అన్వేషించండి

Guppedanta Manasu June 14th: ఈగోమాస్టర్ ఈజ్ బ్యాక్, వసుకి క్లారిటీ - కేడీ బ్యాచ్ కి పెద్ద షాక్ ఇచ్చిన రిషి!

Guppedantha Manasu June 14th Update: శైలేంద్ర భూషణ్ ఎంట్రీ...ఎండీ సీటుకోసం రిషిని కుట్ర చుట్టూ గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

వసు రాజీనామా లేఖని ప్రిన్సిపల్ ముందే చించేస్తాడు రిషి. మరోవైపు మహేంద్ర వసు వివరాలు తెలుసుకోమని తన ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ ను అడుగుతాడు. ఆ విషయం చెప్పేందుకే పోలీస్ ఆఫీసర్ ఇంటికి వస్తాడు
మహేంద్ర ఫ్రెండ్: వసుధార వరంగల్‌లో ఉంది. తన ఫోన్ నంబర్ ట్రేజ్ చేసి కనిపెట్టింది ఏంటంటే.. తను అక్కడ విష్ కాలేజ్‌లో లెక్చరర్‌గా పని చేస్తోంది. నువ్వు వెళ్తావా మరి..’
మహేంద్ర: ‘వెళ్తాను రా.. ఇప్పుడు బయలుదేరతాను తనను అడిగి అసలు నిజం తెలుసుకుంటాను. రిషిని అప్పుడు వెతుకుదాం’
పోలీస్ ఆఫీసర్ సరేరా జాగ్రత్త అని చెప్పేసి వెళ్లిపోతాడు
ఇదంతా విన్న జగతి బాధపడుతుంది. తాను కూడా వస్తానని అడిగినా వద్దని చెప్పు ధరణి...అయినా నువ్వు చేసిందేం చిన్న మోసమా? నువ్వు నాతో ఉంటే వాళ్లు నాతో కూడా మాట్లాడరని చెప్పేసి వెళ్లిపోతాడు. నిజం తెలిసి సుమిత్ర గారి ప్రాణం పోయింది. ఇప్పుడు నిజం తెలుసుకుని మహేంద్రకు ఏం అవుతుందో దేవుడా వసు నిజం చెప్పకుండా చూడు అని మొక్కకుంటుంది.

Also Read: ఈ రోజు యోగినీ ఏకాదశి - విశిష్ఠత ఏంటి , ఏం చేయాలి!

