లాడుతుంటాడు. అప్పుడే ఏంజెల్ వసుని తీసుకుని ఇంటికి వస్తుంది. నీకెందుకు శ్రమ నేను ఇంటికి వెళ్లిపోయేదాన్ని కదా అని వసు అంటే..నాకు దెబ్బతగిలినప్పుడు నువ్వు సహాయం చేశావ్ కదా మీ నాన్నకు నేను కాల్ చేసి చెబుతాను అంటుంది ఏంజెల్. ఇద్దరూ లోపలకు వెళుతుండగా రిషికి ఫోన్ రావడంతో పక్కకు వెళ్తాడు. వసుని తీసుకుని ఏంజెల్ లోపలికి రావడం చూసిన విశ్వనాథం.. కంగారు దగ్గరకు వచ్చి ఏం అయ్యింది అని ఆరా తీస్తాడు. జరిగింది అంతా ఏంజెల్ చెబుతుంది.