News
News
వీడియోలు ఆటలు
X

Ennenno Janmalabandham May 25th: పెళ్లి చేసుకొచ్చిన అభిమన్యు, మాళవిక షాక్ - హనీమూన్ కి చెక్కేసిన వసంత్ దంపతులు

అభిమన్యు నిజస్వరూపం బయట పెట్టి వేద చిత్ర పెళ్లి వసంత్ తో జరిపించింది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

పువ్వుల వల్ల యష్ కి తుమ్ములు వచ్చేసరికి వాటిని వేద చెడామడా తిట్టేస్తుంది. నీలో మంచి కవయిత్రి దాగుని ఉంది నామీద కూడా ఒక కవిత్వం చెప్పవా అని బతిమలాడతాడు. యష్ నువ్వంటే నాకు క్రష్ నువ్వు కాదంటే అవుతాను ఫిష్ అని పిచ్చి కవిత చెప్పేస్తుంది. వసంత్ దంపతులకు మాలిని కొత్త బట్టలు పెట్టి ఆశీర్వదిస్తుంది. యష్ వాళ్ళకి సర్ ప్రైజ్ చేస్తాడు. చిత్ర, వసంత్ ని కంపెనీలో షేర్ హోల్డర్స్ గా చేశానని యష్ చెప్తాడు. అభిమానం సరిపోవడం లేదనా ఆస్తులు కూడా పంచుతున్నావని వసంత్ అంటాడు. ఎప్పుడో ఇవ్వాలసింది ఇప్పుడు టైమ్ వచ్చిందని చెప్తాడు. వేద కూడా సర్ ప్రైజ్ ప్లాన్ చేశానని అంటుంది. చిత్ర చేతిలో ఫ్లైట్ టికెట్స్ పెట్టి హనీ మూన్ కి వెళ్ళమని చెప్తుంది. వసంత్ మాత్రం మొహం డల్ గా పెట్టేసి యష్ ని పక్కకి లాక్కుని వస్తాడు. మా పెళ్లి జరిగి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే హనీ మూన్ మీ పెళ్లి జరిగి చాలా రోజులైంది మీరు వెళ్తాను అంటేనే మేము వెళ్తామని కండిషన్ పెడతాడు.

Also Read: స్వప్నని పెళ్లిచేసుకుంటానని వచ్చిన అరుణ్- రాహుల్ కి వెన్నెలనిచ్చి పెళ్లి చేస్తానన్న అరుంధతి

హనీ మూన్ అనేసరికి యష్ సిగ్గు మొగ్గలేస్తాడు. ఈ విషయం మీ వదినకు చెప్పకు సర్ ప్రైజ్ చేస్తానని యష్ అంటాడు. అభిమన్యుని విడిపించమని మాళవిక భ్రమరాంబికకి కాల్ చేస్తుంది. దీంతో తమ్ముడిని విడిపించుకునేందుకు స్టేషన్ దగ్గరకి వస్తుంది. లాయర్ వచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసినా విడిపించలేమని చేతులెత్తేస్తాడు. ఇప్పుడు ఎలాగైనా తమ్ముడిని కాపాడాలి తనని కాపాడే వాళ్ళే లేరా అనగానే నీలాంబరి లాయర్ ని తీసుకుని ఎంట్రీ ఇస్తుంది.  అభిని బయటకి తీసుకొస్తానని చెప్తుంది. ఇద్దరూ స్టేషన్ లోకి వెళ్ళి బెయిల్ ఇచ్చి అభిమన్యుని రిలీజ్ చేయిస్తారు. బెయిల్ తీసుకొచ్చినందుకు చాలా థాంక్స్ అక్కా అంటాడు. నేను కాదు నీకు బెయిల్ ఇప్పించింది తను నీలాంబరి అని పరిచయం చేస్తుంది. థాంక్స్ కాదు కోరుకున్న కోరిక తీర్చాలని చెప్తుంది. వసంత్ వాళ్ళు హనీ మూన్ కి వెళ్తూ యష్ కి హోటల్ రూమ్ బుక్ చేశానని చెప్తాడు. మీరు వెళ్లకపోతే మేము మధ్యలోనే వచ్చేస్తామని అనేసరికి సరే వెళ్తాంలే అంటాడు.

Also Read: నిజం చెప్పేసిన చిత్ర- అభిమన్యు అరెస్ట్, ఆగిపోయిన మాళవిక పెళ్లి

వసంత్ ఏంటి ఇచ్చాడని మాలిని అడుగుతుంది. ఇద్దరూ చెప్పకుండా నీళ్ళు నములుతారు. కానీ వేద మాత్రం డౌట్ పడుతుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వేద పేపర్ ఇవ్వమని అడుగుతుంది. ఆఫీసుది అన్నారు కదా ఇస్తే ఫైల్ లో పెట్టేస్తానని కవర్ చేస్తాడు. సులోచన గుడికి వేదని తీసుకువెళ్లాలని అంటుంది. ఇక మాలిని షాపింగ్ కి తీసుకెళ్తానని గొడవ చేస్తుంది. మీతో కాదు కోడలు తనతో వస్తుందని మధ్యలో రత్నం దూరతాడు. వాళ్ళని చూసి అమ్మో కాంపిటీషన్ పెరిగిపోతుంది వేదని బయటకి తీసుకెళ్లడం ఎలా అనుకుంటాడు. అప్పుడు ఖుషి వచ్చి మీతో ఎవరితో రాదు నేను చెప్పిన చోటుకి వస్తుందని అంటుంది.

Published at : 25 May 2023 08:38 AM (IST) Tags: Ennenno Janmalabandham Serial Today Episode Ennenno Janmalabandham Serial Ennenno Janmalabandham Serial Written Update Ennenno Janmalabandham Serial May 25th Episode

సంబంధిత కథనాలు

మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!

మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!

Gruhalakshmi May 29th: తప్పు తెలుసుకున్న భాగ్య, తులసికి సపోర్ట్- రాజ్యలక్ష్మిని రోకలి బండతో కొట్టిన దివ్య

Gruhalakshmi May 29th: తప్పు తెలుసుకున్న భాగ్య, తులసికి సపోర్ట్- రాజ్యలక్ష్మిని రోకలి బండతో కొట్టిన దివ్య

Krishna Mukunda Murari May 29th: తన ప్రేమకి ఆయుషు తీరిపోయిందని గుండెలు పగిలేలా ఏడుస్తున్న కృష్ణ

Krishna Mukunda Murari May 29th: తన ప్రేమకి ఆయుషు తీరిపోయిందని గుండెలు పగిలేలా ఏడుస్తున్న కృష్ణ

Guppedanta Manasu May 29th: జగతిని దోషిని చేసి వెళ్ళిపోయిన వసు- గుండెనొప్పితో కుప్పకూలిన సుమిత్ర, ఇక రిషిధార కలవనట్టేనా?

Guppedanta Manasu May 29th: జగతిని దోషిని చేసి వెళ్ళిపోయిన వసు- గుండెనొప్పితో కుప్పకూలిన సుమిత్ర, ఇక రిషిధార కలవనట్టేనా?

Brahmamudi May 29th: టెన్షన్.. టెన్షన్.. నెలతప్పిన స్వప్న, వెన్నెలతో రాహుల్ నిశ్చితార్థం- కిడ్నాపైన కావ్యని కాపాడేదెవరు?

Brahmamudi May 29th: టెన్షన్.. టెన్షన్.. నెలతప్పిన స్వప్న, వెన్నెలతో రాహుల్ నిశ్చితార్థం- కిడ్నాపైన కావ్యని కాపాడేదెవరు?

టాప్ స్టోరీస్

Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !

Andhra News  :  జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం  !

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి

Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి