Ennenno Janmalabandham June 20th: ఆదిత్య కిడ్నాప్ కి స్కెచ్- అభిమన్యుకి చుక్కలు చూపించిన రత్నం, శర్మ
మాళవికని తీసుకొచ్చి వేద ఇంట్లో పెట్టుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
ఖుషి బర్త్ డే వేడుకల్లో వేద గురించి చాలా గొప్పగా చెప్తుంది. వేద అమ్మ దేవుడిచ్చిన అమ్మ, మా నాన్న దగ్గరకి వచ్చి నన్ను తన కన్నకూతురిలాగా చూసుకుందని చెప్తుంది. అదంతా అభిమన్యు విని నా బంగారం పరిస్థితి. అక్కడ ప్రేమ దొరికితే తనలో పగ చచ్చిపోతుంది. ఇలాగే ఉంటే పగ తీరుతుందని అంటాడు. నాకే కాదు మా నాన్నకి కూడా వేద అమ్మ వరం. ఆయన బాధలో ఉన్నప్పుడు దేవతలా వచ్చింది అంతే నాన్న బాధ అంతా పోయింది. మా ఇల్లు సంతోషంగా ఉందంటే కారణం వేద అమ్మ. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. తను లేకపోతే మేము ఎవరు లేము. మా సంతోషం కోసం చాలా త్యాగాలు చేసిందని ఐలవ్యూ చెప్తుంది. నేను ఆడుకునే ప్లాస్టిక్ ఉంగరం తొడిగితే ఇప్పటి వరకు అదే ఉంచుకుంది. ఇప్పుడు దానికి బదులు వేరేది తొడగాలి. అందుకే నాన్న దాచిన ఉంగరం తీసుకొచ్చానని చెప్పి యష్ కి అందిస్తుంది. ఆ రింగ్ ని యష్ ప్రేమగా భార్య వేలికి పెడతాడు.
Also Read: లాస్య సైకో ప్రేమకు వణికిపోయిన నందు- కూతురితో పాటు అత్తకి గడ్డి పెట్టిన విక్రమ్
అందరూ వేదని మెచ్చుకోవడం చూసి మాళవిక రగిలిపోతుంది. నా కుటుంబాన్ని సమస్యల నుంచి బయట పడేశావు. నీ గొప్పతనం ఎంత చెప్పినా కూడా నా జీవితం సరిపోదు. ఎన్ని సార్లు చెప్పినా తనివి తీరదు మళ్ళీ చెప్తున్న ఐ లవ్యూ వేద అని అందరి ముందు చెప్తాడు. చిత్ర, వసంత్ సంతోషంగా ఉండటం చూసి అభిమన్యు రగిలిపోతాడు. మాళవిక యష్ దగ్గరకి వచ్చి మాట్లాడాలని అంటుంది.
మాళవిక: నిన్ను, నీ ఫ్యామిలీని బాధపెట్టినా కూడా అదేమీ పట్టించుకోకుండా నన్ను, నా కొడుకుని ఇంటికి తీసుకొచ్చి ప్రేమగా చూసుకుంటున్నారు. మన కూతురు ఖుషి నీతో వేదతో హ్యాపీగా చూసుకుంటున్నారు. నేను మారిపోయాను. నన్ను చూసిన ప్రతిసారీ నీ కళ్ళలో ఒక శత్రువుని చూసిన ఫీలింగ్ కలిగేది. కానీ ఇప్పుడు నీ కళ్ళలో జాలి కనిపిస్తుంది. చాలా థాంక్స్ నా తప్పులు క్షమించు
యష్: నీ తప్పులు బోర్డర్ దాటేశాయ్. విరిగిపోయిన అద్దం ఎలా అతుక్కోదో అలాగే నీతో ఫ్రెండ్షిప్ కూడా కుదరదనేసి వెళ్ళిపోతాడు.
Also Read: ముకుంద ఆత్మహత్యాయత్నం- కృష్ణతో మనసులో మాట చెప్పలేకపోయిన మురారీ
తలవంచి మరీ అపాలజీ అడిగాను ఎందుకు పనికిరాని దానిలా తీసిపారేశావు. నువ్వు ఎప్పుడు మారతావు అప్పటి వరకు ఎదురుచూస్తానని మనసులో అనుకుంటుంది. అభిమన్యు వాళ్ళు ఆదిత్యని కిడ్నాప్ చేయడానికి స్కెచ్ వేస్తారు. సరిగా ఆదిత్యకి మత్తు మందు పెట్టె టైమ్ కి రత్నం, శర్మ వస్తారు. తాగేసి తూలుతూ పాటలు పెడతాను మీరు డాన్స్ చేసి తీరాల్సిందేనని అంటారు. బాస్ నువ్వు చేయొద్దులే కానీ ఎలాగోకలా నేనే చేస్తానని ఎగురుతాడు. చాలా బాగా డాన్స్ చేశావని అందరూ మెచ్చుకుంటారు. జోకర్ డ్రెస్ మనం వేసుకుందామని రత్నం అనేసరికి ఆ డ్రెస్ ఇవ్వమని అభిమన్యు వాళ్ళ వెంట పడతారు. దీంతో వాళ్ళు అలా చేయడం కుదరదని పారిపోతారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial