అన్వేషించండి

Guppedanta Manasu June 12th: ఒకరికొకరు ఎదురుపడిన రిషిధార- మహేంద్రకి ఫోన్ చేసిన వసు, కొడుకు ఆచూకీ తెలుసుకోగలుగుతాడా?

Guppedantha Manasu June 12th Update: శైలేంద్ర భూషణ్ ఎంట్రీ...ఎండీ సీటుకోసం రిషిని కుట్ర చుట్టూ గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

రిషి లెక్చరర్ గా కాలేజ్ లోకి ఎంట్రీ ఇస్తాడు. తనని చూసి పాండ్యన్ బాచ్ రగిలిపోతుంది. వీడు ఖచ్చితంగా లెక్చరర్ అయి ఉంటాడు. మనం చేసే పని జీవితంలో మర్చిపోకూడదు, క్లాస్ లో అడుగు పెట్టగానే మనకి దణ్ణం పెట్టేసి వెళ్లిపోవాలని పాండ్యన్ వాళ్ళు ప్లాన్ వేస్తారు. వసు ప్రిన్సిపాల్ దగ్గరకి వచ్చి మురుగన్ కి వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి గురించి ఆరా తీస్తుంది. ఆయన ఈరోజు లెక్చరర్ గా జాయిన్ అవుతున్నారు, కాలేజ్ కి మంచి రోజులు రాబోతున్నాయి. పాండ్యన్ వాళ్ళకి బుద్ధి చెప్పగల వ్యక్తని చెప్తాడు. తన పేరు ఏంటని వసు అడుగుతుంది. రిషి అని చెప్పేసరికి షాక్ అవుతుంది. తనతో బ్రేకప్ చెప్పిన సంగతి గుర్తు చేసుకుంటుంది. రిషి అంటే నా రిషి సార్ కాదా? అనుకుంటుంది. అప్పుడే ప్యూన్ వచ్చి రిషి సార్ వస్తున్నారని చెప్పేసరికి వసు పరుగున వెళ్తూ రిషికి డ్యాష్ ఇస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు.

Also Read: తల్లిగా మారుతున్న వేద- యష్ కి దగ్గరయ్యేందుకు చూస్తున్న మాళవిక

వసు సంతోషంగా ఎలా ఉన్నారు ఇప్పుడు చాలా హ్యపీగా ఉంది. మిమ్మల్ని చూడగానే ప్రాణం వచ్చినట్టు ఉంది. ఎక్కడికి వెళ్లిపోయారు ఆరోజు నేను చేసింది తప్పని నాకు తెలుసు కానీ చేయాల్సి వచ్చింది. నా ప్రేమ కోసం తిరిగి వస్తారని చిన్న ఆశతో బతుకుతున్నాను. నా ఎండీ సర్ నా కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఇక మీ దగ్గర ఏదీ దాచి పెట్టను. మీరు కోరుకున్నట్టు దాపరికం లేని ప్రేమని అందిస్తాను. ఇక నుంచి మనం రిషిధార అని సంతోషంగా తనని కౌగలించుకుంటుంది. కాసేపటికి పక్కన మరొక మేడమ్ ఏంటి అలానే చూస్తున్నారని అంటుంది. అప్పుడు భ్రమలో నుంచి బయటకి వస్తుంది. తను వసుధార మ్యాథ్స్ లెక్చరర్ అని మరొక లెక్చరర్ పరిచయం చేసేసి వెళ్ళిపోతుంది. రిషి వసుతో బ్రేకప్ చెప్పినదే గుర్తు చేసుకుని వసుతో మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. వసు వెనుకాలే ఆగమని పరిగెడుతుంది కానీ రిషి మాత్రం కోపంగా వెళ్ళిపోతాడు.

వసుధార బాధగా ఇంటికి వస్తుంది. చక్రపాణి వచ్చి ఏమైందని అడుగుతాడు. రిషి సర్ ని కలిశానని చెప్తుంది. మురుగన్ కి వార్నింగ్ ఇచ్చింది రిషి సార్ అనేసరికి చక్రపాణి సంతోషపడతాడు. ఎలా ఉన్నారు బాగున్నారా? పలకరించారా? మాట్లాడావా? అని వరుస ప్రశ్నలు వేస్తాడు. రిషి సర్ మాట్లాడలేదు అసలు మనిషిలాగే చూడలేదని చెప్తుంది. మనం ఊరు వదిలి వెళ్లిపోతున్నాం, ఆ రోజు ఆయన కళ్ళలో ఎంత కోపం ఉందో ఈరోజు అదే కోపం చూశాను. అందుకే ఎక్కడికైనా వెళ్లిపోదామని చెప్తుంది. ఎందుకు అలా అనుకుంటున్నావ్ మనం ఇక్కడే ఉంటే ఏదో ఒక రోజు నిన్ను అర్థం చేసుకుని క్షమిస్తారని చక్రపాణి చెప్తాడు. కానీ వసు మాత్రం మన అవసరం కంటే రిషి సార్ అవసరమే ఎక్కువగా ఉందని అంటుంది. ఆ అల్లరి పిల్లల్ని ఒక దారిలో పెట్టాలంటే అది రిషి సర్ వల్లే సాధ్యమవుతుంది. ప్లీజ్ మీకోసం కాలేజ్ కి వెళ్ళాను కదా ఈసారి నాకు సాయం చేయండి ఊరు వదిలి వెళ్ళడానికి ఒప్పుకోమని అడుగుతుంది. సరేనని అంటాడు.

ALso Read: విషమంగా ముకుంద తల్లి ఆరోగ్యం- కృష్ణ కాలికి మెట్టెలు తొడిగిన మురారీ

మన కంటే ముందు రిషి సర్ వెళ్లిపోతారేమో అంటే లేదు వెళ్ళి నేను కలిసి ఊరు వదిలి వెళ్లిపోతున్నామని చెప్తానని వసు అంటుంది. వసు రిషి గురించి చెప్పడానికి మహేంద్రకి ఫోన్ చేస్తుంటే చక్రపాణి ఫోన్ లాగేసుకుంటాడు. ఇప్పటికే తండ్రీ కొడుకుల్ని విడగొట్టి పాపం చేశాను, ఇప్పుడు రిషి సర్ గురించి చెప్పకపోతే అంతకంటే పాపం లేదని బాధపడుతుంది. మహేంద్ర గురించి ఆలోచించావు కానీ రిషి గురించి ఆలోచించావా? ఇప్పుడు విషయం చెప్తే ఏం జరుగుతుందో అర్థం చేసుకోవా విషయం తెలిస్తే వెంటనే వెళ్లిపోతారని అంటాడు. మహేంద్ర ఫోన్ లో మిస్ట్ కాల్ చూసి కాల్ బ్యాక్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసి చక్రపాణిని అని చెప్తాడు. ఆ పేరు వినేసరికి జగతి షాక్ అవుతుంది. అంటే ఏంటి ఈయన నాకు కాల్ చేయలేదా? వసుధార కాల్ చేసిందా అనుకుంటాడు. అప్పుడే వసు వచ్చి ఫోన్ ఎవరని అనడం అటువైపు నుంచి మహేంద్ర వింటాడు. వెంటనే ఫోన్ చూసి వసు కాల్ కట్ చేస్తుంది. మహేంద్ర తిరిగి కాల్ చేస్తాడు. లిఫ్ట్ చేసి ఏదో ఒకటి చెప్పమని అనేసరికి లిఫ్ట్ చేస్తుంది. వసుధార ఫోన్ ఎందుకు తీయడం లేదని మహేంద్ర అడుగుతాడు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
PPF Rules: పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
తిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?
తిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?
Embed widget