Devatha Serial July 7th Update: తన కన్నింగ్ ఆలోచనలు బయట పెట్టిన మాధవ, దేవిని స్కూల్ లో చేర్పించిన ఆదిత్య- మాధవ కుట్ర నుంచి రాధ ఎలా తప్పించుకుంటుంది?
దేవి తన చేతి మీద పచ్చబొట్టు లేదని ఎక్కడ చూస్తుందో అని మాధవ కంగారూ పడతాడు. మ్యాజిక్ చేస్తాను కళ్ళుమూసుకో అని చెప్పి గబగబా వెళ్ళి స్కెచ్ తీసుకుని దేవి అని రాసుకుంటాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
దేవి తన చేతి మీద పచ్చబొట్టు లేదని ఎక్కడ చూస్తుందో అని మాధవ కంగారూ పడతాడు. మ్యాజిక్ చేస్తాను కళ్ళుమూసుకో అని చెప్పి గబగబా వెళ్ళి స్కెచ్ తీసుకుని దేవి అని చేతి మీద రాసుకుంటాడు. ఇక దేవి మాధవ చేతిలో జామ కాయలు పెడుతుంది. ఇవి ఎక్కడవని మాధవ అంటే భాగ్యమ్మ అమ్మమ్మ స్కూల్ దగ్గర పండ్లు అమ్ముతుందని చెప్తుంది. రాధ ఒక్కొక్కరిని కలుపుకుంటూ పోతుందంటే తన బలం పెంచుకుంటూ పోతుందన్నమాట అని మాధవ మనసులో అనుకుంటాడు. తెలివిగా రాధ కూడా బాగానే పావులు కదుపుతుందని అనుకుంటాడు. పెనివిటి నన్ను కూడా స్కూల్ తానికి రమ్మంటున్నాడేంటి నేను పోయి ఏం చేస్తాననని రుక్మిణి ఆలోచిస్తుంది. ఇంతలో అక్కడికి మాధవ దేవి వస్తారు.
ఆఫీసర్ సారు నన్ను కొత్త స్కూల్ లో చేర్పించడానికి తీసుకుపోడానికి వస్తాననని చెప్పారని దేవి సంబరంగా చెప్తుంటే రాధ కూడా నిన్నే కాదు నన్ను కూడా తీసుకుని వెళ్తాననని చెప్పారని చెప్తుంది. ‘అవునా రాధ దేవి ఒక్కటే ఆఫీసర్ తో వెళ్తే ఏం బాగుంటుందా అనుకున్న నిన్ను కూడా రమ్మనడా అయితే ప్రాబ్లెమ్ లేదులే. నువ్వేంటి ఇలా ఉన్నావే ఆఫీసర్ తో వెళ్లాలంటే బాగా రెడీ అవ్వాలి కదా’ వెళ్ళు అని వెటకారంగా అంటాడు. అమ్మకి తెలియడం లేదు కానీ నువ్వు వెళ్ళి రెడీ చెయ్యమని దేవికి చెప్తాడు. ఆఫీసర్ సార్ హడావిడిగా వస్తాడేమో అని ఫోన్ అదిత్యకి ఫోన్ చేస్తాడు. ఏంటి సారు కథలు పడుతున్నాడు, మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఇంత మంచిగా చెప్తున్నడంటే ఏదో ఉందని రాధ అనుమానపడుతుంది.
అదిత్యకి ఫోన్ చేసి మాధవ మాట్లాడతాడు. దేవితో పాటు మా రాధాని కూడా రమ్మన్నారంట కదా ఆఫీసర్ సార్ తో రావాలంటే బాగా రెడీ అవ్వాలి కదా అని వంకరగా మాట్లాడతాడు. హడావుడిగా లేకుండా నిదానంగానే రమ్మని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అదేంటి నాయన ఆఫీసర్ సారు త్వరగా వస్తే నేను మాట్లాడుకుంటూ ఉంటాను కదా అని దేవి అంటుంది. ఆఫీసర్ సార్ వస్తే మీ అమ్మ నిలవదు కదమ్మా అని వెటకారంగా మాట్లాడుతుంటే రాధ కోపంగా చూస్తూ ఉంటుంది. కారులో వస్తూ మాధవ గురించి రుక్మిణి చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఆలోచిస్తాడు. ఆ మాధవ ఏం చేస్తాడని రుక్మిణి అంతలా భయపడుతుందని అనుకుంటాడు.
