Guppedanta Manasu June 13th: వసు ఇచ్చిన రిజైన్ లెటర్ చించేసిన రిషి, టామ్ అండ్ జెర్రీ వార్ మళ్లీ మొదలు!
Guppedantha Manasu June 13th Update: శైలేంద్ర భూషణ్ ఎంట్రీ...ఎండీ సీటుకోసం రిషిని కుట్ర చుట్టూ గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
రిషి కనిపించాడన్న విషయం చెబుదామని కాల్ చేసిన వసుధారని తండ్రి ఆపేస్తాడు. ఆ తర్వాత మహేంద్ర నుంచి కాల్ రావడంతో చక్రపాణి తెలియక లిఫ్ట్ చేసి వసుధార చేతికిస్తాడు. రిషి సార్ గురించి ఏమైనా తెలిసిందా అని అడిగేసి కాల్ కట్ చేస్తుంది. మహేంద్రకి మాత్రం మనసులో ఏదో సందేహం వస్తుంది..వసుధార ఏదో దాస్తోంది అనిపించి ఆమె అడ్రస్ తెలుసుకుందామని వెళ్లిపోతాడు.ఇంకా వసుకి తనపై కోపం పోలేదని బాధపడుతుంది జగతి.
మరోవైపు ఇంటికెళ్లిన రిషి..వసుధార కనిపించిన విషయం గుర్తుచేసుకుని జరిగినదంతా తలుచుకుని బాధపడతాడు. నాకు జరిగిన మోసం, అన్యాయం నా మనసులో తిరుగుతుంటే ప్రశాంతంగా ఉండాలి, తను నాకు మళ్లీ కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి, కాలేజీకి వెళ్లకుండా ఉండాలి, వెళ్లకూడదంటే కారణం చెప్పాలి, అంటే గతం మొత్తం చెప్పాలి, అయితే ఇక్కడి నుంచి వెళ్లిపోవడమే మంచిది అనుకుంటాడు. ఆ తర్వాత విశ్వనాథం కాలేజీకి వెళ్లలేదా అని అడిగితే వెళ్లాలని అనిపించలేదంటాడు.
విశ్వనాథం: నువ్వు కాలేజీలో ఉంటే లెక్చరర్లకి ధైర్యంగా ఉంటుంది, ప్రిన్సిపాల్ సంతోషించారు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావ్
రిషి: ఈ ఒక్క విషయంలో ఏమీ అనొద్దు..ఇంకేం చెప్పినా చేస్తాను కాలేజీకి మాత్రం వెళ్లలేను
Also Read: ఒకరికొకరు ఎదురుపడిన రిషిధార- మహేంద్రకి ఫోన్ చేసిన వసు, కొడుకు ఆచూకీ తెలుసుకోగలుగుతాడా?
రిషి గురించి వెతుకుతున్న మహేంద్ర ఫ్రెండ్ పోలీస్ ఇంటికి వస్తాడు.
మహేంద్ర: వసుధార కాల్ చేసింది..ఏదో గట్టి కారణంతోనే కాల్ చేసి ఉండొచ్చు, అంటే రిషి జాడ తెలిసి ఉంటుందేమో
పోలీస్: అలా ఎందుకు అనుకుంటున్నావ్
మహేంద్ర: వసుధార డైలమాలో ఉండదు..రిషి అంటే నాకు ప్రాణమని తనకు తెలుసు రిషి కోసం ఏమైపోతానో అనేబాధ తనని వెంటాడుతుంటుంది. అందుకే నేను తనతో మాట్లాడనని తెలిసి కూడా కాల్ చేసింది కానీ విషయం చెప్పడం లేదు ఏదో దాస్తోందంటూ వసు నంబర్ తన పోలీస్ ఫ్రెండ్ కి ఇస్తాడు
పోలీస్: ఈ నంబర్ ఆధారంగా లొకేషన్ కనుక్కుని ఆఫీసర్స్ తో వెళ్లి రిషి గురించి తెలుసుకుంటాను
మహేంద్ర: రిషి కనిపించినా ఇంటికి రాడు..రిషిని ఇంటికి తీసుకురావాలంటే ముందుగా ఏం జరిగిందో తెలియాలి, జగతిని అడిగినా విషయం చెప్పడం లేదు కనీసం వసుధారని కలిస్తే అయినా నిజాలు తెలిసే అవకాశం ఉంది అప్పుడు రిషిని ఈజీగా ఇంటికి తీసుకురావొచ్చు
సరేరా అనేసి పోలీస్ ఫ్రెండ్ వెళ్లిపోతాడు...ఇదంతా విన్న జగతి కూడా రూమ్ లోకి వెళ్లిపోతుంది... ఎక్కడున్నావ్ ఏం చేస్తున్నావ్ అని మహేంద్ర బాధపడతాజు
కాలేజీ ఎండీ విశ్వనాథంను కలుస్తుంది వసుధార
రిషి అడ్రెస్ కోసం కాలేజీ ఛైర్మన్ విశ్వనాథం ఇంటికి వెళ్లిన వసుధారతో తను ఇక్కడే ఉంటున్నాడని చెబుతాడు విశ్వనాథం. ఇంతలో రిషి వస్తాడు. లెక్చరర్ పోస్ట్‌కు రిజైన్ చేయబోతున్నట్లు విశ్వనాథానికి చెబుతుంది వసుధార.
