Ennallo Vechina Hrudayam Serial Today May 12th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: ప్లేట్ తిప్పేసిన లాయర్.. గాయత్రీని గెంటేసిన వాసుకి.. త్రిపుర, బాలల ప్లాన్ ఫెయిల్!
Ennallo Vechina Hrudayam Today Episode త్రిపుర వాళ్లు లాయర్‌ని తీసుకురావడం ఫణి భయపెట్టడంతో లాయర్ గాయత్రీ మీద నింద వేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode బాల, త్రిపురలు లాయర్ ఇంటికి డిటెక్టివ్స్‌లా వెళ్తారు. లాయర్ దగ్గరకు వెళ్లి ఒక కేసుకి సంబంధించి మీతో మాట్లాడాలి అంటుంది. లాయర్ వాళ్లని లోపలికి తీసుకెళ్తాడు. బాల, త్రిపురలు ఫారెన్ నుంచి వచ్చాం మా ల్యాండ్ మాకు ఇప్పించాలి అని చెప్తాడు. ఈ మధ్య ఏదైనా హై ప్రొఫైల్ కేసు సాల్వ్ చేశావా చూపించు అని బాల అడుగుతాడు. దానికి లాయర్ గాయత్రీకి పంపిన పవర్ ఆఫ్ ఆటర్నీ కేసు డిలైల్స్ ఇస్తాడు. ఫ్యామిలీ అంతా ముక్కలైపోయిందని అంటాడు.
త్రిపుర తన బ్యాగ్ నుంచి ఒరిజనల్ డాక్యుమెంట్స్ తీసి ఆ కేసు ఒరిజనల్ డాక్యుమెంట్స్ ఇవే కదా అంటారు. లాయర్ త్రిపుర వాళ్లని గుర్తించి షాక్ అయిపోతారు. ఇంటికి వచ్చి నిజం చెప్పమని అంటారు. లాయర్ తన వల్ల కాదు అంటాడు. బాల గన్ చూపించి వస్తావా కాల్చేయాలా అంటే లాయర్ వస్తానని ఒప్పుకుంటాడు. లాయర్‌ని లాక్కొని వెళ్లి అందర్ని పిలుస్తారు. త్రిపుర గాయత్రీని తీసుకొని వస్తుంది. లాయర్‌ని చూసిన ఫణి చాలా కంగారు పడతారు.
త్రిపుర ఇంట్లో వాళ్లతో లాయర్ జగదీష్ ప్రసాద్ ఈయనే అని చెప్తుంది. బాల తండ్రితో గాయత్రీ పేరు మీద ఎవరో కొరియర్ పంపమంటే పంపేశాడు అంటాడు. నిజం చెప్పమని అందరూ అడుగుతారు. ఫణి కంగారుతో వెళ్లి లాయర్ కాలర్ పట్టుకొని మెల్లగా ఏదో చెప్తాడు. దాంతో లాయర్ గాయత్రీని చూపించి తనే పంపమని చెప్పిందని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. త్రిపుర, బాల నోరెళ్లపెడతారు. అబద్ధం చెప్తున్నారు నేను చెప్పడం ఏంటి అని అడుగుతుంది. మీరు మాట మార్చుతున్నారని త్రిపుర అంటుంది. ఇదే ఛాన్స్‌గా వాసుకి, నాగభూషణం గాయత్రీ మీద ఇంకా నిందలు వేస్తారు. గాయత్రీ వచ్చి తనకు డిటైల్స్ అడిగిందని చెప్తాడు.
బామ్మ త్రిపుర మీద రివర్స్ అవుతుంది. త్రిపుర చేసిన పనికి మన ఇంటి పరువు రోడ్డున పడిందని వాసుకి అంటుంది. త్రిపుర ఎంత చెప్పినా బామ్మ వాళ్లు వినరు. గాయత్రీనే తప్పు చేసిందని అంటారు. త్రిపురని బామ్మ తిడుతుంది. బాల ఎంత చెప్పినా బామ్మ వాళ్లు వినరు. బాలని ట్రైనింగ్ ఇచ్చి నీ వైపు తిప్పుకున్నావని వాసుకి, నాగభూషణం అంటారు. వాసుకి గాయత్రీని తిట్టి లాక్కెళ్లి బయటకు తోసేస్తుంది. అప్పుడే వచ్చిన అనంత్ చూసి షాక్ అయి గాయత్రీని పట్టుకుంటాడు. గాయత్రీ, అనంత్ ఇద్దరూ కన్నీరు పెట్టుకుంటారు. మళ్లీ ఇంట్లో అడుగు పెడితే మర్యాద దక్కదు అని వాసుకి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. అనంత్ ఇద్దరి కోసం తీసుకొచ్చిన అన్నం పార్శిల్ కింద పడిపోతుంది. త్రిపుర అది చూసి బాధ పడుతుంది.
వాసుకి వాళ్లు ఫణి దగ్గరకు వెళ్లి ఏమైందని నువ్వే ఏదో చేశావు కదా అంటే లాయర్ కొడుకుని అడ్డు పెట్టుకొని లాయర్ గాయత్రీ మీద నింద వేసేలా చేశానని అంటాడు. రాత్రి బాల త్రిపుర దగ్గరకు వెళ్లి లాయర్ ఎందుకు అబద్ధం చెప్పాడని అడుగుతాడు. అదే అర్థం కాలేదని త్రిపుర అంటుంది. గాయత్రీ చాలా ఫీలైందని బాల అంటాడు. ఉదయం బాలని బామ్మ దగ్గర కూర్చొపెట్టుకుంటుంది. ఇంతలో స్వామి వస్తారు. బాలకి కావాల్సిన రాశి తిథి అన్నీ సరిపోయిన సంబంధం తీసుకొచ్చానని అంటారు. మీరు సరే అంటే రేపు పెళ్లి చూపులు పెట్టుకుందామని అంటారు. బామ్మ పెళ్లి చూపులు గుడిలో పెట్టుకుందామని అంటుంది. వాసుకి వాళ్లు షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















