Gunde Ninda Gudi Gantalu October 01 Episode: రోహిణి అసలు రంగు బయటపడింది! ట్విస్ట్ అదిరింది - గుండెనిండా గుడిగంటలు అక్టోబర్ 01 ఎపిసోడ్!
Gundeninda GudiGantalu Today episode: చింటూని, తన తల్లిని ఇంట్లోంచి పంపించేసేందుకు పెద్ద స్కెచ్ వేసిన రోహిణి..అడ్డంగా బుక్కైపోయింది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

రోహిణి తన కన్నతల్లి అని చింటూకి క్లారిటీ వచ్చేసింది. కానీ అమ్మ ఎందుకు దగ్గరకు తీసుకోవడం లేదు? ఎందుకు తనతో లేదో అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. నీ కన్నపేగు కదలడం లేదా? వాడిని చూసి కరగడం లేదా అని రోహిణి తల్లి అంటుంది. మీనాను ఎంత హీనంగా చూస్తున్నారో నాకు తెలుసు..నేను డబ్బున్న ఇంట్లో పుట్టిపెరిగాను అనుకుంటోంది మా అత్తగారు. అది అబద్ధం అని తెలిస్తే కట్టుబట్టలతో నన్ను గెంటేస్తుంది..మనోజ్ మంచివాడు..నన్ను అర్థం చేసుకున్న రోజున పరిస్థితి చెబుతాను..ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా అంటుంది రోహిణి. ఇంట్లో అందర్నీ చెరో దిక్కు పంపించేసి..తల్లి, కొడుకుని పంపించేద్దాం అని ప్లాన్ చేసుకుంటుంది రోహిణి. ఇంతలో బాలు వచ్చేయడం.. ఆ వెనుకే మీనా రావడంతో ప్లాన్ రివర్సవుతుంది. బాలు మీనాతో పాటూ శ్రుతి రవి కూడా వచ్చేస్తారు. అంతా చింటూని ప్రేమగా చూసుకుంటారు. ఆరగ్యం గురించి ఆరాతీస్తారు. చింటూ వాళ్ల ఆంటీతో మాట్లాడుతా నంబర్ ఇవ్వండి అని మీనా అడిగితే..రోహిణి తల్లి కంగారుపడుతుంది.
చింటూ కళ్లకు కట్లు విప్పిన వెంటనే వెళ్లిపోవడం ఎందుకు..కొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చుకదా అని మీనా అడుగుతుంది. ఆ మాట వినగానే రోహిణి షాక్ అవుతుంది.. సైగ చేసేందుకు ఏం చేయాలో అర్థంకాక.. టేబుల్ పై చేతిలో ఉన్న ప్లేట్ కిందపడేస్తుంది. తన ఎక్స్ ప్రెషన్ చూసి షాక్ అవుతారంతా. అయితే రోహిణి కావాలనే టేబుల్ పై ఉన్న గిన్నె కిందపడేయడం రవి చూస్తాడు. రూమ్ కి వెళ్లిన తర్వాత అదే విషయం శ్రుతికి చెబుతాడు రవి. వాళ్ల రూమ్ తీసుకున్నారని అక్కసుతో అలా చేస్తోందేమో అంటుంది శ్రుతి. నేరుగా వెళ్లి అడిగేస్తాను అంటూ రోహిణి దగ్గరకు వెళ్లి.. నువ్వు రూమ్ గురించి ఇబ్బంది పడుతున్నావా? అందుకే అలా ప్రవర్తిస్తున్నావా? నువ్వు పడుకునేందుకు ఇబ్బందిగా ఫీలవుతున్నావని ఆమెతో చెబుతాను వెళ్లి అంటుంది శ్రుతి. ఈ ఒక్కరోజే కదా అడ్జెస్ట్ అవుతానులే అంటుంది రోహిణి. ఎందుకు ఇలా అడుగుతున్నావని అడిగితే.. గిన్నె నువ్వు కావాలని కిందపడేయడం రవి చూశాడని షాక్ ఇస్తుంది శ్రుతి.
