అన్వేషించండి
Neha Deshpande: 'కాంతార' కోసం ఖాకీ చొక్కా వేసిన నేహా... ఏయే సినిమాలు చేసిందో తెలుసా?
ETV Serial Kantara: ఈటీవీలో ప్రసారమయ్యే సీరియల్ 'కాంతార' కోసం పోలీసుగా మారింది నేహా దేశ్‌పాండే. అన్నట్టు ఈ అమ్మాయి సినిమాలలో హీరోయిన్ రోల్స్ కూడా చేసింది. మరి ఆ సినిమాలు ఏవో తెలుసా!?

'కాంతార' కోసం ఖాకీ చొక్కా వేసిన నేహా... ఏయే సినిమాలు చేసిందో తెలుసా?
1/5

ETV Serial Kantara Cast: ఈటీవీ సీరియల్ 'కాంతార' నటీనటుల లిస్టులో నేహా దేశ్‌పాండే కూడా చేరింది. ఆవిడ పోలీసు రోల్ చేస్తోంది. ఆల్మోస్ట్ రెండు నెలల క్రితమే షూటింగ్ కూడా కంప్లీట్ చేసింది. త్వరలో ఆవిడ క్యారెక్టర్ సీరియల్ లో ఎంటర్ కానుంది.
2/5

'కాంతార'లో ఖాకి చొక్కా వేసిన నేహా దేశ్‌పాండే ఒకప్పుడు హీరోయిన్ రోల్స్ చేసింది. స్టార్ హీరోల సినిమాలు చేయలేదు. కానీ, చోటామోటా హీరోల పక్కన ఆల్మోస్ట్ పదికి పైగా సినిమాలు చేసింది. ఏయే సినిమాలు చేసిందో తెలుసా?
3/5

'వజ్రాలు కావాలా నాయనా' పేరుతో 2017లో ఒక సినిమా వచ్చింది. అందులో నేహా దేశ్‌పాండే హీరోయిన్. అప్పటికి ఆవిడ మెయిన్ రోల్స్ చేయడం మొదలుపెట్టి మూడేళ్లు. 2014లో 'దిల్ దివానా', 2017లో 'ది బెల్స్' సినిమాలు చేసింది నేహా. ఆ తరువాత 'వాడేనా', 'బిచ్చగాడు మజాకా' వంటి సినిమాల్లోనూ నటించింది.
4/5

'తిప్పరా మీసం' అని మరో సినిమాలోని నేహా దేశ్‌పాండే నటించింది. 'సుభద్ర', 'రాజు గారి కోడి పలావ్' వంటి సినిమాలతో పాటు 'లవ్ సెక్స్ అండ్ డెత్' వెబ్ సిరీస్ కూడా చేసింది.
5/5

సినిమాలతో నేహా దేశ్‌పాండేకి సక్సెస్ రాలేదు. దాంతో సీరియల్స్ వైపు చూసింది. ఇప్పుడు 'కాంతార' సీరియల్ చేస్తోంది. ఇక నుంచి వరుస పెట్టి సీరియల్స్ చేస్తుందేమో చూడాలి.
Published at : 09 Feb 2025 08:18 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion