Gunde Ninda Gudi Gantalu October 3rd Episode: మీనా ఇంట్లోంచి వెళ్లిపోయిందా ? ప్రభావతి వెళ్లగొట్టిందా? ఎంతపని చేశావ్ బాలు - గుండెనిండా గుడిగంటలు అక్టోబర్ 03 ఎపిసోడ్!
Gundeninda GudiGantalu Today episode: సక్సెస్ ఫుల్ గా తల్లిని, కొడుకుని ఇంట్లోంచి పంపించేసింది రోహిణి. ఆ గొడవ పూర్తైంది అనేసరికి కొత్త గొడవ తెచ్చిపెట్టాడు బాలు...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 03 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 October 3rd Episod
బాలుని వెతుక్కుంటూ వస్తాడు స్నేహితుడు. శుభలేఖ చేతికిస్తాడు. పెళ్లినీకేనా అంటే..కాదు మా అన్నయ్యకి అంటాడు. మనోజ్ ని పరిచయం చేస్తుంటే లక్షలు మింగినవాడేనా అని అంటాడు..అంటే ఇంట్లో వాళ్ల సంగతి అందరితోనూ చెప్పేశావా అని ప్రభావతి కోప్పడుతుంది. ఆ తర్వాత మీనాను చూసి నమస్కారం చెబుతాడు. ఇక పెళ్లి గురించి మళ్లీ చర్చ మొదలుపెడతాడు బాలు. ఆ మధ్య మీ అన్నయ్య ఎవరో ఫారెనమ్మని ప్రేమించాడని చెప్పావుకదా అంటాడు బాలు. ఆమెతో పొసగలేదు వదిలేశాడు..మా నాన్న స్నేహితుడి కూతుర్ని పెళ్లిచేసుకుంటున్నాడని చెబుతారు. సేమ్ టు సేమ్ అలానే జరుగుతోంది. అరేయ్ జాగ్రత్తగా ఉండు.. మీ అన్నయ్య మనసుమార్చుకుని పెళ్లిలోంచి పారిపోతే...ఆ పిల్లను నీకు కట్టబెట్టేస్తారు. ఒక్కసారి తగులుకుంటే జీవితాంతం తప్పించుకోలేవు అంటూ..ఏవేవో మాట్లాడుతుంటాడు. పక్కనే మీనా ఉంది..తల్లి ఎంజాయ్ చేస్తోందని కూడా గమనించడు. కానీ బాలు మాట్లాడే ఒక్కో మాట మీనాకు గట్టిగా తగులుతాయి. బాలు మనసులో ఇంత ఉందా? తప్పనిపరిస్థితుల్లో తనతో కాపురం చేస్తున్నాడా? అని మీనా కళ్లలో నీళ్లు తిరుగుతాయి. మీనాను అవమానిస్తూ బాలు మాట్లాడుతుంటే ప్రభావతి ఎంజాయ్ చేస్తుంది.. రోహిణి కూడా ఆనందంగానే ఉంటుంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా తన స్టైల్లో మాట్లాడుతూనే ఉంటాడు.
నోటికొచ్చినట్టు మాట్లాడి..స్నేహితుడి నుంచి శుభలేఖ తీసుకుంటాడు బాలు. ఆ తర్వాత తనని డ్రాప్ చేసేందుకు వెళతాడు. అప్పుడిక ప్రభావతి, రోహిణి తలో మాట అంటారు. ఎప్పటినుంచో మీనాపై కక్షతీర్చుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్న ప్రభావతి చెలరేగిపోతుంది. బాలు అన్న మాటలకు డబుల్ అవమానిస్తుంది. టిఫిన్ చేశావా అని అందరూ అడిగితే.. నేను చేయను మీకు నచ్చింది ప్రిపేర్ చేసుకుని తినండి అని గట్టిగానే ఫైర్ అవుతుంది. ప్రభావతి ఏదేదో మాట్లాడుతుంటే అందుకు ధీటుగా సమాధానం చెబుతుంది. ఆ తర్వాత బాలు రిటర్న్ ఇంటికి వస్తాడు. మీనా ఫైర్ అవడం చూసి అర్థంకాక..ఏం జరిగిందని అడుగుతాడు. మీకు నన్ను బలవంతంగా అంటగట్టారా ? మీ ఫ్రెండ్ దగ్గర ఏం మాట్లాడారని నిలదీస్తుంది. మాటల్లో ఉన్నది మనసులో లేదు... నేను సరదాగా అంటే ఇంత గొడవపడతావా? నమ్మితే నమ్ము లేదంటే లేదు అనేసి ట్రిప్ కి కాల్ రావడంతో వెళ్లిపోతాడు.
ఇప్పటికీ వాడు దాన్ని ఇష్టంగా పెళ్లి చేసుకోలేదు..బలవంతంగా అంటగట్టారని తప్పక కాపురం చేస్తున్నాడు..ఇన్నాళ్లకి బాలు మనసులో మాట బయటపెట్టాడన్న ప్రభావతి మాటలు తలుచుకుని కుమిలిపోతుంది మీనా. తల్లి పదే పదే కాల్ చేస్తుంటే కోపంగా లిఫ్ట్ చేసి అంతే కోపంగా మాట్లాడుతుంది. ఎలా ఉన్నావ్ అని అడిగితే మీరంతా కలసి అంటగట్టిన అత్తారింట్లో సంతోషంగా ఉన్నాను అంటుంది. అల్లుడు గారు బావున్నారా అని అడిగితే... అమాయకంగా పనిపై వెళ్లారంటుంది. ఏదోదో మాట్లాడుతున్నావ్ ఏంటి...జ్వరం ఎక్కువైందా..నన్నేమైనా రమ్మంటావా అని అడుగుతుంది. నువ్వు వచ్చి మాటలు అనిపించుకోవద్దు..నేను బాధపడొద్దు... తిక్క తగ్గాక కాల్ చేస్తాను ఉంటాను అని కట్ చేస్తుంది.
బాలు కోపంగా కార్ తుడుస్తుంటాడు...ఫ్రెండ్ రాజేష్ వచ్చి ఏమైందిరా అని అడిగితే చిరాగ్గా మాట్లాడుతాడు. వేరేవాడు వచ్చి మా ఆవిడకు 500 ఇవ్వాలి సర్దుతావా అని అడుగుతాడు. అది కుదరదు..అస్సవు ఇవ్వనంటాడు బాలు.భార్య-భర్తలో ఎవరు తప్పుచేసినా మనమే సారీ చెప్పాలి అని పెద్ద క్లాస్ వేస్తాడు రాజేష్. ఫ్రండ్ ముందు మీనాపై జోక్ వేశాను ఫీలయింది అంటాడు. ఏమన్నావ్ అంటే.. మళ్లీ చెప్పలేను అంటాడు బాలు. మీనాది కోపం కాదు అలక..బుజ్జగించాలని సలహా ఇస్తాడు. సరే మీనాకోసం పూలు,స్వీట్స్ తీసుకెళ్లు అని రాజేష్ అనగానే సరే అంటాడు బాలు
ఇంటికి వచ్చిన సత్యం ముందు...మీనా గురించి మాట్లాడడం మొదలుపెడుతుంది. ఈ పనిదొంగ ఎక్కడికి వెళ్లిందో ఏంటో అని అరుస్తుంటుంది. స్కూటీ బయటే ఉందికదా మీనా ఏది అని అడిగితే... పొద్దున్నే టిఫిన్ కూడా చేయకుండా వెళ్లింది అంటుంది. అత్తపై మీనా తిరగబడితే మీకు సంతోషంగా ఉంటుందా అని ప్రభావతి ఫైర్ అవుతుంది. ఇంతలో బాలు వస్తాడు... రాగానే ప్రభావతి పురాణం స్టార్ట్ చేస్తుంది. ఉదయం బయటకు వెళ్లి ఇప్పటికీ రాలేదు అంటుంది. కాల్ చేస్తే కట్ చేసింది, స్విచ్చాఫ్ వచ్చిందని బాలు అనగానే... ఫోన్ ఆఫ్ చేస్తే ఇష్టం వచ్చినట్టు తిరిగొచ్చు అనుకుందేమో అని నోరుపారేసుకుంది. నేను తమాషాకి ఓ మాట అన్నాను ఆ తర్వాత వీళ్లంతా ఏదో అన్నారట అని బాలు అంటాడు. ఏం జరిగిందని ప్రభావతిని నిలదీసినా చెప్పదు.
కాఫీ తీసుకొచ్చి సత్యానికి ఇస్తుంది ప్రభావతి.. నాక్కూడా ఇవ్వొచ్చుగా అంటే నాక్కూడా ఇస్తే అరిగిపోతావా అనానే..పోయి నీ పెళ్లాన్ని అడుగు అంటుంది. ఇంకా వదిన రాలేదా అని రవి అడగ్గానే... ఇంకా వంటమనిషి రాలేదు అంటుంది. నా పెళ్లాన్ని వంద అనుకుంటాను..మీరెందుకు అంటారని బాలు నిలదీస్తాడు. మీనా ఇంటికి రాలేదా అని శ్రుతి అడుగుతుంది. వంట చేయలేదని నోటికొచ్చినట్టు మాట్లాడుతారు. ఒక్కపూట నా పెళ్లాం లేకపోతే ఇంతమంది విలవిల్లాడుతున్నారు.. నా మీనా విలువ తెలిసిందా అని అడుగుతాడు. మీనా ఇంట్లో లేకపోతే ఏమీ జరగదంటున్నాడు బాలు..నువ్వెళ్లి వంట చెయ్ అంటుంది ప్రభావతి. మీనా ఎక్కడికి వెళ్లిందో అని సత్యం కంగారుపడతాడు.
మీనా పుట్టింటికి కాల్ చేసి సుమతితో మాట్లాడుతాడు బాలు. అక్క ఇక్కడకు రాలేదు బావా అని చెబుతుంది సుమతి. షాక్ అవుతాడు బాలు. తన స్నేహితుడు రాజేష్ ని తీసుకుని మీనాను వెతుకుతూ రోడ్లపై తిరుగుతుంటాడు బాలు.





















