Duryodhana Marriage: భానుమతిని దుర్యోధనుడు మోసపూరితంగా ఎందుకు పెళ్లి చేసుకున్నాడు?
Duryodhana Marriage: మహాభారతంలో దుర్యోధనుడు ఒక ముఖ్యమైన పాత్ర. దుర్యోధనుడు ఎంత బలవంతుడయినా భానుమతిని మాత్రం మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని మహాభారత కథ చెబుతోంది.
Duryodhana Marriage: మహాభారత యుద్ధం ప్రస్తావన వచ్చినప్పుడల్లా, చాలా శక్తిమంతమైన, ముఖ్యమైన పాత్రల పేర్లు తెరపైకి వస్తాయి. వారిలో దుర్యోధనుడు ముఖ్యమైన వాడు. మహాభారతంలో దుర్యోధనుడి పేరు మొదటగా కనిపిస్తుంది. ఎందుకంటే దుర్యోధనుడి అసూయ కారణంగానే కురుక్షేత్రలో మహాభారత యుద్ధం జరిగింది.
మహాభారతంలోని ప్రధాన పాత్ర అయిన దుర్యోధనుడి గురించి ఇప్పటికే చాలా మందికి తెలుసు. అయితే మహాభారత యుద్ధం కథ గురించి చెప్పాలంటే, ఇది కొంతమంది ముఖ్యమైన మహిళల చుట్టూ తిరుగుతుంది. అప్పుడు అది పాండవుల కథా లేక ద్రౌపది పగ కథా అనేది సరిగ్గా అర్థమవుతుంది. అలాంటి స్త్రీలలో దుర్యోధనుని భార్య ఒకరు. దుర్యోధనుడి గురించి మీకు తెలిసి ఉండవచ్చు, కానీ దుర్యోధనుడి భార్య గురించి మీకు తెలియదు. ఐతే ఈ కథనంలో దుర్యోధనుడి భార్య గురించి తెలుసుకుందాం.
Also Read : మహాభారతంలోని ఈ 4 కథలు నిజం, నేటికీ సజీవం
1. దుర్యోధనుడి భార్య ఎవరు..?
దుర్యోధనుడు గురించి చాలా మందికి తెలుసు, కానీ దుర్యోధనుడు ఎవరిని వివాహం చేసుకున్నాడు, అతని భార్య పేరు ఏమిటో మీకు తెలుసా? దుర్యోధనుని భార్య పేరు భానుమతి. భానుమతి కాంభోజ రాజు చంద్రవర్మ కుమార్తె. ఎన్నో కళల్లో ప్రావీణ్యం ఉన్న ఆమె చూడటానికి కూడా అందంగా, ఆకర్షణీయంగా ఉండటంతో పాటు చాలా తెలివైనది. భానుమతి పెరిగి పెద్దయ్యాక పెళ్లి వయసు వచ్చేసరికి, ఆమెకు పెళ్లి చేసేందుకు తండ్రి స్వయంవరం నిర్వహిస్తాడు. ఈ స్వయంవరానికి సుదూర ప్రాంతాల నుంచి రాజులు, చక్రవర్తులు ఒకరి కంటే ఎక్కువ మంది ధీమంతులు హాజరయ్యారు. శిశుపాలుడు, జరాసంధుడు, రుక్మి, వక్రుడు, దుర్యోధనుడు, కర్ణుడు కూడా స్వయంవరంలో పాల్గొన్నారు.
భానుమతి స్వయంవర మాల తీసుకుని ముందుకు సాగడం మొదలుపెట్టింది. దుర్యోధనుడు భానుమతి అందమైన రూపానికి ఆకర్షితుడయ్యాడు. కానీ భానుమతి దృష్టి దుర్యోధనుడిపై పడకపోవడంతో ఆ దండతో ముందుకు సాగింది. అప్పుడు దుర్యోధనుడు భానుమతి చేతిని గట్టిగా పట్టుకుని బలవంతంగా తన మెడలో దండ వేయించుకుని ఆమెను భార్యగా చేసుకున్నాడు.
2. దుర్యోధనుడి సంతానం
దుర్యోధనుడు-భానుమతి ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. కొడుకు పేరు లక్ష్మణ, కూతురు పేరు లక్ష్మణ. మహాభారత యుద్ధంలో లక్ష్మణుడు అభిమన్యుడి చేతిలో హతమయ్యాడు. కుమార్తె లక్ష్మణ శ్రీకృష్ణుడు- జాంబవతికి జన్మించిన సాంబుడిని వివాహం చేసుకుందని మహాభారత కథ చెబుతుంది.
3. కర్ణుడి సాయంతో
నిజానికి దుర్యోధనుడిని భానుమతి భర్తగా ఎంచుకోలేదు. ఆమె స్వయంవరంలో కర్ణుడి సహాయంతో దుర్యోధనుడు భానుమతిని బలవంతంగా వివాహం చేసుకున్నాడు. దుర్యోధనుడు, భానుమతి కుమార్తె లక్ష్మణను కృష్ణుని కుమారుడు సాంబుడు అపహరించాడని చెబుతారు. భానుమతి స్వయంవరంలో కర్ణుడు దుర్యోధనుడికి సహాయం చేయకపోతే, ఖచ్చితంగా ఆమె దుర్యోధనుడిని వివాహం చేసుకునేది కాదు. దుర్యోధనుడు భానుమతిని మోసపూరితంగా వివాహం చేసుకున్నాడు.
Also Read : మహాభారత యుద్ధంలో మరణించని కౌరవవీరుడు ఒక్కడే..!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.