(Source: Poll of Polls)
Gruhalakshmi June 19th: లాస్య సైకో ప్రేమకు వణికిపోయిన నందు- కూతురితో పాటు అత్తకి గడ్డి పెట్టిన విక్రమ్
నందు జైలు నుంచి విడుదల కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
రాజ్యలక్ష్మి విక్రమ్ దగ్గరకి వచ్చి మళ్ళీ నాటకం మొదలుపెడుతుంది. దివ్య దగ్గరకి వెళ్ళి తనని బతిమలాడమని చెప్తుంది. తను మా అమ్మని బాధపెట్టిందని విక్రమ్ భజన స్టార్ట్ చేస్తాడు. నా ముందే నీమీద ఇంతగా అరిచిందంటే నేను లేనప్పుడు ఎలా ఉంటుందో. అన్నీ మర్చిపోయి తనతో ప్రేమగా మాట్లాడటం తన వల్ల కాదని అంటాడు. అంటే ఏంటి దివ్య మొహం కూడా చూడవా అని మంచి మాటలు చెప్తున్నట్టు నటిస్తుంది. ఇప్పుడు మీరు అలిగి దూరమైతే చెడ్డ పేరు నాకే సవతి తల్లి కాబట్టి కొడుకు కాపురం పోతున్నా చూస్తూ ఊరుకుంది అదే కన్న తల్లి అయితే చూస్తూ ఉంటుందా అంటారు. నువ్వు వెళ్ళి దివ్యతో మాట్లాడి సోరి చెప్పమని పంపింస్తుంది. దివ్య కోపంగా కూర్చుని ఉంటే విక్రమ్ వస్తాడు. ఎంత పొగరు నేను వస్తున్నా అలికిడి తెలిసి కూడా తల తిప్పి చూడలేదు కానీ అమ్మ మాటకి తలవంచక తప్పదని అనుకుంటాడు.
ముందు నువ్వు మాట్లాడొచ్చు కదా అంటే నువ్వు మాట్లాడొచ్చు కదా అని ఇద్దరూ పోట్లాడుకుంటారు. మా అమ్మని ఎదిరించి వెళ్ళడం మొదటి తప్పు, తనని ఎదిరించి వెళ్ళి మాట్లాడటం రెండో తప్పని విక్రమ్ అరుస్తాడు. దివ్య మాత్రం తన ఆత్మాభిమానం దెబ్బతిందని అంటుంది. అప్పటికీ అమ్మతో చెప్పాను మొండితనం వినదని కానీ అమ్మ మాత్రం వినిపించుకోకుండా వెళ్ళి భోజనానికి రమ్మని చెప్పిందని అంటాడు. అంటే నా మీద ప్రేమతో రాలేదు అమ్మ చెప్పిందని వచ్చావా థాంక్స్ వెళ్ళి రండి అనేసి భర్త మీద అరుస్తుంది. దీంతో విక్రమ్ కోపంగా వెళ్ళిపోతాడు. నందు ఎక్సర్ సైజ్ చేస్తుంటే లాస్య వస్తుంది. మాట్లాడకుండ వెళ్లిపోతుంటే లాస్య వెంటపడుతుంది.
Also Read: ముకుంద ఆత్మహత్యాయత్నం- కృష్ణతో మనసులో మాట చెప్పలేకపోయిన మురారీ
లాస్య: నాకు అడ్డు పడ్డ వాళ్ళని ఈ లోకం నుంచి తప్పింది నా దారి చూసుకుందామని అనుకున్నా. ముందు మీ అమ్మానాన్న మీద ట్రైల్ వేశాను నీలాగా వద్దని అనకుండా తాగేశారు. కానీ వాళ్ళకి తెలియదు కదా అందులో విషం కలిపానని. నీకు తెచ్చిన టీలో కలిపాను కానీ నువ్వు తాగలేదు తప్పించుకున్నావ్ అనేసరికి నందు కోపంగా తన గొంతు పట్టుకుంటాడు.
నందు: మా అమ్మానాన్నకి విషం ఇస్తావా? అని కోపంగా తిట్టేసి అనసూయ వాళ్ళ గదికి వెళతాడు. అక్కడ అనసూయ, పరంధామయ్య బెడ్ మీద స్పృహ లేకుండా పడి ఉండటం చూసి భయపడతాడు. లాస్య, రాములమ్మ గదిలోకి వస్తారు. మళ్ళీ లాస్య గొంతు పట్టుకుని ఏం చేశావ్ మా అమ్మానాన్నని అని అరుస్తాడు. పెద్దయ్యగారికి ఊపిరి ఆడుతుందని రాములమ్మ చెప్పేసరికి ముసలోళ్ళు కదులుతారు. వెంటనే అంబులెన్స్ కి కాల్ చేస్తుంటే లాస్య ఫోన్ లాగేసుకుంటుంది. వాళ్ళకి స్లీపింగ్ పిల్స్ ఇచ్చాను కాసేపటికి లేస్తారని చెప్తుంది. కోర్టు ఇచ్చిన 30 రోజుల్లో నిన్ను బయటకి గెంటేస్తానని అంటాడు. అయితే అదే గడువు లోపల నిన్ను మళ్ళీ జైలుకి పంపిస్తాను, దివ్య జీవితం కూడా నాశనం చేస్తానని బెదిరిస్తుంది.
Also Read: కేడీ బ్యాచ్ తిక్క కుదురుస్తున్న రిషి- గతాన్ని గుర్తు చేయొద్దని వసుకి వార్నింగ్
లాస్య చెప్పినట్టు వినండి పిచ్చిలో ఏమైనా చేస్తుందని రాములమ్మ సలహా ఇస్తుంది. ఇదంతా నీమీద ప్రేమతోనే చేస్తున్నా ఆలోచించుకుని సరేనని మాత్రమే చెప్పమని వార్నింగ్ ఇస్తుంది. విక్రమ్ కారుకి ఎదురుగా తులసి నిలబడుతుంది. దివ్యతో జరిగిన గొడవ తెలుసుకుని మమ్మల్ని విడదీయడానికి వచ్చి ఉంటుందని అనుకుంటాడు. దివ్య మీద చెయ్యి లేపడం కరెక్ట్ కాదని చెప్తుంది. తన కూతురిది చాలా మంచి మనిషని అంటుంది. నా మనసు ఎంత గాయపడేలా చేసిందో ఊహించవచ్చు కదా అది ఆలోచించరా అంటాడు. కష్టపెట్టకుండా కన్నీళ్ళు పెట్టకుండా చూసుకోమని తులసి కోరుకుంటుంది. దివ్య చెప్పిన దాంట్లో ఎంతో కొంత నిజం ఉండి ఉంటుంది అది ఏంటో తెలుసుకోవచ్చు కదా అంటుంది. అంటే ఏంటి మీ ఉద్దేశం మా అమ్మ తప్పు చేసిందని అంటారా? నాకు కాదు నచ్చజెప్పడం భర్తతో ఎలా మెలగాలో కూతురికి చెప్పొచ్చు కదా ఎందుకు నన్ను వేలెత్తి చూపిస్తున్నారని అత్తని నిలదీస్తాడు.