Gruhalakshmi November 28th Episode - ‘గృహలక్ష్మీ’ సీరియల్: రాజాలా బతికిన ఇంట్లోనే పనోడిలా మారిన బసవయ్య - నందాకు వార్నింగ్ ఇచ్చిన తులసి
Gruhalakshmi Serial Today Episode : తన పర్సనల్ విషయాలలో తలదూర్చొద్దని నందగోపాల్ కు తులసి వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఆసక్తికరంగా జరిగింది.
Gruhalakshmi Telugu Serial Today Episode : బసవయ్య రూంలోకి వచ్చిన దొంగ తన గోల్డ్ చైన్ అల్మారాలో దాచానని చెప్తాడు. దొంగ మాటలకు బసవయ్య, షాక్ అవుతాడు. ఆయన భార్య ప్రసూనాంబ కెవ్వుమని ఆరుస్తుంది. దివ్య ఏమైంది పిన్ని అని అడుగుంది. ఏం లేదన్నట్లు తలూపుతుంది. అల్మారా ఓపెన్ చేయమని దివ్య వాళ్ల మామయ్యకు చెప్తుంది. ఆయన అల్మారా ఓపెన్ చేయబోతుంటే బసవయ్య ఆగమని మీరంతా బయటకు వెళ్తే ఆ లాకెట్ నేను తీసుకొస్తానని అంటాడు. నీకెందుకంత శ్రమ అంటూ అల్మారా ఓపెన్ చేయగానే అందులో నోట్ల కట్టలు కనిపిస్తాయి. వాటిని చూసిన అందరూ షాక్ అవుతారు. గోల్డ్ చెయిన్ బాక్స్ తనదేనని తీసుకుని దొంగ వెళ్లిపోతాడు. అల్మారాలో ఉన్న డబ్బు ఎక్కడిదని అందరూ అడుగుతారు. అక్కయ్య బీరువాలో కిందపడుతున్నాయని తీసుకొచ్చి ఇక్కడ పెట్టానని తింగరి సమాధానం చెప్తాడు బసవయ్య.
విక్రమ్: అమ్మనా దొంగ మామయ్య ఇంతలా మోసం చేశావు.
దివ్య: మోసం చేసింది ఎవరినో కాదు విక్రమ్. సాక్ష్యాత్తు దేవతలాంటి అత్తయ్య గారిని. ఆవిడ నమ్మకాన్ని, ఒకసారి అత్తయ్యగారి ముఖం చూడండి. నమ్మిన సొంత తమ్ముడే ఇంత నీచానికి దిగజారాడని మనందరికీ ముఖం చూపించలేక పాపం ఎలా తల దించుకుందో.. ఇలాంటి దగాకోరు మీ మేనమామ అంటే నాకే ఒళ్లు కంపరంగా ఉంది.
అని దివ్య అనగానే సొంత మేనమామ అనే బంధం అడ్డొస్తుంది కాబట్టి బయటికి గెంటివేయడంలేదని.. రేపటి నుంచి మీరు ఇంటి పనిమనుషుల్లా బతకాలని విక్రమ్ చెప్తాడు. దీంతో బసవయ్య, ప్రసూనాంబ షాక్ అవుతారు. తులసి గార్డెన్‌లో కూర్చుని నందగోపాల్ తాగి వచ్చి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నందగోపాల్ వాళ్ల అమ్మానాన్నలు ఇద్దరి పరిస్థితి తలుచుకుని బాధపడుతుంటారు. లోపలి నుంచి వచ్చిన నందగోపాల్‌ను వాళ్ల అమ్మా నాన్న తిడతారు. రాత్రి తాగొచ్చి ఏదైతే తులసికి తెలియకూడదు అనుకున్నామో అదే విషయం చెప్పావని కోప్పడతారు. తులసి ఎలా రియాక్ట్ అవుతుందోనని నందగోపాల్ భయపడుతుంటాడు. నందగోపాల్‌ను చూసిన తులసి లోపలికి వెళ్తుంటే నంద తులసి చేయి పట్టుకుంటాడు. చేయి విదిలించుకున్న తులసి
తులసి: మూడు రోజుల కిందటి వరకు మన మధ్య స్నేహం ఉండేది. మొన్నటితో అది పోగొట్టుకున్నారు. నిన్నటి వరకు నీ మీద కొద్దోగొప్పో గౌరవం ఉండేది. ఈరోజుతో అది కూడా పొగొట్టుకున్నారు. ఇంత జరిగినా కూడా ధైర్యంగా వచ్చి నా ముందు ఎలా నిలబడుతున్నారు.
నంద: మళ్లీ మళ్లీ చెప్తున్నాను మీ అమ్మగారి విషయంలో నేను చేసింది తప్పే.. అది తెలియకుండా జరిగిపోయింది. కానీ
తులసి: మీ మనసులో నాగురించి ఉన్న ఆలోచనలు, భావనలు తప్పుకాదా? అది నాకు తెలిసేలా చేయడానికి మీరు చేసిన ప్రయత్నాలు తప్పు కాదా? మనసులో ఒకటి పెట్టుకుని మరోలా బిహేవ్ చేయడం తప్పుకాదా? రాత్రి తాగి వాగారు కాబట్టి నాకు నిజం తెలిసింది. లేకపోతే ఇలాగే నన్ను ఇంకెన్నాళ్లు మోసం చేసేవారు.
నంద: ఇందలో మోసం ఏముంది తులసి.
అనగానే తులసి కోపంగా నేను చేసిన పెద్దతప్పు డివోర్స్ ఇచ్చినా మీతో కలిసి బతకడం..అందుకే మీకు అలుసు అయిపోయాను. అంటూ తులసి బాధపడుతుంది. దీంతో నన్ను పరాయివాణ్ని చేసి మాట్లాడకు అంటూ నందు బతిమాలితే.. మీరు పరాయివారే అంటూ నా పర్సనల్ విషయంలోకి తొంగి చూడకండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది తులసి.
బసవయ్య, ప్రసునాంబ గార్డెన్‌లో పని చేస్తుంటారు.
ప్రసునాంబ: ఏంటండి ఈ ఖర్మ మనకి ఇంత బతుకు బతికి మాసిన బనీను వేసుకుని ఈ మొక్కలు కట్ చేయడం ఏంటి? పాతచీర కట్టుకుని డబ్బా పట్టుకుని మొక్కలకు నీళ్లు పోయడం ఏంటి?
బసవయ్య: కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందే..
అంటూ లోపలికి వచ్చి వాళ్ల అక్కతో తమ పరిస్థితి చెప్పుకుని బాధపడతారు బసవయ్య, ప్రసునాంబ. విక్రమ్ మంచోడు కాబట్టి ఇక్కడితో వదిలేశాడు లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉంటే ఎలా ఉండేది అంటూ వారిస్తుంది. అక్కడికి వచ్చిన దివ్య వాళ్ల అత్తయ్యను కూడా జాగ్రత్తగా ఉండమని లేదంటే మీ తమ్ముడికి పట్టిన గతే మీకు పట్టేలా చేస్తానని వార్నింగ్ ఇస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: ‘యానిమల్’ ట్రైలర్ చూసి మెంటల్ వచ్చేసింది: మహేశ్ బాబు
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply