అన్వేషించండి

Gruhalaksmi October 30th: 'గృహలక్మీ' సీరియల్ : దివ్యను తులసి కాపాడుతుందా? హనీని కిడ్నాపర్లకు అప్పగిస్తుందా? విక్రమ్ అమ్మను అనుమానించిన జాను

దివ్యను కిడ్నాపర్లు చంపేస్తామనడంతో తులసిలో మరింత టెన్షన్ మొదలవుతంది. ఒకవైపు తులసి మరోవైపు విక్రమ్ దివ్య కోసం వెతకడంతో ఇవాళ్టి ఏపిసోడ్ మరింత ఇంట్రస్టింగ్ గా మారింది.

దివ్య కిడ్నాప్‌ కావడంతో విక్రమ్‌ కుటుంబం బాధపడుతూ ఉంటారు. ఏం జరుగుతుందోనని కంగారుపడుతుంటారు. విక్రమ్‌ బాధపడుతుంటే వాళ్ల నాన్న  ఎవ్వరినీ నమ్ముకోవద్దని నీ సమస్య పరిష్కారం కోసం నీవే ముందుకు వెళ్లాలని ఆత్మవిశ్వాసం నింపుతాడు. దీంతో విక్రమ్‌ ధైర్యంగా అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు. తులసి వాళ్ల ఇంట్లో అత్తయ్య, మామయ్య, నందు టెన్షన్‌గా కూర్చుని ఉంటారు.

అత్తయ్య:  తులసి ఇప్పటి వరకు రాలేదు.. ఫోన్‌ చేసినా ఎత్తడం లేదు..

మావయ్య: నేను కాల్‌ చేసినా లిప్ట్‌ చేయడం లేదురా..

నందు: చేయదు నాన్న చేస్తే మనం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చెప్పడానికి తన దగ్గర సమాధానాలు ఉండవు..

అత్తయ్య: ఎందుకురా తులసి మీద అంత కోపం..

నందు: కోపం తులసి మీద కాదమ్మ.. తులసి ప్రవర్తన మీద తులసి మొండితనం మీద..  

ఇంతలో ఏడుస్తూ తులసి ఇంట్లోకి వస్తుంది. అందరూ తులసిని దివ్య ఎక్కడుందని.. ఎలా ఉందని అడుగుతారు. అన్ని ఆధారాలతో అక్కడికి వెళ్లావు కదా ఏమైందని అడుతారు.

తులసి: వాళ్లు ఆ లెటర్‌ ను మ్యాజిక్‌ పెన్‌ తో రాశారు. నేను అక్కడికి వెళ్లేసరికి లెటర్‌లో ఉన్న అక్షరాలు అన్ని మాయం అయిపోయాయి.

నందు: ఇప్పటికైనా అర్థం అవుతుందా? వాళ్లు మనల్ని ఎలా అటాక్‌ చేస్తున్నారో

అత్తయ్య: మరి దివ్యను ఎలా రక్షించుకోవడం..

నందు: హనినీ ఇవ్వకపోతే దివ్యను వదిలిపెట్టమంటున్నారు. వాళ్ల మాట వినకపోతే దివ్యను చంపేస్తామంటున్నారు అత్తయ్య.  

అనగానే అందరూ షాక్‌ కు గురవుతారు. దీంతో నందు హనీని ఇచ్చేసి దివ్యను కాపాడుకుందామని చెప్తాడు. హనీని ఇవ్వను దివ్యను రక్షించుకుంటాను అంటూ తులసి వెళ్లిపోతుంది. జాను వాళ్ల నాన్న అమ్మ చిప్స్‌ తింటూ ఉంటారు. జాను రావడం చూసి చిప్స్‌ దాచిపెడతారు.

జాను అమ్మ: ఇంతకీ నీ అనుమానం ఏంటే..

జాను : దివ్య అక్కను కిడ్నాప్‌ చేసిన వాళ్లు చంపడానికి ఎందుకు తొందరపడుతున్నారు. అంత అవసరం ఏం వచ్చింది.  

జాను నాన్న: తులసి మొండికేస్తే ఏం చేస్తారు. ఎంత సేపు ఆగుతారు.

జాను : అంటే మీరు కూడా ఆ కిడ్నాపర్లను సపోర్ట్‌ చేస్తున్నారా?

జాను నాన్న : అయ్యో గట్టిగా అనకమ్మా... ఎవరైనా వింటే నిజమే అనుకుంటారు. నన్ను ఎత్తుకెళ్లి జైళ్లో పడేస్తారు.

అనగానే దివ్యను కిడ్నాప్‌ చేసింది ఎవరో కాదు అత్తయ్యే ఉండోచ్చు అని జాను అంటుంది. దివ్య అంటే అత్తయ్యకు ఇష్టం లేదు కనుక కిడ్నాప్‌ చేసి ఉండొచ్చు. కిడ్నాప్‌ విషయం మీకు తెలిసి ఉంటే వెంటనే విడిచిపెట్టమని చెప్పండి అంటూ  జాను వెళ్లిపోతుంది.  ఇదిలా మారిపోతే మన క్యారెక్టర్లకి ఇక ఎండ్‌ కార్డు పడ్డట్లేనని బాధపడతారు జాను అమ్మ, నాన్న.

విక్రమ్‌ దివ్యను వెతుకుతూ వెళ్తుంటే డ్రైవర్‌ కారు ఒక దగ్గర ఆపి ఇక్కడే సార్‌ మేడంను కిడ్నాపర్లు కిడ్నాప్‌ చేసింది అని చెప్తాడు. దీంతో కారు దిగిన విక్రమ్‌ అటూ ఇటూ చూసి

విక్రమ్‌ : దివ్యను ఎక్కడ దాచిపెట్టారో ఎలా తెలుసుకోవడం. అవతల తాను చావుబతుకుల మధ్య ఉంది. రక్షించుకోవడానికి సమయం చాలా తక్కువగా ఉంది. ఈ చుట్టుపక్కవ వాళ్లు కిడ్నాపర్లను చూసి ఉంటారా?

డ్రైవర్‌ : చూసిన ఎవరు చెప్తారు సార్‌ ఎవరి భయం వారిది.

విక్రమ్‌ దగ్గరలోని చాయ్‌ బండి దగ్గరకు వెళ్లి చాయ్‌ తాగుతూ కిడ్నాప్‌ జరిగిన విషయం చాయ్‌వాలాకు చెప్తాడు. రౌడీలు మీ డ్రైవర్‌ ను కొట్టి మీ మేడమ్‌ను ఎత్తుకెళ్లారని చెప్తాడు. అయితే కిడ్నాపర్లను సరిగ్గా చూడలేదని అయితే వారి కారు నంబర్‌ రాసి పెట్టానని ఒక కాగితం తీసి నంబర్‌ విక్రమ్‌కు ఇస్తాడు చాయ్‌ వాలా.. విక్రమ్‌ వెంటనే పోలీసులకు ఫోన్‌ చేసి జరిగిన విషయం చెప్తాడు. తులసి స్కూటీ మీద దివ్యను వెతుక్కుంటూ వెళ్తూ..

తులసి : దివ్యని ఎక్కడని వెతకాలి.. ఏమని వెతకాలి.. దివ్య ఇక ఎంతసేపు స్పృహలో ఉండదు. ఏ నిమిషాన ఏం జరుగుతుందో.. ఇక ఏం చేయాలి.

అనుకుంటూ ఎదురుగా కనిపిస్తున్న ఆలయం వైపు చూస్తూ ఏడుస్తూ.. దేవుణ్ని మొక్కుతూ దివ్యను కాపాడే అవకాశం ఇవ్వమని.. అలాగే హనిని కూడా కాపాడుకోవాలని ఏడుస్తూ ఉండటంతో ఇవాళ్టి ఏపిసోడ్‌ ముగుస్తుంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Embed widget