రిషి-వసు
ఇక రిషి.. రాజీనామా లేఖను చించి వెళ్లిపోతుంటే వెనుకే వసు కూడా వెళ్తుంది. రిషి ఓ క్లాసు రూమ్‌ దగ్గర కోపంగా నిలబడి ఉంటాడు. వెనుకే వచ్చిన వసు నీడని చూసి అలాగే నిలబడి ఉండిపోతాడు. ఆనందంగా రిషికి దగ్గరగా వెళ్లాలని వసు అనుకుంటుంది కానీ రిషి కోపాన్ని గుర్తించి ఆగిపోతుంది రిషి: నా నీడని నమ్మడం నేను ఎప్పుడో మానేశాను..’ 
వసు: వచ్చింది నేను అని గుర్తుపట్టారు అది చాలు సార్ నాకు
రిషి: ఎందుకొచ్చావ్ ఇక్కడికి మీ మేడమ్ పంపించారా? లేదా మిగిలిన నా అవశేషాలను కూడా..
వసు: సార్ నేను రాలేదు సార్ ఇక్కడికి మీరే వచ్చారు
వసు: నీ కోసం మాత్రం రాలేదు
వసు: ఆ విషయం నాకు తెలుసు సార్. నాకోసం రాలేదు. రారు కూడా. కానీ నాకు అర్థం కానిది ఒకటుంది. మీరెందుకు నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నారు
రిషి: నువ్వు ఎందుకు వెళ్లాలనుకున్నావ్
వసు: మీ కోసమే సార్.. నేను ఉంటే మీరు ఉండరు.. మన గతం మిమ్మల్ని..
రిషి: వద్దు.. గతం గురించి నువ్వు మాట్లాడకు. వర్తమానం గురించి మాట్లాడు.. గతం గురించి నేను మాట్లాడను.. అయినా టైమ్ ట్రావెల్ చేసి గతంలోకి వెళ్లడానికి ఇవి ఆ రోజులు కావు.. టైమ్ మారింది. ప్లేస్ మారింది.. తల రాత మారింది.. కాదు కాదు కాదు.. మార్చారు..
వసు: మీరు అలానే ఉన్నారు సార్
రిషి: లేదు మారాను.. చాలా మారeను.. ఇలా మార్చింది ఎవరో నేను గుర్తు చేసుకోదలచుకోలేదు. నువ్వు చెప్పినట్లు కాలేజ్ నుంచి వెళ్లిపోయి త్యాగం చెయ్యాలనుకున్నావ్ అంతేనా అంటాడు కోపంగా. 
వసు: ఈ కాలేజ్‌కి నా అవసరం కంటే మీ అవసరమే ఎక్కువగా ఉంది.
రిషి: అవసరం కాదు బాధ్యత.. నిన్ను చూసి పారిపోతాను అనుకుంటున్నావా, నువ్వు నా గతం, నేను ఎప్పటికీ నిన్ను గుర్తించుకోవాలనుకోవట్లేదు.. ఎందుకంటే నేను నా గతాన్ని ఎప్పుడో వదిలేశాను. వదిలేసిన వాటిని గుర్తు చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అప్పుడు నువ్వు వసుధారవి.. ఇప్పుడు కాలేజ్‌కి కొత్త లెక్చరర్‌వి.
వసు: అవును సార్ పంతులమ్మని. ఒకప్పుడు ఇలా పాఠాలు చెప్పాలని కలలు కన్న పంతులమ్మని.. ఇప్పుడు దాన్ని నేను నిజం చేసుకున్నాను
రిషి: సంతోషం.. పాఠాలు చెప్పుకుంటూ గడిపెయ్.. నా జోలికి మాత్రం రాకు. జీవితంలో నన్ను మోసం చేసి వాళ్లే, ద్రోహం చేసిన వాళ్లే కాకుండా.. కల్మషం లేకుండా సాయపడేవాళ్లు కూడా నాకు ఎదురయ్యారు. వాళ్లకి రుణం తీర్చుకోవాలి కదా.. వాళ్లు కోరింది కూడా చేస్తాను. విశ్వనాథం గారు నా బాధ్యత. నన్ను ఈ కాలేజ్‌లో పాఠాలు చెప్పమన్నారు. నాతో పాటు నువ్వు కూడా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నారు.. సో.. ఆయన అనుకున్నారు కాబట్టి నువ్వు ఇక్కడుండాలి.
వసు: ఉంటాను సార్
రిషి: ఉండు.. నువ్వు పాఠాలు చెప్పే వసుధారగా ఉండు.. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటారు కదా.. అలా.. ఇది కాలేజ్.. మంచేది చెడేది ఇక్కడే నేర్పించాలి. కాలేజ్ మూసేస్తానని విశ్వనాథం గారు అన్న మాట నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. ఎవరి కోసమే నాకు ఆయన చేసిన మంచిని వదిలేయడం మంచిది కాదు అనిపించింది. ఒక్కటి గుర్తు పెట్టుకో.. ఈ ప్రయాణంలో మన దారులు ఎప్పటికీ కలవవు. నీకు తెలిసిన నా గతాన్ని ఎవ్వరికీ చెప్పే ప్రయత్నం చేయకు..’ అంటాడు రిషి కోపంగా. నా ఉనికి నా కుటుంబానికి కూడా తెలియడం నాకు ఇష్టం లేదు.. నాకు ఇష్టం లేని పని ఎదుటివారు చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు. ఇవి కండీషన్స్ కావు.. కానీ వీటిని దాటితే ఏం జరుగుతుందో నీ విజ్ఞ‌తకే వదిలేస్తున్నా
వసు: నేను పాత రిషీంద్ర భూషణ్‌ని చూస్తున్నట్లు అనిపిస్తోంది
రిషి: పాత రిషీంద్ర భూషణ్‌నే ఓ గురుశిష్యులు మాయం చేశారు. ఇప్పుడు కేవలం రిషినే.. తన బతకు తాను బతికే ఒక మామూలు సాదాసీదా వ్యక్తిని.. మళ్లీ చెబుతున్నాను నా గతాన్ని గుర్తు చెయ్యాలని చూడొద్దు.. దానికి పర్యవసానం అనుభవించే శక్తి నీకు నాకు లేదేమో.

Also Read: వసు ఇచ్చిన రిజైన్ లెటర్ చించేసిన రిషి, టామ్ అండ్ జెర్రీ వార్ మళ్లీ మొదలు!

మరోవైపు మహేంద్ర విష్ కాలేజ్‌కి బయలుదేరతాడు. వసుధార కూడా రిషి గురించి ఎవరికీ చెప్పను అని మాటిస్తుంది. అయినా మనం ఎప్పటికీ విడిపోము అనడానికి ఇది తొలిమెట్టు.. మన ప్రేమే మళ్లీ మనల్ని దగ్గర చేస్తుంది. నా రిషి సార్‌ని తిరిగి ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. మీకు మాటిస్తున్నాను.. మన ప్రేమ మళ్లీ మొదలవుతుంది. ఈ వసుధార మళ్లీ రిషిధారగా మారుతుంది’ అని అనుకుంటుంది

మరోవైపు రిషి క్లాస్ చెబుతోండ‌గా మీద పేడ నీళ్లు ప‌డేలా బెలూన్‌లో సెట్ చేస్తారు. కానీ వారి ప్లాన్ క‌నిపెట్టిన రిషి ఆ బెలూన్‌ను తానే ప‌గ‌ల‌గొడ‌తాడు. ఇది ఎవ‌రో చేశారో నాకు బాగా తెలుసు. వారే స్వ‌యంగా ఈ పేడ‌నీళ్ల‌ను క్లీన్ చేయాల‌ని రిషి కేడీ బ్యాచ్‌తో సీరియ‌స్‌గా చెబుతాడు. క్లీన్ చేసిన త‌ర్వాతే క్లాస్ స్టార్ట్ చేస్తాను. అప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి వీలులేద‌ని అంటాడు. ఒక‌వేళ క్లీన్ చేయ‌క‌పోతే ప‌నిష్‌మెంట్ తీవ్రంగా ఉంటుంద‌ని కేడీ బ్యాచ్‌ను భ‌య‌ప‌డెతాడు. ఆ విషయం గురించి పాండ్యన్ కాల్ చేసి తండ్రికి చెబుతాడు. కానీ రిషి ఇచ్చిన వార్నింగ్ గురించి గుర్తుచేసుకున్న మురుగన్ అదే విషయం పాండ్యన్ కు చెబుతాడు. వాడు చూడ‌టానికి సాఫ్ట్‌గా క‌నిపిస్తున్నాడు కానీ నిజంగానే సింహం అని మురుగ‌న్ భ‌య‌ప‌డుతూ పాండ్య‌న్‌తో చెబుతాడు. రిషి చెప్పిన ప‌ని చేయ‌మ‌ని కొడుకుకు స‌ల‌హా ఇస్తాడు. తండ్రి మాట‌ల‌తో పాండ్య‌న్ షాక్ అవుతాడు. 
గుప్పెడంత మ‌న‌సు ఎపిసోడ్ ముగిసింది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandra Babu Davos Tour : ఆదివారం దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు- WEFలో ప్రపంచ బిజినెస్ దిగ్గజాలతో సమావేశాలు, షెడ్యూల్ ఇదే
ఆదివారం దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు- WEFలో ప్రపంచ బిజినెస్ దిగ్గజాలతో సమావేశాలు, షెడ్యూల్ ఇదే
Telangana Ration Cards: రేషన్ కార్డులపై మరో గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి ఉత్తమ్‌- మళ్లీ దరఖాస్తులు తీసుకుంటామని వెల్లడి
రేషన్ కార్డులపై మరో గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి ఉత్తమ్‌- మళ్లీ దరఖాస్తులు తీసుకుంటామని వెల్లడి
Airbus: ఏపీలో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్ -  నేడో రేపో కీలక ప్రకటన చేసే చాన్స్
ఏపీలో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్ - నేడో రేపో కీలక ప్రకటన చేసే చాన్స్
Adilabad Latest News : అధికారులో వేధింపుతో బ్యాంకులోనే రైతు ఆత్మహత్య-కుటుంబ సభ్యుల ఆందోళన-రుణమాఫీకి అంగీకారం
అధికారులో వేధింపుతో బ్యాంకులోనే రైతు ఆత్మహత్య-కుటుంబ సభ్యుల ఆందోళన-రుణమాఫీకి అంగీకారం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Priest Touches Hydraa Commissioner Feet | కన్నీళ్లతో హైడ్రా కమిషనర్ కాళ్లు పట్టుకున్న పూజారి | ABP DesamCM Chandrababu on Population | పెద్ద కుటుంబమే పద్ధతైన కుటుంబం | ABP DesamMohammed shami Jasprit Bumrah CT 2025 | నిప్పులాంటి బుమ్రా...పెను తుపాన్ షమీ తోడవుతున్నాడు | ABP DesamTeam India Squad Champions Trophy 2025 | ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా జట్టు ఇదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandra Babu Davos Tour : ఆదివారం దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు- WEFలో ప్రపంచ బిజినెస్ దిగ్గజాలతో సమావేశాలు, షెడ్యూల్ ఇదే
ఆదివారం దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు- WEFలో ప్రపంచ బిజినెస్ దిగ్గజాలతో సమావేశాలు, షెడ్యూల్ ఇదే
Telangana Ration Cards: రేషన్ కార్డులపై మరో గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి ఉత్తమ్‌- మళ్లీ దరఖాస్తులు తీసుకుంటామని వెల్లడి
రేషన్ కార్డులపై మరో గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి ఉత్తమ్‌- మళ్లీ దరఖాస్తులు తీసుకుంటామని వెల్లడి
Airbus: ఏపీలో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్ -  నేడో రేపో కీలక ప్రకటన చేసే చాన్స్
ఏపీలో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్ - నేడో రేపో కీలక ప్రకటన చేసే చాన్స్
Adilabad Latest News : అధికారులో వేధింపుతో బ్యాంకులోనే రైతు ఆత్మహత్య-కుటుంబ సభ్యుల ఆందోళన-రుణమాఫీకి అంగీకారం
అధికారులో వేధింపుతో బ్యాంకులోనే రైతు ఆత్మహత్య-కుటుంబ సభ్యుల ఆందోళన-రుణమాఫీకి అంగీకారం
Ram Mohan Naidu News: టీడీపీ పొలిట్‌బ్యూరోలోకి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు- వారికి గుడ్‌బై చెప్పేస్తారా!
టీడీపీ పొలిట్‌బ్యూరోలోకి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు- వారికి గుడ్‌బై చెప్పేస్తారా!
Saif Ali Khan Attack: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో బిగ్ అప్‌డేట్‌- పోలీసుల అదుపులో అనుమానితుడు 
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో బిగ్ అప్‌డేట్‌- పోలీసుల అదుపులో అనుమానితుడు 
Telangana News : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి భట్టి- 25 గ్రామాల్లో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా మరో పథకం
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి భట్టి- 25 గ్రామాల్లో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా మరో పథకం
Amit Shah Andhra Pradesh visit : ఆంధ్రప్రదేశ్ చేరుకున్న హోంమంత్రి అమిత్‌షా- వచ్చిన వెంటనే ఏం చేశారంటే?
ఆంధ్రప్రదేశ్ చేరుకున్న హోంమంత్రి అమిత్‌షా- వచ్చిన వెంటనే ఏం చేశారంటే?
Embed widget