Devatha October 11th Update: మాధవ్ కి వార్నింగ్ ఇచ్చిన భాగ్యమ్మ- ఆదిత్య, సత్య మధ్య రుక్మిణి ఉందని దేవుడమ్మకి తెలిసిపోతుందా?
రుక్మిణిని తప్పుగా అర్థం చేసుకుని తన మీద అరుస్తుంది సత్య. మరోవైపు రాధ పేరు రుక్మిణీ అని దేవికి తెలిసిపోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
మన కొడుకు, కోడలు ఆనందంగా ఉండాలి, ఆ ఆశతోనే నేను గుడిలో పొర్లు దండాలు పెట్టాను అనేసరికి సత్య వచ్చి ఎమోషనల్ అవుతుంది. మేము బాగుండాలని అనుక్షణం ఆలోచిస్తున్నారు, మీ కోసం వారాసుడిని ఇవ్వాలని నేను కోరుకుంటున్నా కానీ అది తీరడం లేదని సత్య బాధపడుతుంటే దేవుడమ్మ ధైర్యం చెప్తుంది. దేవి ఎందుకు అలా ఉందో అని రుక్మిణి ఆలోచిస్తుంది. దేవమ్మ ఇలా ఉంటే సత్య నన్ను అర్థం చేసుకోవడం లేదు తన బతుకు నేనేదో చేస్తున్నా అని తప్పుగా అర్థం చేసుకుంటుంది, సత్య నా దగ్గరకి వచ్చి ఇలా మాట్లాడిందని పెనిమిటి చెప్తే వాళ్లిద్దరికి లొల్లి అవుతుంది. ఇటువంటివి చెప్తే పెనిమిటి ఊరుకుంటాడా ఇంటికి వెళ్ళి సత్యని తిడతాడు. నా పెనీమిటికి సత్య గురించి చెప్పకూడదు. ఏం చేయాలి సత్యకి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.
Also Read: కాంచనని నిలదీసిన వేద, బయటపడ్డ నిజం- సులోచనకి హారతి ఇచ్చి స్వాగతం చెప్పిన మలబార్ మాలిని
దేవి అలా ఎందుకు ఉందో అంకుల్ అడిగితే చెప్తుంది అని చిన్మయి ఆదిత్యకి ఫోన్ చేస్తుంది. దేవి దేని గురించో బాధపడుతుంది, ఎంత అడుగుతున్నా చెప్పడం లేదు అన్నం కూడా తినలేదు, రేపు మీరు స్కూల్ దగ్గరకి రండి మీరు అడిగితే తప్పకుండా చెప్తుంది అని చిన్మయి అంతే తప్పకుండా వస్తాను అని ఆదిత్య అంటాడు. జానకమ్మ దగ్గరకి వచ్చి మాధవ్ తన ప్లాన్స్ చెప్తాడు. ఆ రోజు నా మాట వింటే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు, నాకు అడ్డు పడకుండా ఉండి ఉంటే ఈరోజు నాకు భార్యగా చిన్మయికి తల్లిగా ఉండేది. నువ్వేమో రాధని ఉద్దరించాలని అడ్డుపడి వీల్ చైర్ లో ఉన్నావ్. నువ్వు బాగానే ఉన్నావ్ కానీ నాకు భార్య లేదు, చిన్మయికి తల్లి లేదు. రాధ ఇక్కడ నుంచి వెళ్లిపోతే నా బిడ్డని తల్లి లేనిదానిగా పెంచామంటావా. నన్ను ఏ తోడు లేకుండా జీవితాంతం ఇలాగే ఉండమంటావా.’
‘నామనసులో లేని ఆలోచన లేపింది నువ్వు. దేవిని ఎవ్వరికీ ఇవ్వను, దేవిని ఇవ్వడం అంటే రాధని ఇవ్వడమే. రాధ నాకు కావాలి దాని కోసం నేను ఏదైనా చేస్తాను ఎంతకైనా తెగిస్తాను’ అని చెప్తాడు. ఆదిత్య బయటకి వెళ్తుంటే టిఫిన్ తినమని సత్య అడుగుతుంది. వద్దని అనేసరికి సత్య ఏం బయట ఎవరితో అయినా తింటున్నావా అని సత్య నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. దీంతో ఆదిత్య తన మీద గట్టిగా అరిచేసి వెళ్ళిపోతాడు. అదంతా దేవుడమ్మ వాళ్ళు చూస్తారు. వీళ్ళు ఏంటి ఇలా మాట్లాడుకుంటున్నారు అని దేవుడమ్మ బాధపడుతుంది. అసలు వీళ్ళ మధ్య ఇంతగా మనస్పర్థలు ఎందుకు వచ్చాయి, కొత్తగా వీళ్ళ మధ్య ఎవరైనా మూడో వ్యక్తి ఉన్నారా అని అనుమానపడుతుంది.
Also Read: సూపర్ ట్విస్ట్, పూలదండలతో ఇంటికి వచ్చిన రిషిధార- ఖంగు తిన్న దేవయాని
రుక్మిణి పని చేసుకుంటుంటే తనని తదేకంగా చూస్తూ ఉండటం భాగ్యమ్మ చూస్తుంది. కాఫీ తీసుకొచ్చి మాధవ్ కి ఇస్తూ కావాలని చేయి జర విడుస్తుంది. కాఫీ మాధవ్ కాలి మీద పడేలా చేస్తుంది. ‘ఏమిరా నకరాలు చేస్తున్నావా, నీ కళ్ళు నెత్తికి ఎక్కినాయ్ అందుకే ఇసువంటి గలిజ్ పనులు చేస్తున్నావ్’ అనేసరికి మాధవ్ షాక్ అవుతాడు. ఏంటి నోరు లేస్తుందని మాధవ్ అనేసరికి నోరు కాదు ఎక్కువ మాట్లాడితే చేయి లేస్తదని వార్నింగ్ ఇస్తుంది. నా బిడ్డని బాధపెడుతున్నావ్, నేను ఎవరు అనుకున్నావ్ దాని తల్లిని. నా బిడ్డని కష్టపెట్టాలని చూస్తే ఊరుకుంటాను అనుకున్నావా అని భాగ్యమ్మ కోపంగా అంటుంది.