ఎందుకు రాధ నన్ను చెడ్డవాడివి చేస్తున్నావ్ అని మాధవ రాధ ఫోటో ఫోన్ లో చూసుకుంటూ మాట్లాడుకుంటాడు. ‘నన్ను దెబ్బ తియ్యాలని నువ్వు అనుకుంటున్నావ్ కానీ నీ కోసం నేను ఎత్తుకు పై ఎత్తులు వేస్తూనే ఉంటాను. నా ప్లాన్ ఏంటి నేను ఎందుకు ఇలా చేస్తున్నాని ఆలోచిస్తూ ఉంటారు. ప్రశాంతంగా మాట్లాడుకోలేరు, మీ అభిమానానికి ఆలోచనలకి నేను అడ్డుగానే ఉంటాను. నేను ఏం చేస్తానో అని ఆలోచన దగ్గరే మీరు ఉంటారు. మిమ్మల్ని మానసికంగా దెబ్బకొడతాను. నేను ఉండగా నిన్ను నా ఈల్లు దాటి పోనివ్వను దేవి తన తండ్రికి దగ్గర కాలేదు’ అని తన మనసులో కుట్రని బయటపెడతాడు.
Also Read: వేద నిజాయితీని యష్ నిరూపించగలడా? అమ్మ కోసం తపిస్తున్న ఖుషి
ఇక ఆదిత్య దేవిని స్కూల్ కి తీసుకుని వెళ్ళి మాట్లాడతాడు. నువ్వు కూడా మీ నాన్న లాగా కలెక్టర్ అవ్వాలనుకున్నవా చాలా గ్రేట్ అని స్కూల్ ప్రిన్సిపల్ అంటుంది. ఆ మాటలకి రుక్మిణి, ఆదిత్య సంబరపడతారు. అప్పుడు దేవి అంతా బాగుంది కానీ ఆఫీసర్ సారు మా నాయన కాదు నా దోస్త్ అని చెప్తుంది. ఆ మాటకి ఆదిత్య, రుక్మిణి బాధపడతారు. అదే నిజం బిడ్డా, నీకే ఆ నిజం తెలియక మీ నాయాన్ని గింత బాధపెడుతున్నావ్ అని రుక్మిణి మనసులో కుమిలిపోతుంది. నా బిడ్డే నన్ను నేను తన నాయన కాదు అని చెప్తున్నా ఏం మాట్లాడలేకపోతున్న ఇలా ఇంకా బాధ పడుతూ నేను ఉండలేను ఈయనే మా నాన్న అని దేవి చెప్పేలా త్వరలో చేస్తాను అని ఆదిత్య మనసులో అనుకుంటాడు.
సీన్ కట్ చేస్తే రాధలో ఈ మధ్య బాగా మార్పు వచ్చిందని జానకి మాధవ తో అంటుంది. ఆ ఆఫీసర్ సార్ మన దేవిని స్కూల్ లో చేర్పించడమేంటి నాకేం అర్థం కావడం లేదని అంటుంది. ఇదంతా ఏంటని రాధాని అడుగుదామని అనుకుంటున్నాను కానీ ఏమనుకుంటుందో అని ఆగిపోయాను. ఇన్నేళ్లలో లేని మార్పు రాధలో కొత్త ఇప్పుడు ఏంటి నాకేం అర్థం కావడం లేదని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ‘రాధ పెనిమిటి అని చెప్పేది ఎవరి గురించో కాదు ఆ ఆదిత్య గురించే. కానీ ఇదంతా ఎందుకు చేస్తుందో నాకు తెలుసు, దేవిని ఆ అదిత్యకి సొంతం చేయాలని ఈ ప్రయత్నాలన్నీ. కానీ ఆ దేవినే రాధ మీదకి అస్త్రంగా ప్రయోగించబోతున్న.. నాలో వచ్చిన ఈ మార్పు చూసి రాధలో కొద్ది కొద్దిగా భయం మొదలై ఉంటుంది’ అని మాధవ అనుకుంటాడు.
Also Read: జ్వాల(శౌర్య)కి నిజం తెలిసిపోయింది, ఇప్పుడు హిమ పరిస్థితేంటి - సౌందర్య రియాక్షన్ ఎలా ఉండబోతోంది!
ఏంటి రుక్మిణి అలా ఉన్నావని ఆదిత్య అడుగుతాడు. బిడ్డని నీ దగ్గరకి రానివ్వకుండా చూసేవాడు గట్ల మాట్లాడుతుంటే నాకేదో అనుమానంగా ఉందని చెప్తుంది. సార్ ఇంతక ముందులాగా మంచిగా లేదు మస్త్ మారినడు నీకు తెలియదు పెనివిటి అని అంటుంది. మారి నన్ను ఏం చేయగలదని ఆదిత్య అంటాడు. నువ్వేం దిగులు పడకు నా భార్య పిల్లల్ని కాపాడుకోలేకపోతే ఇంక ఆఫీసు గా జనాల్ని ఏం కాపాడతానని ఆదిత్య రుక్మిణికి ధైర్యం చెప్తాడు. నువ్వు మాధవ గురించి ఎక్కువ ఆలోచించకూ వాడు నన్నేం చేయలేదని అంటాడు. ఇక దేవిని ఆదిత్య తన ఇంటికి తీసుకుని వెళతాడు.