Gunde Ninda Gudi Gantalu September 30 Episode: రోహిణి గురించి మొత్తం తెలుసుకున్న బాలు, నిలదీసిన ప్రభావతి - గుండెనిండా గుడిగంటలు సెప్టెంబర్ 30 ఎపిసోడ్!
Gundeninda GudiGantalu Today episode: ప్రభావతి చింటూని, రోహిణి తల్లిని ఇంట్లోంచి వెళ్లగొట్టేందుకు ఏదైనా ప్లాన్ చేయమని రోహిణికి పెద్ద టాస్క్ అప్పగించింది ప్రభావతి. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

గుండెనిండా గుడిగంటలు సెప్టెంబర్ 30 ఎపిసోడ్ (Gunde Ninda Gudi Gantalu September 30 Episode)
రోహిణి అత్త కాదు తనకు అమ్మ అని తెలుసుకున్న చింటూ ఏడుస్తాడు. నాకెందుకు చెప్పలేదు ఇన్నాళ్లూ అని అడుగుతాడు. నన్నెందుకు వదిలేశావ్? నాతో ఎందుకు ఉండడం లేదు? ఇకనైనా నాతో వచ్చేస్తావా? నువ్వు నేను అమ్మమ్మ కలసే ఉందాం అంటాడు.నేను రాలేను నాన్నా.. ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు నన్ను అమ్మ అని పిలవొద్దు అంటుంది. ఎందుకు అని చింటూ అడిగితే రోహిణి దగ్గర సమాధానం ఉండదు. స్కూల్లో పిల్లలు నా పుస్తకాలు చింపేసి మీ అమ్మకు చెప్పుకో అని ఏడిపిస్తున్నారు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. వాడు అంతలా ఏడుస్తున్నా నీ మనసు కరగడం లేదా అని అడుగుతుంది రోహిణి తల్లి. చూశావు కదా నా పరిస్థితి.. మీనా ఎన్నిపనుల చేసినా మా అత్తయ్య ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉంది. అలాంటికి నేను కోటీశ్వరుడు కూతుర్ని అని మాత్రమే నన్ను బాగా చూస్తోంది..అదంతా నిజం కాదని తెలిస్తే నన్ను కట్టుబట్టలతో బయటకు గెంటేస్తుందని బాధపడుతుంది. బాలు మీనా వచ్చేలోగా వెళ్లిపోండి అంటుంది. రేపు కళ్లకు కట్లు విప్పేటప్పుడు ముందు నిన్నే చూడాలని ఉంది నువ్వు వస్తావా అని రిక్వెస్ట్ చేస్తాడు చింటూ..సరే అంటుంది రోహిణి. హోటల్లో రూమ్ బుక్ చేశాను వెళ్లండి అంటుంది.
మరోవైపు మీనాను ఇంకాసేపు ఆపేందుకు రోహిణి ఫ్రెండ్ విద్య నాకోసం వండిపెట్టావు కాస్త తినేసి వెళ్లు అంటుంది. ఇంత బాగా ఎలా వంట చేశావ్ అని అడుగుతుంది విద్య. చిన్నప్పటి నుంచీ మా అమ్మ, చెల్లెలు, తమ్ముడు షాప్ కి వెళ్లిపోతే నేను వండిపెట్టేదాన్ని అంటుంది మీనా. మీ అత్త నిన్ను అంత టార్చర్ చేస్తుంది కదా నీకు కోపం రాదా అంటుంది. ఆమెకు నన్ను అనే అధికారం ఉంది..మిగిలిన ఇద్దరు కోడళ్లు గొప్పింటివాళ్లు నన్ను తేడాగా చూస్తుంది. ఎప్పుడైనా వళ్లు మండితే నేను చురకలు అంటిస్తా అంటుంది. మీనా చాలా మంచిది...రోహిణి మీనాకు చాలా వ్యత్యాసం ఉంది. రోహిణి అసలు నిజమే చెప్పదు, తప్పుల మీద తప్పులు చేస్తుంది.. కానీ మీనా మాత్రం తప్పులు చేయదు అనుకుంటుంది.
బాలుని ట్రిప్ కి రమ్మని కాల్ చేసిన వాళ్లు కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో వెనక్కు వచ్చేస్తాడు. కరెక్టుగా తల్లిని, కొడుకుని ఇంట్లోంచి పంపించేందుకు ప్లాన్ చేస్తుండగా బాలు ఎంట్రీ ఇస్తాడు. విసుక్కుంటుంది రోహిణి. నువ్వేంటి ఇక్కడున్నావ్ అని రోహిణిని అడిగితే.. నీకెందుకు అని పొగరుగా చెబుతుంది రోహిణి. నీకోసం బిర్యానీ తీసుకొచ్చాను..రోజంతా ఇద్దరం ఆడుకుందాం అంటాడు. నీకు ముందే చెప్పాను ఇంకా వెళ్లలేదంటూ కోప్పడుతుంది రోహిణి. ఆ తర్వాత బాలు చింటూ ఆడుకుంటారు. మీనా ఎంట్రీ ఇవ్వగానే.. నీకేం కాలేదు కదా అని అడుగుతాడు. పార్లలమ్మ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లావ్ కదా..అందుకే అడుగుతున్నా అంటాడు బాలు. రోహిణి చింటూకి తినిపించింది తెలుసా అని ఆశ్చర్యంగా చెబుతాడు. ఆడవాళ్లు అందర్లోనూ అమ్మతనం ఉంటుంది అని చెబుతుంది మీనా.
మీనా చింటూ కోసం కళ్లద్దాలు కొనితీసుకొస్తుంది. థ్యాంక్స్ చెబుతాడు చింటూ. మీనా ప్రేమ చూపించడం కూడా రోహిణికి నచ్చదు. ఆంటీ నాకు కళ్లకు కట్లు విప్పిన తర్వాత అందర్నీ చూడొచ్చు కదా.. మా అమ్మను కూడా చూడొచ్చా అని అడుగుతాడు. మీ అమ్మాయి ఎప్పుడొస్తుంది? తల్లిని, బాబుని పట్టించుకోనంత బిజీగా ఉందా..నాకు ఫోన్ నంబర్ ఇవ్వండి మాట్లాడుతా అంటుంది మీనా. తనకు కుదరదు అని అబద్ధం చెబుతుంది రోహిణి తల్లి. చింటూకి కట్లు విప్పిన తర్వాత వారం రోజులు ఇక్కడే ఉండండి అని మీనా అడగ్గానే షాక్ అవుతుంది రోహిణి.






