ఇంతలో మీనా వచ్చి..పాలు స్టౌపై పెట్టాను చూస్తుండు.. నేను వెళ్లి బట్టలు తీసుకొస్తాను అంటుంది. డబ్బుడమ్మ ఏదో అంటోందని బాలు అడిగితే..నీకెందుకు అని రివర్సవుతుంది రోహిణి. నువ్వు చింటూకోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నావ్..నాకు డౌట్ వస్తోంది అనేసి వెళ్లిపోతాడు బాలు. ప్రభావతి సత్యం కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంటిికి వచ్చేసరికి హాల్లో చింటూ కనిపిస్తాడు..ప్రభావతి కోపం నషాలానికి అంటుతుంది. ఏంటి నాకేం చెప్పావ్? ఏం జరుగుతోంది? వీళ్లను పంపిస్తానని చెప్పావ్ కదా ఇంకా ఉన్నారేంటి అంటుంది. నేను పంపించాలని చూశాను ఇంతలో బాలు వచ్చి అడ్డుపడ్డాడు అంటుంది రోహిణి. వీళ్లకు చెప్పాల్సిన విధంగానే చెప్పాలి అంటూ.. చింటూతో రూడ్ గా బిహేవ్ చేస్తుంది.
నా కుర్చీలోంచి లేరా అని ఫైర్ అవుతుంది. పక్కనే కుర్చీ ఖాళీగా ఉందికదా అంటుంది రోహిణి. ఆ ముసలావిడను పిలువు అనగానే రోహిణి తల్లి వస్తుంది. పరాయి ఇంటికి వెళ్లి ఇన్నాళ్లూ ఎలా ఉంటారని ఫైర్ అవుతుంది. ఇంతలో మనోజ్ వచ్చి... చింటూని సపోర్ట్ చేస్తాడు. నువ్వేనా వీడిని నా కూర్చోబెట్టింది అని ప్రభావతి ఫైర్ అవుతుంది. మీనా ఆంటీ కూర్చోమనలేదు అంటాడు చింటూ. తల్లిదండ్రుల దగ్గర పెరిగితే బుద్ధి ఉండేది అంటుంది. నా ఇంటిపై దారినపోయేవారిని తెచ్చిపెట్టారంటూ కోప్పడుతుంది. నావల్ల మీకు గొడవలు ఎందుకు..పొమ్మంటే పోతాం అంటుంది. బాలు రాగానే మళ్లీ నోరుపారేసుకుంటుంది. మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి చింటూను తీసుకుని వెళ్లిపోతాడు. ఈరోజు కూడా కిందే పడుకోవాలా అని మనోజ్ ఫీలవుతాడు.. పార్కులో పడుకున్న రోజులు మర్చిపోయావా అని సెటైర్ వేస్తుంది రోహిణి
రూమ్ కి వెళ్లిన బాలు.. పార్లలమ్మ ప్రవర్తనపై అనుమానంగా ఉంది..చింటూపై అధిక ప్రేమ చూపిస్తోంది అంటాడు. ఆ మాటలు విన్న మనోజ్.. రోహిణి దగ్గరకు వచ్చి అదే విషయం చెబుతాడు. నీకు పిల్లలు కావాలని ఉందా అని అడిగితే.. నువ్వు బిజినెస్ లో ఎదిగిన తర్వాతే పిల్లలు అంటుంది రోహిణి.
చింటూని తీసుకుని బయలుదేరిన రోహిణి తల్లి.. వెళ్లొస్తాం అమ్మా అని ప్రభావతికి చెబుతుంది. మంచిది..వెళ్లండి మళ్లీ రాకండి అని విసురుగా చెబుతుంది. ఒకరోజు వాళ్లిక్కడుంటే నీ కొంప ఏమైనా కూలిపోతుందా అని అడుగుతాడు బాలు. ఆ తల్లి అసలు కనిపడేసిందే పోయిందో లేదంటే పైకే పోయిందో వాడిపుట్టుక ఏంటో అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటుంది ప్రభావతి.. రోహిణి ఇక భరించలేక ఆపండి అత్తయ్యా అని ఫైర్ అవుతుంది. పసిపిల్లాడి ముందు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియదా? అని గట్టిగా అడుగుతుంది. రోహిణి నుంచి ఇలాంటి రియాక్షన్ అస్సలు ఊహించని బాలు, మీనా, ప్రభావతి షాక్ అవుతారు. అవునా? మా అందర్నీ బయటకు పంపించేసి..వాళ్లను ఇంట్లోంచి గెంటేస్తానని ఎందుకన్నావమ్మా? అని నిలదీస్తుంది. ఇంట్లో అందరూ అలాగే ఉండిపోతారు. ముందుగా రియాక్టైన బాలు... ఇప్పుడు నాకు అంతా తెలిసిపోయింది. బుర్ర గిర్రున తిరుగుతోంది అంటాడు.





















