Chinni Serial Today May 12th: చిన్ని సీరియల్: కావేరికి సీరియస్.. బాలరాజు, కావేరిల కూతురే చిన్ని అని ఉష కావేరి ఒక్కరే అని తెలుసుకున్న దేవా, వల్లి!
Chinni Today Episode కావేరి విషం ఉన్న స్వీట్ తినడం వల్ల కావేరి కండీషన్ సీరియస్ కావడం, బాలరాజు, కావేరిల కూతురు చిన్ని అని దేవాకి తెలిసిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode నాగవల్లి పెట్టిన విషపు స్వీట్ తినడం వల్ల కావేరికి కడుపులో తిప్పుతూ కళ్లు తిరుగుతాయి. కావేరికి స్వీట్ తినిపించిన చిన్ని నాన్నకి తినిపిస్తానని బయటకు వెళ్తుంది. రాజు రౌడీలను కొడుతూ ఉంటాడు. కావేరి నోటి నుంచి రక్తం వస్తుంది. తూగుతూ కావేరి కూడా బయటకు వస్తుంది. రౌడీలు రాజుని కత్తితో పొడవబోతారు. చిన్ని అది చూసి నాన్న అని పిలుస్తుంది.
బాలరాజు వెనక్కి తిరిగి రౌడీ చేతిలో చాకు చేతితో పట్టి వాడిని కొడతాడు. చిన్ని నాన్న అనడం విన్న దేవేంద్రవర్మ, నాగవల్లిలు నాన్ననా అని షాక్ అయిపోతారు. ఇక కావేరి అక్కడికి వస్తుంది. చిన్ని అమ్మా అనడం రాజు కావేరి అనడం దేవా వాళ్లు విని షాక్ అయిపోతారు. వల్లి, దేవా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. చిన్ని, రాజులు కావేరిని ఆటోలో ఎక్కించి హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. సత్యంబాబు వాళ్లకి విషయం తెలిసి షాక్ అయిపోతారు. దేవేంద్ర వర్మ, నాగవల్లిలు కావేరి, బాలరాజులు దొరికిపోయారని వాళ్ల అంతు చూసిన తర్వాత చిన్న, మేనమామల సంగతి చూద్దామని అంటాడు. రౌడీలకు కాల్ చేసి ఆటో మొదలైంది అని డ్రగ్స్ గురించి పోలీసులకు చెప్పమని అంటాడు.
పోలీసులు ఆటోని ఫాలో అవుతారు. ఓ చోట ఆటోని ఆపుతారు. ఆటోలో మాదకద్రవ్యాలు ఉన్నాయని చెక్ చేయాలని అంటారు. రాజు అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్తాడు. ఆటో మొత్తం పోలీసులు వెతుకుతారు ఆటోలో ఏం డ్రగ్స్ దొరకవు. దాంతో రౌడీలు షాక్ అవుతారు. రాజు పోలీసుల్ని ప్రశ్నిస్తాడు. తర్వాత కావేరిని తీసుకొని ఆటోలో వెళ్తాడు. రౌడీలు దేవేంద్ర వర్మకి కాల్ చేసి డ్రగ్స్ దొరకలేదని చెప్తాడు. దేవా, వల్లి షాక్ అయిపోతారు. ఆటో వెనకాలే పోలీసులు రావడం గుర్తించిన దేవా తన మీద కూడా దేవా డ్రగ్స్ ప్లాన్ చేసుంటాడని ఓ చోట ఆటో ఆపి ఆటో మొత్తం వెతుకుతాడు. డ్రగ్స్ దొరకడంతో వాటిని తీసి పడేస్తాడు. రేయ్ దేవా నీ సంగతి నాకు తెలుసురా అందుకే నా జాగ్రత్తలో నేను ఉంటాను అనుకుంటాడు.
కావేరిని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తాడు. డాక్టర్ ఎమర్జెన్సీ వార్డ్‌కి కావేరిని తీసుకెళ్తుంది. చిన్ని, బాలరాజులు ఏడుస్తుంటారు. సత్యంబాబు వాళ్లు అక్కడికి వస్తారు. చిన్ని అమ్మ మామయ్య అని ఏడుస్తుంది. సరళ అమ్మ ఏంటి అని అడుగుతుంది. వాళ్ల టీచరమ్మ అని బాలరాజు చెప్తాడు. సత్యంబాబు బాలరాజుతో డాక్టర్ ఏమన్నారు అని అడుగుతాడు. ట్రీట్మెంట్ జరుగుతుందని బాలరాజు చెప్తాడు. తను తిన్న ఫుడ్‌లో విషం కలిసిందని తను ఆత్మహత్య ప్రయత్నం చేసిందేమో అని అంటారు. రాజు, సత్యం అలాంటిది లేదని అంటారు. ఎవరో తనని చంపాలని ప్రయత్నించారని చెప్తుంది. 24 గంటలు గడిస్తే ఏం చెప్పలేమని డాక్టర్ అంటారు. చిన్ని వాళ్లు ఏడుస్తారు.
కావేరి పరిస్థితి లైవ్‌లో చూద్దామని దేవేంద్ర వర్మ, నాగవల్లిని తీసుకొని లోపలికి వెళ్తాడు. సత్యంబాబు వాళ్ల దగ్గరకు వెళ్లి పలకరిస్తాడు. సత్యంబాబు వాళ్లని చూసి షాక్ అయిపోతాడు. ఉష టీచర్‌కి ఏం కాదని పరామర్శిస్తారు. సత్యంబాబుకి వాళ్ల మీదే అనుమానంగా ఉంటుంది. చిన్నితో మీ టీచర్‌కి అలాంటిది ఏం జరగదు భయపడకు అని అంటాడు. బాలరాజు వాళ్లని చూస్తాడు. నర్స్‌ని పిలిచి మందులు ఆమెతో పంపిస్తాడు. డాక్టర్ ఏమన్నాడు అని సత్యంబాబుని అడిగితే ఐసీయూ దగ్గర ఎక్కువ మంది ఉండొద్దు అన్నారు బయల్దేరండి అని అంటాడు. దేవా వాళ్లు వెళ్లిపోతారు. దేవా వాళ్లు వెళ్తుంటే బాలరాజు బయట ఎదురు పడతాడు. ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: చిన్ని రాజు కూతురని దేవాకి తెలిసిపోతుందా.. అన్న సంతోషం చూసి పొంగిపోయిన కావేరి!





















