Guppedanta Manasu June 20th: శైలేంద్ర చెంప పగలగొట్టిన జగతి- తల్లీకొడుకులకి వార్నింగ్ ఇచ్చిన ఫణీంద్ర, నిజం తెలుసుకున్న దేవయాని
Guppedantha Manasu June 20th: శైలేంద్ర ఎంట్రీ తర్వాత గుప్పెడంతమనసు సీరియల్ మొత్తం మారిపోయింది. రిషి ఇంట్లోంచి వెళ్లిపోయాడు, జగతిపై మహేంద్ర కోపం కంటిన్యూ అవుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
విశ్వనాథంతో కలిసి రిషి చెస్ ఆడుతూ ఉంటాడు. ఈ ఆటలో రిషినే గెలుస్తాడు నువ్వు ఒడిపోతావని ఏంజెల్ అనేసరికి అలా మాట్లాడకూడదు తప్పని రిషి అంటాడు. ఏంటి రిషి నువ్వు మీ తాతయ్యకి సపోర్ట్ చేస్తావా అని అడుగుతుంది. సారి తాతయ్య మీ కలని నెరవేర్చలేకపోయానని బాధపడతాడు. ఆటలో విశ్వనాథంతో రిషి ఒడిపోతాడు. నా జీవితమే తప్పు అయిపోయిందని మనసులో అనుకుంటాడు. రిషి డల్ గా ఉండటం చూసి ఏంజెల్ డౌట్ పడుతుంది. ఎన్ని సంవత్సరాలు అవుతున్నా రిషిలో ఈ మూడ్ నెస్ పోవడం లేడని అంటుంది. అవును రిషి మనసు చాలా గాయపడింది అది మానేవరకు తను మామూలు మనిషి కాలేడని పెద్దాయన అంటాడు. ఇలా అయితే ఎలా ఎన్ని సార్లు అడిగినా తన గతం చెప్పడం లేదని ఫీల్ అవుతుంది. నువ్వు తనకి నిజంగా బెస్ట్ ఫ్రెండ్ అయితే తనని ఇబ్బంది పెట్టొద్దని విశ్వనాథం చెప్తాడు. తను నాకు లైఫ్ టైమ్ ఫ్రెండ్ అంతే తప్ప ఇంకేమీ లేదని క్లారిటీ ఇస్తుంది.
మహేంద్ర పోలీస్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి రిషి గురించి ఏమైనా తెలిసిందా అని ఆరా తీస్తాడు. ఏం బాధపడకు ఈరోజు వసు గురించి తెలిసింది ఏదో ఒక రోజు రిషి ఎక్కడ ఉన్నాడో కూడా తెలిసిపోతుందని ధైర్యం చెప్తాడు. ధరణి వచ్చి మహేంద్రని పలకరిస్తుంది. రిషి మనకు ఎంతో దూరం లేడని దగ్గర్లోనే ఉన్నాడని అనిపిస్తుంది. కాకపోతే మనకి కనిపించకుండా తిరుగుతున్నాడని అనిపిస్తుందని మహేంద్ర అంటాడు.
Also Read: ఆదిత్య కిడ్నాప్ కి స్కెచ్- అభిమన్యుకి చుక్కలు చూపించిన రత్నం, శర్మ
ధరణి; రిషి మీకు దొరకడు కనిపించడు. రిషి గురించి ఏదైనా తెలిస్తే వసుకి మొదట తెలుస్తుందని నా నమ్మకం. రిషి ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటాడు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తూ ఉండగా శైలేంద్ర తనని పిలుస్తాడు. రిషి క్షేమంగా ఉంటాడని చెప్తున్నావ్ నువ్వు ఏమైనా చూశావా లేదంటే వాడు నీకు ఫోన్ చేశాడా అని నిలదీస్తాడు. చేయలేదు ఒక వేళ చేస్తే క్షేమంగా ఉంటాడని చెప్పను కదా ఉన్నాడని చెప్తాను తను నింద వేస్తే వెళ్ళిపోయాడు కోపం తగ్గితే తిరిగి వస్తాడని ధరణి అంటుంది.
శైలేంద్ర: రిషి ఇక తిరిగి రాడు
ధరణి: నిజానిజాలు తెలుసుకుని రిషి కచ్చితంగా తిరిగి వస్తాడు
శైలేంద్ర: అసలు ఆ మనిషి భూమ్మీద ఉండాలి కదా? వాడు అసలు బతికి లేడెమో అనగానే జగతి చెంప చెల్లుమనిపిస్తుంది
ఆ సౌండ్ కి ఇంట్లో అందరూ వచ్చేస్తారు. ఏం జరిగిందని దేవయాని అడుగుతుంది. ఏం జరిగిందో నువ్వు చెప్పు జగతి అని ఫణీంద్ర అడుగుతాడు. ధరణి నువ్వు చెప్పు అంటే ఈయన రిషి గురించి ఒక మాట జారారు, తను బతికి లేడెమో అన్నాడని చెప్తుంది. చిన్నత్తయ్య కోపంతో కొట్టారని అనేసరికి ఫణీంద్ర వెంటనే కోపంగా ఏం కూశావ్ ని చొక్కా పట్టుకుంటాడు.
ఫణీంద్ర: వీడు చాలా తప్పుగా మాట్లాడాడు కొట్టడం కాదు ఏం చేసినా తప్పు కాదు. ఆ మాట వింటే నాకే కోపం వచ్చింది ఇక జగతి తన కన్న తల్లి తనకి ఎంత కోపం రావాలి. అదే నేనయితే ఏం చేసే వాడినో కూడా తెలియదు. వీడు హద్దు దాటి ప్రవర్తిస్తున్నాడు. నేను మహేంద్ర ఎలా ఉన్నాడో నువ్వు రిషి అలాగే ఉండాలి. నేను మహేంద్ర క్షేమం ఎలా కోరుకుంటానో నువ్వు కూడా రిషి క్షేమం కూడా అలాగే కోరుకోవాలి. ఇంకోసారి ఇలాంటి మాటలు నీ నోటి నుంచి వస్తే సహించేది లేదు
మహేంద్ర: అయినా నువ్వు ఇలా మాట్లాడటం ఏంటి? రిషి గురించి మాకు ధైర్యం చెప్పాల్సింది పోయి ఇలా కీడు మాట్లాడటం ఏంటి?
దేవయాని: నువ్వు రిషిని అంత మాట మాట్లాడటం ఏంటి చాలా తప్పుగా మాట్లాడావ్. అసలు రిషి ఎవరు నీ తమ్ముడు ఇలా అనొచ్చా నేను నీ కన్నతల్లిని నాకు నీకన్నా రిషి ఎక్కువ.
Also Read: స్వప్న వేషాలు చూసి బిత్తరపోయిన రాజ్ ఫ్యామిలీ- కనకం నెత్తిన మరో బాంబ్
ఫణీంద్ర: వీలైతే రిషి గురించి వెతకడానికి ట్రై చెయ్యి లేదంటే ఇలా మాట్లాడకు. దేవయాని నీ కొడుకు గాడి తప్పుతున్నాడు సరైన దారిలో పెట్టకపోతే ప్రతిఫలం నువ్వు కూడా అనుభవించాల్సి వస్తుంది.
శైలేంద్ర ఏదో నోరు జారీ ఒక మాట అంటే కోడతావా అని దేవయాని నిలదీస్తుంది. అవును కొడతానని కోపంగా అంటుంది. నేను అంటాను కొడతావా అంటే అవును కొడతానని కోపంగా చెప్తుంది. రిషి వసు గురించి ఆలోచిస్తాడు. నిన్ను, మేడమ్ ని ఎంతగా నమ్మాను కానీ మీరు నా మీద మచ్చవేసి చాలా పెద్ద తప్పు చేశారని అనుకుంటాడు. అటు వసు కూడా రిషి ఫోటో చూస్తూ బాధపడుతుంది. జగతిని రెచ్చగొడితే తన కోపాన్ని మనం తట్టుకోలేమని కాస్త ఓపిక పట్టాలని దేవయాని కొడుక్కి నచ్చజెపుతుంది. కానీ శైలేంద్ర మాత్రం వినడు. అందరికీ నిజం చెప్పేస్తానని అంటాడు. ఏంటి ఆ నిజమని దేవయాని అంటే రిషి ప్రాణాలతో లేడని అనేసరికి దేవయాని షాక్ అవుతుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial