అన్వేషించండి

Guppedanta Manasu June 22nd: ప్రేమ వర్షంలో తడిసిముద్దయ్యేందుకు ఎదురుచూస్తోన్న వసు, ఎడారిలోనే ఉంటానంటున్న రిషి!

Guppedantha Manasu June 22nd: శైలేంద్ర ఎంట్రీ తర్వాత గుప్పెడంతమనసు సీరియల్ మొత్తం మారిపోయింది. రిషి ఇంట్లోంచి వెళ్లిపోయాడు, జగతిపై మహేంద్ర కోపం కంటిన్యూ అవుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

గుప్పెడంతమనసు జూన్ 22 ఎపిసోడ్

మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టులో తాను కూడా ఇన్వాల్వ్ అవుతానన్న శైలేంద్ర..రిషి ప్లేస్ రీప్లేస్ చేస్తాను అనగానే జగతి ఫైర్ అవుతుంది. రిషి ప్లేస్ రీప్లేస్ చేయాలి అనుకోవడం అసాధ్యం అని కరాఖండిగా చెప్పేస్తుంది. తన స్థానం తనదే తను చేసేది చేయడం ఎవ్వరికీ సాధ్యం కాని పని అని చెప్పేస్తుంది. ఫణీంద్ర కూడా జగతి మాటల్ని సపోర్ట్ చేసి మహేంద్ర నువ్వు బోర్డు మీటింగ్ పెట్టు, దేవయాని నువ్వు నీళ్లు తీసుకుని పైకిరా అనేసి వెళ్లిపోతాడు.

జగతి-మహేంద్ర
మహేంద్ర నువ్వు నాతో మాట్లాడవని తెలుసు, మీ అన్నయ్య కొడుకుని కొట్టడం నీకు తప్పుగా అనిపించవచ్చు కానీ నాకు నా కొడుకు ముఖ్యం, తనకోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడతాను, శైలేంద్ర అలా మాట్లాడినందుకు చేయి చేసుకున్నాను, రిషి నాకు ప్రాణం తనే నాకు సర్వశ్వం , మరో విషయం మహేంద్ర రేపు మిషన ఎడ్యుకేషన్ లో శైలేంద్ర ఇన్వాల్వ్ అవుతానంటున్నాడు అది  సంతోషించగల విషయమే కానీ ఓసారి ఆలోచించు. కేవలం చదువు మాత్రమే కాదు తన వ్యక్తిత్వాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాకే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ విషయం బోర్డులో అందరి ముందూ చెప్పలేను అందుకే ఇప్పుడు చెబుతున్నాడు అనేసి జగతి వెళ్లిపోతుంది. మహేంద్ర ఆలోచనలో పడతాడు. ఇదంతా విన్న శైలేంద్ర..నాపై బాబాయ్ కి చాడీలు చెబుతున్నారా నన్ను ఆపడం ఎవ్వరి వల్లాకాదనుకుంటాడు..

Also Read: మనసులో యుద్ధం చేస్తోన్న రిషిధార - రిషిని చంపించేశానన్న శైలేంద్ర మాటలు విని షాకైన దేవయాని!

మరోవైపు షాపింగ్ కి వెళ్లిన ఏంజెల్ రోడ్డుపై నిల్చుని కాల్ మాట్లాడుతూ ఉంటుంది. ఓ దొంగవచ్చి మెళ్లో చైన్ లాక్కెళ్లిపోతాడు. ఆ పక్కనే నిల్చున్న వసుధార కర్రతీసి దొంగపై విసిరి కిందపడేలా చేస్తుంది. వాడి దగ్గరకు వెళ్లి చైన్ లాక్కుని తీసుకొచ్చి ఏంజెల్ కి ఇస్తుంది. చాలా థ్యాంక్స్ అండీ ఈ చైన్ నాకు చాలా సెంటిమెంట్ అని చెబుతుంది ఏంజెల్...అప్పుడు తనచేతికున్న వీఆర్ ఉంగరం చూసుకుని వసుధార కూడా సెంటిమెంట్స్ గురించి చిన్న క్లాస్ వేస్తుంది. మీ పేరేంటి అంటే వసుధార అని చెబుతుంది. ఇద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. తనతో పాటూ ఇంటికెళుతుంది. విశ్వనాథం ఇల్లని తెలుసుకుని ఇది మీ ఇల్లా అని ఏంజెల్ ని అడుగుతుంది. అవును నీకెలా తెలుసు అని అడుగుతుంది. నేను మీ కాలేజీలో లెక్చరర్ ని అని చెబుతుంది. అయితే మా రిషి కూడా మీకు తెలిసే ఉంటుంది పెద్దగా మాట్లాడడు అని చెప్పి లోపలకు రా కాఫీ తాగి వెళుదుగానివి అని తీసుకెళుతుంది. 

విశ్వనాథం ఇంట్లో
లోపలకు వెళ్లిన తర్వాత జరిగినదంతా చెబుతుంది ఏంజెల్. విశ్వనాథం మెచ్చుకోవడంతో తనకి అసలు నేను నీ మనవరాలిని అని తెలియదంటుంది. విశ్వనాథం-ఏంజెల్ ఇద్దరూ వసుని పొగిడే పనిలో పడతారు. వసు అటు ఇటు గమనిస్తుంటుంది..ఏంటి ఏమైనా వెతుకుతున్నావా అంటుంది ఏంజెల్. ఇంతలో వచ్చిన రిషి ఎవరో ఉన్నారని చూసి వెనక్కు వెళ్లిపోతుంటాడు..అప్పుడు వెనక్కు పిలిచిన ఏంజెల్ వసుధారని పరిచయం చేస్తుంది. నాకు బాగా తెలుసని ఇద్దరూ చెప్పడంతో ఆశ్చర్యపోతుంది ఏంజెల్. వాళ్లిద్దరూ ఒకరికొకరు బాగా తెలుసు , ఈ అమ్మాయే కేడీ బ్యాచ్ పై కంప్లైంట్ ఇచ్చిందని జరిగినదంతా మొత్తం చెబుతాడు విశ్వనాథం. అసలు రిషి కాలేజీకి వెళుతున్నాడంటే వసుధారే కారణం అంటాడు. థ్యాంక్స్ చెబుతుంది ఏంజెల్. రిషి చెప్పగానే రిజైన్ చేయకుండా ఆగిపోయిందని తెలియగానే ఏంజెల్ అదేంటి చెప్పగానే ఎలా ఆగిపోయావ్ అని అడుగుతుంది. కొంతమంది చెబితే వినాలి అనిపిస్తుందని ముక్తసరిగా సమాధానం చెబుతుంది వసుధార. అయినా మీ ఇద్దరి మధ్యా పరిచయం ఉన్నా మౌనంగా ఉన్నారేంటని వరుస ప్రశ్నలు వేస్తుంది ఏంజెల్. ఆ తర్వాత వసుధార వెళ్లొస్తానని చెబుతుంది. రిషి డ్రాప్ చేయవా అని ఏంజెల్ అడిగితే నాకు చాలా ముఖ్యమైన పని ఉందంటాడు రిషి. తను నాకోసం చాలా రిస్క్ చేసింది తను నా ఫ్రెండ్ ప్లీజ్ రిషి అని బతిమలాడుతుంది కానీ రిషి అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు. వసుధార పర్వాలేదని చెప్పి వెళ్లిపోతుంది. 

ALso Read: శైలేంద్ర చెంప పగలగొట్టిన జగతి- తల్లీకొడుకులకి వార్నింగ్ ఇచ్చిన ఫణీంద్ర, నిజం తెలుసుకున్న దేవయాని

ఓవైపు రిషి మరోవైపు వసుధార ఇద్దరూ ఎవరికి వారు మాట్లాడుకుంటారు
రిషి: వద్దన్నా వెంటపడుతోంది, పాత జ్ఞాపకాలను తవ్వుతూ ఎందుకు బాధపెడుతోంది 
వసు: సారీ సార్ మిమ్మల్ని బాధపెట్టాలని అనుకోను..మీకు ఇష్టం లేని గతాన్ని గుర్తుచేయను.మీరు మళ్లీ మన ప్రేమను గుర్తించేవరకూ వెయిట్ చేస్తాను
రిషి: నువ్వు ఎంత వెయిట్ చేసినా ఫలితం ఉండదు.నువ్వు నాకోసమే ఇక్కడుక వచ్చావని తెలుసు
వసు: మీకోసం రాలేదు..ఏంజెల్ ఆ ఇంటి మనిషి అని తెలియక వచ్చాను
రిషి; నా మాటకు విలువ ఇవ్వడం లేదు
వసు: విలువ ఇచ్చాను కాబట్టే మీపై ఉన్న ప్రేమను చెప్పలేకపోతున్నాను. కచ్చితంగా మీ మనసులో నేనున్నా..రిషిధార బంధం అది
రిషి: బంధాన్ని తెంపేశావు కదా..ఎప్పటికీ నిన్ను క్షమించను..నమ్మకాన్ని చంపేశారు..ఇక ఏ నిజం తెలిసినా లాభం ఉండదు
వసు: ఏదో ఓ రోజు మీ జీవితంలోకి నిండుపున్నమి వస్తుంది మీరు ప్రశాంతంగా ఉంటారు. ప్రేమ వర్షం తడుపుతుంది

ఎపిసోడ్ ముగిసింది

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget