Ennenno Janmala Bandham October 11th: కాంచనని నిలదీసిన వేద, బయటపడ్డ నిజం- సులోచనకి హారతి ఇచ్చి స్వాగతం చెప్పిన మలబార్ మాలిని
సులోచన తనని తిట్టిందనే కోపంతో ఖైలాష్ ఆమెకి యాక్సిడెంట్ చేస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
యష్ ఒక చోట కూర్చుని ఉంటే వేద తనకి భోజనం తీసుకుని వెళ్తుంది. అత్తయ్య అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలిసి చాలా హ్యాపీగా ఉందని యష్ అంటాడు. చాలా ఏళ్ల తర్వాత హస్పిటల్ కి వచ్చాను. ఆదిత్య పుట్టిన తర్వాత ఒక రోజంతా హాస్పిటల్ లో ఉన్నా మళ్ళీ ఇప్పుడు ఉంటున్నా అని చెప్పుకొచ్చాడు. ఆదిత్య మీద తనకున్న ప్రేమని చెప్తాడు. వేద యష్ కి థాంక్స్ చెప్తుంది. వద్దని అంటాడు. ఎందుకు వద్దు మీరు ఎంత చేశారు మాకు ఈరోజు, మా ఫ్యామిలీ మొత్తం తరఫున మీకు థాంక్స్ చెప్తున్న అని వేద అంటుంది. ఆ సమయంలో అక్కడ మీరు ఉండటం హాస్పిటల్ లో జాయిన్ చేయించడం చాలా సేవ్ అయిందని వేద అంటుంది.
నాదేమి లేదు అత్తయ్య మంచితనం, ఆమె చేసిన పూజలే ఇదంతా అని యష్ అంటాడు. అందుకే బిల్ పే చేశారా అంతే బిల్ ఊరికే ఏమి కట్టలేదని, అప్పుగా ఇచ్చాను వడ్డీ కూడా వసూలు చేస్తాను అని సరదాగా యష్ అంటాడు. ఇవే కాదు షరతులు కూడా వర్తిస్తాయి, నువ్వు నన్ను మిస్టర్ యారగెంట్ అని పిలవకూడదు, డ్రింక్ మానేయమని అసలు చెప్పకూడదని యష్ చెప్తాడు. ఇలాంటి షరతులు ఏమి ఉండవు నేను ఒప్పుకోను, వడ్డీ కూడా ఇవ్వను అసలు కూడా ఇవ్వను, ఒక్క పైసా కూడా ఇవ్వను. ఎందుకంటే నా దగ్గర బ్యాంక్ బాలెన్స్ లేదని అంటుంది. అంటే నా డబ్బులు గోవిందానా అని యష్ అంతే అవును గుండు సున్నా అని వేద నవ్వుతూ చెప్తుంది. ఆ మాటకి ఇద్దరూ నవ్వుకుంటారు.
Also Read: సూపర్ ట్విస్ట్, పూలదండలతో ఇంటికి వచ్చిన రిషిధార- ఖంగు తిన్న దేవయాని
ఇద్దరూ మాట్లాడుకుంటూ యష్ భుజం మీద వాలిపోయి నిద్రపోతుంది వేద. సులోచనని వేద, యష్ కలిసి ఇంటికి తీసుకొని వస్తారు. ఇంట్లో వాళ్ళు అందరూ బెలూన్స్ పట్టుకుని సంతోషంగా తనకి స్వాగతం చెప్తారు. అది చూసి సులోచన సంతోషిస్తుంది. మాలిని హారతి ఇచ్చి సులోచనని ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది. ఆ దేవుడితో దెబ్బలాడి మరి నిన్ను వెనక్కి తీసుకొచ్చాను నాకు వదిలేయండి నేను చూసుకుంటాను అని మాలిని అంటుంది. వారం రోజుల్లో మా వదిన లేచి నడుస్తూ గలగలా మాట్లాడుతూ నా మీద యుద్దానికి వచ్చేస్తుందని చెప్తుంది. నన్ను చూసి నువ్వు భయపడలి అనేసరికి సులోచన పక్కన ఉన్న బెలూన్ పేలుస్తుంది. అది విని మాలినినే భయపడుతుంది.
బ్రెయిన్ కి తగిలిన దెబ్బ వల్ల షాక్ అయింది, నడుముకి తగిలిన దెబ్బ వల్ల లేచి నడవటానికి కొద్దిగా టైమ్ పడుతుందని డాక్టర్ చెప్తుంది. సులోచన వేదకి ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది కానీ మాట్లాడలేక పోతుంది. అది యష్ కూడా గమనిస్తాడు. అమ్మ రోడ్డు మీద నడిచేతప్పుడు చాలా జాగ్రత్తగా నడుస్తుంది, అలాంటిది మా అమ్మని కారు గుద్దేశారు అంతే ఎవరో కావాలని యాక్సిడెంట్ చేసినట్టు అనిపిస్తుందని వేద ఆనుమానిస్తుంది. అత్తయ్యగారు క.. క.. అని పేరు చెప్పబోతున్నారు ఎవరిది ఆ పేరు అని యష్ ఆలోచిస్తుండగా వేద ఖైలాష్ అని అంటుంది. అమ్మ చెప్పాలనుకున్న పేరు ఖైలాష్ అని అంటుంది.
Also Read: మోనిత కుట్ర తెలుసుకున్న కార్తీక్- చుక్కలు చూపించిన దుర్గ, దీపకి అండగా నిలిచిన రాజ్యలక్ష్మి
వెంటనే కాంచన ఖైలాష్ కి ఫోన్ ట్రై చేస్తుంది. అసలు ఆ యాక్సిడెంట్ గురించి ఆయన అంత టెన్షన్ ఎందుకు పడుతున్నారని కాంచన ఆలోచిస్తుంది. వేద కాంచన దగ్గరకి వచ్చి ఖైలాష్ మీతో ఫోన్లో ఏం మాట్లాడారు అని అడుగుతుంది. ఆయన మామూలుగానే ఫోన్ చేశారని అంటుంది. అబద్ధం చెప్పకు వదిన అని వేద నిలదీస్తుంది. వేద వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అయ్యిందంట కదా ఎలా ఉందని అడిగారని కాంచన చెప్తుంది.