Ennenno Janmalabandham June 12th: తల్లిగా మారుతున్న వేద- యష్ కి దగ్గరయ్యేందుకు చూస్తున్న మాళవిక
మాళవికని తీసుకొచ్చి వేద ఇంట్లో పెట్టుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
![Ennenno Janmalabandham June 12th: తల్లిగా మారుతున్న వేద- యష్ కి దగ్గరయ్యేందుకు చూస్తున్న మాళవిక Ennenno Janmalabandham Serial June 12th Episode 431 Written Update Today Episode Ennenno Janmalabandham June 12th: తల్లిగా మారుతున్న వేద- యష్ కి దగ్గరయ్యేందుకు చూస్తున్న మాళవిక](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/12/12289ac74af5b565fef24d66804deb1e1686538261845521_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
యష్ తాగేసి వచ్చి కళ్ళ జోడు పెట్టుకుని కాసేపు తనని ఆట పట్టిస్తాడు. ఇవి ఎక్స్ రే కళ్ళజోడు నువ్వు బట్టలు లేకుండా కనిపిస్తున్నావ్ అనేసరికి వేద సిగ్గు పడుతూ వెళ్ళి బాత్ రూమ్ లోకి పరుగులు పెడుతుంది. ఆ కళ్ళ జోడు మీరు బయట పడేస్తే నేను బయటకి వస్తానని అంటుంది. నువ్వు బయటకి వచ్చేవరకు నేను కళ్ళ జోడు తీయనని అంటాడు. ఆదిత్య నిద్రలో అమ్మా భయమేస్తుందని కలవరిస్తూ ఒక్కసారిగా వణికిపోతూ గట్టిగా అరుస్తూ నిద్రలేస్తాడు. మాళవిక వేద గురించి చెప్పిన మాటలు తలుచుకుంటాడు. గదిలో నుంచి వెళ్ళి బయట పడుకుంటాడు. వేద మెల్లిగా బాత్ రూమ్ లో నుంచి వచ్చి చూసేసరికి యష్ నిద్రపోతూ ఉంటాడు. ఆ కళ్ళ జోడు తీసి పారేయాలని అంతా వెతుకుతుంది. నిద్రలో యష్ ఐలవ్యూ వేద అని కలవరిస్తాడు. కాసేపు భర్తని చూసుకుని మురిసిపోతుంది.
ALso Read: విషమంగా ముకుంద తల్లి ఆరోగ్యం- కృష్ణ కాలికి మెట్టెలు తొడిగిన మురారీ
ఖుషి నిద్రలో లేచి ఆదిత్య కోసం వెతుకుతూ వేదని వచ్చి అడుగుతుంది. నా రూమ్ లో పడుకోవడం అన్నయ్యకి ఇష్టం లేదనుకుంటా వెళ్లిపోయాడని బాధపడుతుంది. తనకి నచ్చ జెప్పి ఖుషిని పడుకోబెట్టి వేద ఇల్లంతా తన కోసం వెతుకుతుంది. ఒకచోట ఆదిత్య కనిపిస్తే వెళ్ళి తనని పట్టుకోగానే ఉలిక్కిపడతాడు. ఆంటీ నాకు భయమేస్తుందని అంటాడు. నాకు అక్కడ చాలా భయమేస్తుంది ఊపిరి ఆడనట్టు అనిపించింది అందుకే ఇక్కడికి వచ్చి పడుకున్నా ఆంటీ అని భయపడుతూ చెప్తాడు. తల్లిని ఇంట్లో నుంచి గెంటేయడం, రోడ్డు పక్కన తను పడిపోవడం దగ్గరుండి మరీ చూశాడు కదా అది తన మనసులో భయాన్ని కలిగించింది. అదే తలుచుకుని భయపడుతున్నాడని తనని దగ్గరకి తీసుకుంటుంది. అంత భయంగా ఉంటే నాన్నకి, నాకు చెప్పొచ్చు కదని తనని ఒడిలో పడుకోబెట్టుకుని జో కొడుతుంది.
నిద్రపోయిన తర్వాత తనని తీసుకొచ్చి యష్ పక్కన పడుకోబెడుతుంది. అదేంటి ఆదిత్య ఈ టైమ్ లో వచ్చాడని యష్ అడుగుతాడు. తనకి భయమేస్తుందని బయటకి వెళ్ళి పడుకున్నాడు. తను మాత్రం ఏం చేస్తాడు పరిస్థితులు పీడ కలలాగా వెంటాడుతుంటే తను మాత్రం ఏం చేస్తాడని వేద జాలిపడుతుంది. అవును కన్న తల్లి పక్కన ఉన్నా కూడా ఎన్ని కష్టాలు పడ్డాడో, కానీ కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకునే నువ్వు దొరికావు. థాంక్స్ వేద నా కొడుకుని నాకు దగ్గర చేస్తున్నావాని యష్ సంతోషపడతాడు. మాళవిక నిద్రలేచి ఆదిత్య కోసం చూస్తుంది. వేద వస్తే ఆదిత్య గురించి అడుగుతుంది. అర్థరాత్రి భయపడి బయట పడుకుంటే వాళ్ళ నాన్న పక్కన పడుకోబెట్టానని వేద చెప్తుంది. ఇంతకముందు ఎప్పుడు తను అలా భయపడలేదని మాళవిక చెప్తుంది. నీ పరిస్థితి చూసి బాగా డిస్ట్రబ్ అయ్యాడు. పరిస్థితి ఎలా ఉన్నా ఆదిత్య ముందు సంతోషంగా కనిపించాలి. నువ్వు బాధపడుతుంటే తను తట్టుకోలేకపోతున్నాడని వేద అంటుంది.
Also Read: సోది పెట్టిన మైఖేల్- పెళ్లి కూతురు కిడ్నాప్, స్వప్నని కావ్య కాపాడుతుందా?
నేను బాధపడటం వాడు చూడాలి మీకు సంతోషం లేకుండా చేయాలి అదే నా ప్లాన్ అయితే నన్ను సంతోషంగా కనిపించమని చెప్తావ్ ఏంటని మాళవిక మనసులో అనుకుంటుంది. నా జీవితంలో సంతోషం అలా నటించడం కోసమైన ప్రయత్నిస్తానని అంటుంది. ఇలాగే వదిలేస్తే ఆదిత్య దృష్టిలో కూడా మంచిది అయిపోతుంది అప్పుడు ఖుషి నన్ను చూసినట్టే చూస్తాడు. ఇంకొంచెం కీ ఇస్తే ఆదిత్య మరింత రెచ్చిపోతాడని ప్లాన్ వేస్తుంది. నిద్రలేవగానే వేద మొహం చూస్తే ఆరోజంతా ప్రశాంతంగా ఉంటుందని అనుకుని యష్ తనని పిలుస్తాడు. అప్పుడు మాళవిక ఎంట్రీ ఇస్తుంది. యష్ కోపంగా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికని అరుస్తాడు. పొద్దు పొద్దున్నే నీ మొహం చూడాల్సి వచ్చింది ఏం జరుగుతుందో ఏమోనని అంటాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)