విశ్వనాథం: కాలేజీలో ఏదైన సమస్య ఉంటే రిషి సాల్వ్ చేస్తాడని, లెక్చరర్ పోస్ట్‌కు రిజైన్ చేయవద్దని వసుధారను రిక్వెస్ట్ చేస్తాడు
వసు: ఇష్టపడి జాయిన్ అయిన జాబ్ ఇప్పుడు కష్టంగా అనిపిస్తుందని, ఒక్క సందర్భం చాలు ఒక ప్లేస్, ఉద్యోగం మీద అభిప్రాయం మారడానికి
విశ్వనాథం: పదే పదే కారణం అడిగినా సమాధానం మాత్రం దాటేస్తుంది
బై చెప్పేసి అక్కడినుంచి వెళ్లిపోతుంది
విశ్వనాథం: వసుధార నిర్ణయంతో విశ్వనాథం బాధపడతాడు. ధైర్యవంతురాలైన లెక్చరర్ కాలేజీని వదలిపెట్టి వెళ్లిపోతున్నా తాను ఆపలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఇదివరకు చాలా మంది లెక్చరర్స్ ఇలాగే కాలేజీని వదిలిపెట్టి వెళ్లిపోయినా తాను ఆపలేకపోయానని అంటాడు. కాలేజీ ఛైర్మన్‌గా తాను ఫెయిలయినట్లుగా ఫీలవుతాడు. కాలేజీనే మూసేస్తే మంచిదని అనుకుంటాడు.
రిషి: ధైర్యం చెప్పిన రిషి ఆమెతో నేను మాట్లాడతానంటాడు...నమ్మించి తన ప్రాణాలను పోయేలా చేసిన వసుధార గురించి కాకుండా తన ప్రాణాలను కాపాడిన ఏంజెల్, విశ్వనాథం కోసం కాలేజీని చక్కదిద్దాలని రిషి నిర్ణయించుకుంటాడు.
Also Read: జూన్ 13 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు తొందరపాటు నిర్ణయాల తీసుకోవద్దు
కాలేజీకి వెళ్లిన వసుధార...ప్రిన్సిపాల్‌ను కలిసి తన రిజైన్ లెటర్ ఇస్తుంది. ఆమె నిర్ణయంతో ప్రిన్సిపాల్ ఆశ్చర్యపోతాడు. మీరు, రిషి సార్ వచ్చిన తర్వాత కాలేజీ రూపురేఖలు మారిపోయాయని, ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవద్దని ఆమెను బతిమిలాడుతాడు. కాలేజీ మానేయడానికి కారణం ఏమిటని ప్రిన్సిపాన్ అడిగిన ప్రశ్నకు ఏం లేదని వసుధార అబద్దం చెబుతుంది కానీ మనసులో మాత్రం నేను ఇక్కడ ఉంటే రిషి సార్ ఉండలేరని సమాధానం చెప్పకుంటుంది. ప్రిన్సిపాల్ రూమ్ నుంచి వసుధార బయటకు వెళ్లడానికి సిద్ధమవుతుండగా రిషి ఎంట్రీ ఇస్తాడు. ప్రిన్సిపాల్ చేతిలో ఉన్న వసుధార రిజైన్ లెటర్‌ను తీసుకొని చించేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇప్పుడు వసుధార ఉద్యోగం మానేయదని అంటాడు. రిషి అలా ఎందుకు చేశాడో పిన్నిపాల్‌తో పాటు వసుధారకు అర్థం కాదు..
ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది