Gruhalakshmi December 25th Episode : దివ్యను పిచ్చాసుపత్రికి పంపేందుకు రాజ్యలక్ష్మీ కొత్త ప్లాన్ – నందును, లాస్యను ఒక్కటి చేసిన పరంధామయ్య
Gruhalakshmi Serial Today Episode: దివ్యను విక్రమే స్వయంగా పిచ్చాసుపత్రికి తీసుకెళ్లేలా చేస్తానని రాజ్యలక్ష్మీ దెయ్యం నాటకానికి తెరతీయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఇంట్రస్టింగ్ గా జరిగింది.
Gruhalakshmi Telugu Serial Today Episode: పరంధామయ్యను తీసుకుని తులసి, నందు, లాస్య ముగ్గురు హాస్పిటల్‌కు వెళ్తారు. తులసి తాను వెళ్లి ముందు డాక్టర్‌ను కలిసి వస్తాను తర్వాతే మామయ్యను తీసుకెళ్దామని అనడంతో లాస్య సీరియస్ అవుతుంది. ఇంతకు ముందే నందు డాక్టర్‌ను కలిశాడు కదా అంటుంది. అయినా సరే నేను వెళ్లి డాక్టర్‌ను కలిశాకే మామయ్యగారిని తీసుకెళ్దాం లేదంటే ఇంటికి వెళ్లిపోదాం అంటుంది తులసి. దీంతో ఇద్దరు గొడవ పడటం కాదు ఇద్దరు కలిసి డాక్టర్ దగ్గరకు వెళ్లండి తర్వాతే నాన్న గారిని తీసుకెళ్దాం అని చెప్పడంతో ఇద్దరూ కలిసి డాక్టర్ దగ్గరకు వెళ్తారు. తులసి వాళ్లు వెళ్లగానే..
పరంధామయ్య: ఒరేయ్ తులసితో పాటు ఉన్నావిడ ఎవరు? ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు.
నంద: దెబ్బలాడుకోవడం లేదు నాన్న మాట్లాడుకుంటున్నారు.
పరంధామయ్య: అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు అని పరంధామయ్య అడగ్గానే నంద ఏదో సర్ధి చెప్తాడు.
లోపల డాక్టర్ దగ్గరకు వెళ్లిన తులసి డాక్టర్ తో మాట్లాడిన తర్వాత నంద వాళ్లను పిలవమని లాస్యకు చెప్తుంది. లాస్య నందకు ఫోన్ చేసి డాక్టర్ దగ్గరకు రమ్మని పిలుస్తుంది. నంద వాళ్ల నాన్నను తీసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్తాడు. డాక్టర్ పరంధామయ్యను పరీక్షిస్తానని అందరినీ బయటకు పంపిస్తాడు. టెస్ట్ చేసిన తర్వాత అందరినీ లోపలికి పిలవగానే లోపికి వచ్చిన తులసి ఎలా ఉంది మామయ్యా అని అడుగుతుంది.
పరంధామయ్య: ఈయన ఎవరో కానీ బలే సరదాగా కబుర్లు చెప్తున్నారు. నాకు నచ్చారు.
నంద: ఆయన డాక్టర్
పరంధామయ్య: అవునా? రోజు వచ్చి ఈయనతో మాట్లాడాలనిపిస్తుందిరా తీసుకొస్తావా?
డాక్టర్: అవసరం లేదు. నేనే మీ ఇంటికొస్తాను.
పరంధామయ్య: థ్యాంక్యూ డాక్టర్. మరి మా ఇల్లు ఎక్కడో తెలుసా? మీకు
అంటూ మాట్లాడుతుండగానే అంతకు ముందే లాస్య ట్రీట్‌మెంట్ చేయబోతున్న డాక్టర్‌కు ఫోన్ చేసి ఆ ముసలోడి ఆలోచనలు అన్నీ, జ్ఞాపకాలన్నీ తాను కోడలుగా ఉన్నప్పటికి తీసుకెళ్లాలని చెప్తుంది. లాస్య చెప్పినట్లే డాక్టర్ పరంధామయ్యను హిప్నటైజ్ చేసి లాస్య కోడలుగా ఉన్నప్పటి టైంకి వెనక్కి తీసుకెళ్తాడు. ఇదంతా లాస్య గుర్తు చేసుకుంటుంది. ఇంతలో నంద డాక్టర్ మేము ఇక బయలుదేరొచ్చా అనగానే టాబ్లెట్స్ రెగ్యులర్‌గా వేయాలి అంటూ పంపిస్తాడు. నంద, తులసి పరంధామయ్యను తీసుకుని బయటకు వెళ్లగానే లాస్యకు డాక్టర్ విక్టరీ సింబల్ చూపిస్తాడు.
బయటకు వచ్చిన పరంధామయ్య అనుమానంగా అటుఇటు చూస్తుంటే నంద ఏమైంది నాన్నా అని అడుగుతాడు.
పరంధామయ్య: ఎంత మందిమి వచ్చాము. ఎంత మందిమి వెళుతున్నాము. లెక్క చూసుకోవా?
నంద: ఇప్పుడేమైంది నాన్నా తులసి నీ పక్కనే ఉందిగా ముగ్గురం కలిసే వెళ్తున్నాంగా..
పరంధామయ్య: ఒరేయ్ ఒకసారి మళ్లీ ఆ డాక్టర్ దగ్గరకు వెళ్దాం పద.
నంద: ఎందుకు నాన్నా పనైపోయిందిగ. మిమ్మల్ని చూశారుగా..
పరంధామయ్య: నిన్ను చూపించడానికిరా
అనగానే అందరూ షాక్ అవుతారు. నన్ను ఎందుకు అని నంద ప్రశ్నించడంతో మొబైల్ మర్చిపోయావంటే ఒక అర్థం ఉంది. కళ్ళజోడు మర్చిపోయావంటే ఒక అర్థం ఉంది. కట్టుకున్న పెళ్లాన్ని మర్చిపోయావేంట్రా.. అని పరంధామయ్య అనగానే
తులసి: మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు మామయ్య
పరంధామయ్య: వెంట తీసుకొచ్చిన ఇంటి కోడలిని హాస్పిటల్లో వదిలేసి టింగు రంగా అంటూ బయలుదేరాడు.
అనగానే నందు ఎం మాట్లాడుతున్నారు నాన్నా మీరు అంటూ ప్రశ్నించడంతో.. చెప్తానుండు అంటూ కోపంగా అటు ఇటు చూసి దూరంగా ఫోన్ మాట్లాడుతున్న లాస్యను ఓ కోడలా అంటూ కేకేసి పిలుస్తాడు పరంధామయ్య.. దీంతో తులసి, నంద షాక్ అవుతారు. లాస్య మనసులో హ్యాపీగా ఫీలవుతుంది. లాస్యను దగ్గరకు పిలిచి ఇంటికెళ్దాం పద అంటాడు. లాస్య నేను మీ కోడలు కాదండి మేము ఎప్పుడో డైవర్స్ తీసుకున్నాం అని చెప్పగానే డాక్టర్ అక్కడకి వచ్చి వాళ్లిద్దరూ భార్యభర్తలేనని మీతో వాళ్లు ప్రాక్టికల్ జోక్ వేస్తున్నారు. అనగానే నంద, తులసి షాక్ అవుతారు.
పరంధామయ్యను కుర్చీలో కూర్చోబెట్టి నంద, తులసి, లాస్యలను పక్కకు తీసుకెళ్తారు. ఆయన ఆరోగ్యం కుదుటపడాలంటే మీరు ఇష్టం వచ్చినట్లు మట్లాడకూడదని ఆయన ఆలోచనలు గతంలోకి వెళ్లి అక్కడే ఆగిపోయాయి. సో ఆయన ఆరోగ్యం కోసం మీరు నటించాలని లేదంటే ఆయన ప్రాణాలకే ప్రమాదం కావొచ్చు అంటూ డాక్టర్ చెప్పడంతో తులసి, నంద షాక్ అవుతారు. దీంతో నంద నో అలా కుదరదు అనగానే అది మీ ఇష్టం అంటూ డాక్టర్ చెప్తుండగానే పరంధామయ్య అక్కడకు వస్తాడు. ఏంటి చూస్తున్నారు పదండి ఇంటికి అంటూ పిలవగానే అందరూ ఇంటికి బయలుదేరుతారు.
రాజ్యలక్ష్మీ హాల్లో ఆలోచిస్తూ కూర్చుని ఉంటుంది. బసవయ్య, ప్రసూనాంబ అక్కడకు వచ్చి రాజ్యలక్ష్మీని మెచ్చుకుంటారు. దివ్యను బాగా దెబ్బ తీశావని మెచ్చుకుంటారు. ఒక్కదెబ్బ కాదు ఇకనుంచి దెబ్బ మీద దెబ్బ తీస్తానని రాజ్యలక్ష్మీ చెప్తుంది. అందులో భాగంగా మరో దెయ్యం నాటకాన్ని ఆడనున్నట్లు రాజ్యలక్ష్మీ చెప్పి దెయ్యాన్ని చూపించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.