అన్వేషించండి

జూన్ 13 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు తొందరపాటు నిర్ణయాల తీసుకోవద్దు

Love Horoscope Today 13th June 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

Love and Relationship Horoscope 13th June 2023

మేష రాశి

ఈ రాశివారికి ఈ రోజంతా ఆందోళనతో గడిచిపోతుంది. మంచి చేసే ఉదేశ్యంతో ఆపదలు కొని తెచ్చు కోకండి. ఎవరితోనూ ఆర్థిక  లావాదేవీలు జరపవద్దు. ఈ రోజు భూమి,ఆస్తికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవద్దు. అత్యశకు పోవద్దు. ఉద్యోగులు వ్యాపారులకు మిశ్రమ సమయం.

వృషభ రాశి 

ఈరోజుమీకు అత్యంత శుభదినం. ధన వృద్ధి , ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. వ్యాపార ఒప్పందంలో మీరు విజయం సాధించగలరు. కుటుంబం మరియు స్నేహితులతో విహారయాత్ర ప్లాన్ చేసుకుంటారు. కొత్త పరిచయం వల్ల ప్రయోజనం పొందుతారు. రిస్క్ తీసుకోవడం మానుకోండి.

మిథున రాశి

ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. కార్యాలయంలోని అధికారితో సంబంధాలు బాగుంటాయి. సామాజికంగా గౌరవం పెరుగుతుంది. పదోన్నతి పొందే అవకాశాలున్నాయి. బంధువుల నుంచి బహుమతులు అందుకోవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రాపంచిక జీవితం ఆనందమయం అవుతుంది. కొత్త పనులు అనుకూలంగా ఉంటాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

Also Read: భానుమతిని దుర్యోధనుడు మోసపూరితంగా ఎందుకు పెళ్లి చేసుకున్నాడు?

కర్కాటక రాశి 

ఈ రోజు మీరు మతపరమైన పనులలో బిజీగా ఉంటారు. దేవాలయానికి లేదా ఏదైనా ఆధ్యాత్మిక  కార్యక్రమానికి వెళ్లే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.ఆరోగ్యం విషయంలో ఆందోళన తొలగిపోతుంది. మనస్సుకు శాంతి లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం కలగవచ్చు.  

సింహ రాశి

ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆరోగ్యం క్షీణించడం వల్ల ఆకస్మిక ఖర్చులు రావచ్చు. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలు జరుగుతాయి మాటతూలొద్దు. నిబంధనలకు విరుద్ధంగా ఏ పని చేయకండి. భగవంతుని స్మరణ వల్ల శాంతి లభిస్తుంది. బంధువులను కలుస్తారు.

కన్యా రాశి 

ఈరోజు మీకు అనుకూలమైన రోజు. జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. కొత్త వ్యక్తుల పట్ల ఆకర్షణకు గురి అవుతారు.సామాజిక , ప్రభుత్వ రంగంలో మీ గౌరవం పెరుగుతుంది. భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి. నూతన వస్త్ర ,నూతన ఆభరణ  ప్రాప్తి.

తులా రాశి 

ఇంట్లోఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. విచిత్ర సంఘటనలు జరుగుతాయి. పనిలో విజయం ఉంటుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అవసరమైన పనుల కోసం డబ్బు ఖర్చు అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. తల్లి వైపు నుంచి కొంత శుభ సమాచారం అందుతుంది. ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంటుంది. ప్రయాణం చేయవచ్చు.

Also Read : మహాభారతంలోని ఈ 4 కథలు నిజం, నేటికీ సజీవం

వృశ్చిక రాశి

మీ శారీరక ,మానసిక ఆరోగ్యం ఈరోజు బాగానే ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కార్యాలయంలో సహోద్యోగుల పూర్తి సహకారం ఉంటుంది. స్నేహితులను కలవవచ్చు. స్త్రీలకు తల్లితరపు  నుంచి శుభవార్తలు అందుతాయి. ధనలాభం ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు.

ధనుస్సు రాశి

ఈరోజు సమస్యలు చుట్టుముడతాయి. పిల్లల ఆరోగ్యం,విద్య ఆందోళనకరంగా ఉంటుంది. ఏ పనిలో విజయం సాధించకపోవడంతో మనస్సు కలత చెందుతుంది. మాటల విషయంలో సంయమనం పాటించండి. ఈ రోజు మీరు సాహిత్యం, కళలపై ఆసక్తిని పెంచుకుంటారు.  అనవసర చర్చలకు దూరంగా ఉండండి. 

మకర రాశి

ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబ కలహాల కారణంగా అసంతృప్తిగా  ఉంటుంది. శక్తి లోపిస్తుంది. బంధుమిత్రులతో విబేధాలు రావచ్చు. కొన్నిఅనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముంది. ప్రశాంతంగా నిద్రపోలేరు. పరువు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మాటల విషయంలో సంయమనం పాటించండి.  

కుంభ రాశి 

ఈ రోజు మీ ఉత్సాహం పెరుగుతుంది. ఇంట్లో తోబుట్టువులతో కలిసి కొన్ని కొత్త పనులు చేస్తారు. వారితో రోజు ఆనందంగా గడిచిపోతుంది.బంధువులను కలుస్తారు. చిన్న ట్రిప్ కూడా వెళ్లే అవకాశం ఉంది. 

మీన రాశి 

కొన్ని పనులలో విజయం సాధిస్తారు. మతపరమైన శుభ కార్యక్రమాలకు వెళతారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో దిక్కుతోచని స్థితి ఉంటుంది. కుటుంబంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.  ప్రయాణం చేస్తారు. ఈ రాశి స్త్రీల వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. శుభవార్త అందుకుంటారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
KTR: మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
Clash at BJP office Nampally: బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే
బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే
PM Fasal Bima Yojana: రైతులకు గుడ్ న్యూస్ - వరికి బీమా ప్రీమియం గడువు పొడిగింపు
రైతులకు గుడ్ న్యూస్ - వరికి బీమా ప్రీమియం గడువు పొడిగింపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP DesamUnion Health Minister HMPV Virus | హెచ్ఎంపీవీ వైరస్ ను ఎదుర్కోగల సత్తా మనకు ఉంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
KTR: మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
Clash at BJP office Nampally: బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే
బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే
PM Fasal Bima Yojana: రైతులకు గుడ్ న్యూస్ - వరికి బీమా ప్రీమియం గడువు పొడిగింపు
రైతులకు గుడ్ న్యూస్ - వరికి బీమా ప్రీమియం గడువు పొడిగింపు
Harish Rao on KTR Arrest: కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం కన్ఫామ్, ఫార్ములా ఈ రేసు కేసుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం కన్ఫామ్, ఫార్ములా ఈ రేసు కేసుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
Tibet Earthquake: నేపాల్, టిబెట్‌ భూకంపంలో 53 మంది మృతి, సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
నేపాల్, టిబెట్‌ భూకంపంలో 53 మంది మృతి, సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
KTR News: కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
NTR Neel Movie: ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం రంగంలోకి మలయాళీ యాక్టర్స్... ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా
ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం రంగంలోకి మలయాళీ యాక్టర్స్... ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా
Embed widget