Guppedanta Manasu July 27th: షటప్ వసుధార అని ఫైర్ అయిన రిషి, పీక్స్ కి చేరిన టామ్ అండ్ జెర్రీ వార్!
Guppedantha Manasu July 27th: కాలేజీ ఎండీ సీటుకోసం శైలేంద్ర-దేవయాని ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. రిషి బతికే ఉన్నాడని తెలిసి మళ్లీ కుట్రకు తెరతీశాడు శైలేంద్ర
గుప్పెడంతమనసు జూలై 27ఎపిసోడ్ (Guppedanta Manasu July 27nd Written Update)
శైలేంద్ర దగ్గర డబ్బులు తీసుకున్న బస్తీ వాళ్లు వసుధారతో గొడవకి దిగుతారు. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన రిషి వసుపై ఫైర్ అవుతాడు. అలా బుద్ధి చెప్పండి సారూ అంటుంది బస్తీలో గొడవకు దిగిన మహిళ
రిషి: ఎవరికి బుద్ధి చెప్పాలి మీ పిల్లల్ని చదువుకోమంటున్నందుకు ఆవిడకి బుద్ధి చెప్పాలా
బస్తీ మహిళ: మీరు కూడా ఆవిడకే సపోర్ట్ చేస్తున్నారేంటి సారు
రిషి: ఆమె చెప్పినదాంట్లో తప్పెంటి.. మీ పిల్లల్ని చదువుకోమని కదా చెప్పారు. మీ పిల్లల్ని చదివిస్తే వాళ్లు మీకు లాగా కష్టపడే అవసరం ఉండదు. మీ పిల్లల కోసమే కదా ఆవిడ అలా అన్నారు
తాగుబోతు: మా పిల్లలు బాగోగులు మాకు తెలుసు
రిషి: తాగి సరిగ్గా నుంచోలేకపోతున్నావు నువ్వు పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నావా.. మీ పిల్లలు చదువుకుంటే మీ భవిష్యత్తు బాగుపడుతుంది.
చదువుకున్న వాళ్ళకి ఇచ్చే గౌరవం వేరేగా ఉంటుంది అని నచ్చచెప్తాడు రిషి.
మధ్యలో పాండ్యన్ అండ్ టీమ్ కూడా వచ్చి చదువు గొప్పతనాన్ని చెబుతారు
బస్తీకి చెందిన మరో వ్యక్తి వచ్చి మా వాళ్లు తప్పుగా మాట్లాడారు.. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు మమ్మల్ని మోసం చేసి వెళ్లిపోయారు అందుకే మిమ్మల్ని నమ్మలేకపోతున్నాను వాడి మాటలు వదిలేయండి మా పిల్లల్ని బాగా చదివిస్తామంటాడు.
రిషి తన విసిటింగ్ కార్డ్ ఇచ్చి మీ పిల్లల్ని చదివించాలని అనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి అని చెప్పి వసుధార వాళ్లని తీసుకుని వెళ్ళిపోతాడు.
Also Read: శైలేంద్ర ప్లాన్ కి చెక్ పెట్టిన రిషి, ఏంజెల్ కి నిజం చెబుతానన్న వసు - జగతి డేరింగ్ స్టెప్!
కార్ లో ఉన్న వసుధార తనతో పాటు వచ్చినందుకు ఏంజెల్ ని రిషి మందలిస్తున్నట్లుగా భ్రమ పడుతుంది. తననేమీ అనొద్దు సార్ అని గట్టిగా అంటుంది. అసలేం జరిగిందని ఏంజెల్ అడగడంతో తడబడుతుంది వసుధారు. మరోవైపు బస్తీలో జరిగిన విషయం విశ్వనాథం గారికి చెప్పొద్దు అని ఏంజెల్ కి చెప్తాడు రిషి.
కాలేజీ లో లెక్చరర్స్ ముందు వసుధార చేసింది తప్పు అని మందలిస్తాడు రిషి. మిషన్ ఎడ్యుకేషన్ టేకప్ చేస్తున్నామని ఇంకా చెప్పలేదు కదా అయినా తనెందుకు బస్తీకి వెళ్లింది...ఇద్దరూ గట్టిగానే వాదించుకుంటారు..
వసు: నేనేమీ తప్పు చేయలేదు అక్కడ కాలేజీ పేరు బయటికి రానివ్వలేదని ప్రిన్సిపాల్ కి సంజాయిషీ ఇచ్చుకుంటుంది
రిషి: మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు పాండియన్ వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకు వెళ్లినప్పుడు వాళ్ళ పేర్లు కన్నా ముందు కాలేజీ పేరు వచ్చింది. అయినా మిషన్ ఎడ్యుకేషన్ గురించి ముందు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి అప్పుడు చదువు గురించి ఒప్పించాలి అంతేగాని వాళ్లకి ఏమీ తెలియకుండా వాళ్లతో మాట్లాడితే ఇలాగే ఉంటుందని ఆవేశంగా అంటాడు
వసు: అక్కడ నేను తప్పుగా ఏమీ మాట్లాడలేదు కావాలంటే ఏంజెల్ అక్కడే ఉంది అడగండి అంతేగాని పర్సనల్ విషయాలని దృష్టిలో పెట్టుకుని నన్ను తప్పుగా మాట్లాడకండి అంటూ కోపంగా రిప్లై ఇస్తుంది
రిషి: షట్ అప్ వసుధార అని గట్టిగా అరవడంతో అక్కడున్నవారంతా ఆవేశపడతారు
లెక్చరర్స్: మీరిద్దరూ అసలు సరిగ్గా మాట్లాడుకోరు అలాంటిది ఆవిడ మీద అలా ఫైర్ అయిపోయారేంటి...వాళ్ళిద్దరికీ ఏదో గతం ఉందని మరో లెక్చరర్ చెవిలో చెప్తాడు అటెండర్.
రిషి-వసు కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతారు.
ఇధ్దరూ మాట్లాడేదీ కాలేజీ గురించే అందుకే ఇద్దర్నీ తప్పుపట్టలేం అంటాడు ప్రిన్సిపాల్
Also Read: 'గుప్పెడంత మనసు' సీరియల్: పైకి ఈగో, లోపల మాత్రం చెప్పలేనంత ప్రేమ- శైలేంద్ర నోరు మూయించేసిన జగతి
ఇంట్లో కూర్చున్న రిషి వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఏంజెల్ వచ్చి కాలేజీలో ఏదో గొడవ చేసావంట కదా ఎందుకు అలా చేసావు. నేను జరిగిందంతా విశ్వంకి చెప్పేశాను. ఆయన కూడా వసుధార చేసింది మంచి పని అన్నారు అంటుంది. తను చేసింది మంచి పని అని నాకు తెలుసు కానీ ఒంటరిగా హ్యాండిల్ చేయడం ఎందుకని ప్రశ్నిస్తాడు రిషి. అది సరే కానీ వసుధార ఇంకా ఇంటికి రాలేదు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదంటుంది. అసలే బస్తీవాళ్లు మంచివాళ్లుకాదని కంగారుపడుతుంది..రిషి కూడా లోపల కంగారుపడినా బయటకు మాత్రం ఏంకాదులే వచ్చేస్తుందని చెప్పి సర్దిచెబుతాడు. మరోవైపు వసుధార మాత్రం తన ఇంటికి వెళ్ళిపోతుంది. రిషి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు. ఎందుకు కాల్ చేశారని మెసేజ్ పెడుతుంది. నాకెందుకు మెసేజ్ చేశారని అడుగుతుంది. వసు మాత్రం చాటింగ్ చేస్తుంది కానీ కాల్ చేయదు. ఎక్కడున్నారని రిషి మెసేజ్ పెడతాడు.
ఎపిసోడ్ ముగిసింది..