Devatha September 1st Update: మాధవ్ పని అయిపాయే- దొంగ తండ్రి గురించి నిజం తెలుసుకున్న దేవి
ఆదిత్యకి దేవిని శాశ్వతంగా దూరం చెయ్యాలని మాధవ్ కుట్ర పన్నుతాడు. కానీ దాని తిప్పికొట్టి ఆదిత్య షాక్ ఇస్తాడు.
దొంగ తండ్రి దేవి మనసు మార్చేందుకు మాయమాటలు చెప్తూ ఉంటాడు. నా బిడ్డ నాకు తల్లిలా సేవలు చేస్తుంటే నువ్వు నాదగ్గరే ఉండాలనే ఆశ పెరిగిపోతుందని అంటాడు. మీరిద్దరు కళ్ల ముందే ఉండాలి అందుకు నేనేం చెయ్యాలి అని అడుగుతాడు. 'రాధ నీ పెనిమిటి నీ బిడ్డ కోసం అంతా వెతుకుతూ ఉంటాడని తెలుసు కానీ దొరకదు కదా నాతోనే ఛాలెంజ్ చేసి నాకే వార్నింగ్ ఇస్తారా ఆవేశపడొద్దు నష్టపోతారని వంద సార్లు చెప్పాను వినలేదు ఇంక నష్టపోయేలా చేస్తాను' అని మాధవ్ అనుకుంటాడు. జానకి వచ్చి రాధ ఫోన్ చేసింది దేవి ఎంత వెతికినా కనిపించడం లేదని ఏడుస్తుందని చెప్తుంది. వస్తుందిలే ఎందుకు కంగారు పడతారు ఫ్రెండ్స్ ఇంటికి ఏమైనా వెళ్ళింది ఏమోలే అని మాధవ్ నిర్లక్ష్యంగా చెప్పేసరికి జానకి బిత్తరపోతుంది. బిడ్డ కనిపించడం లేదంటే కంగారు లేకుండా ఎలా ఉంటుందని చెప్తుంది. ఎక్కడ వెతికినా లేదని రాధ చెప్తుంది అని జానకి చెప్పినా మాధవ్ పట్టనట్టు వెళ్ళిపోతాడు.
దేవుడమ్మ ఇంటికి ఏమైనా వెళ్ళి ఉంటుందా అని జానకి ఆమెకి ఫోన్ చేస్తుంది. దేవి ఇంటికి ఏమైనా వచ్చిందా అని జానకి అడుగుతుంది. లేదని అనేసరికి దేవి కనిపించడం లేదని చెప్తుంది. ఆ మాటతో దేవుడమ్మ కూడా కంగారుగా ఎక్కడికి వెళ్ళిందని టెన్షన్ పడుతుంది. అది కనిపించగానే నాకు ఒక మాట చెప్పండి లేదంటే అది దొరికిందో లేదో అని కంగారుపడతాను అని చెప్తుంది. దేవుడమ్మ వచ్చి సత్యతో మాధవ్ వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా అని అడుగుతుంది. లేదు తన బిడ్డే కదా అని సత్య అంటే మరి ఎందుకు ప్రతిసారీ కనిపించకుండా పోవడం ఏంటి దేవుడమ్మ అనుమానపడుతుంది.
Also Read: యష్ ప్రాజెక్ట్ అభి చేతికి- స్కూల్ లో యష్ ని చూసి కోపంతో అలిగిన ఖుషి, వేద
దేవి ఉన్న దగ్గరకి ఆదిత్య, రుక్మిణి వస్తారు. వాళ్ళని చూసి మల్లికార్జున్ షాక్ అవుతాడు. కోపంగా వచ్చిన ఆదిత్య మల్లికార్జున్ ని పిచ్చ కొట్టుడు కొడతాడు. కొట్టకండి ఆఫీసర్ సారు అని దేవి బతిమలాడుతుంది. నిజం చెప్పు అని ఆదిత్య కొడుతూనే ఉంటాడు. నువ్వు దేవి తండ్రివా అలా చెప్పమని నీతో ఎవరు చెప్పారు అని ఆదిత్య కొడుతూ ఉంటాడు. ఎందుకు అబద్ధం చెప్తున్నావ్ పసిదాన్ని మోసం చేస్తున్నావ్, నీతో ఎవరు ఇలా చేయిస్తున్నారు చెప్పు అని కొడుతూనే ఉంటాడు. మాధవ్ సారు పేరు చెప్తే నన్ను ప్రాణాలతో ఉండనివ్వడు అని మనసులో అనుకుని నాకు ఎవ్వరూ చెప్పలేదు ఆ మాధవ్ సారు తండ్రి కాదని తెలిసి నేనే నాన్నలా దగ్గరై వల్ల దగ్గర డబ్బులు తీసుకోవచ్చని చెప్పి నేనే నాన్న అని చెప్పి ఆ బిడ్డకి దగ్గరయ్యాను అని మల్లికార్జున్ చెప్తాడు. డబ్బుకి ఆశపడి ఆ బిడ్డకి దగ్గరయ్యాను అని అంటాడు. ఆదిత్య కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాడు.
అది విన్న దేవి షాక్ అవుతుంది. ఏందమ్మా బిడ్డ వాడు మీ నాయన అంటే నా మాట వినకుండా వాడి చుట్టూ తిరిగావ్ అని రుక్మిణి అనేసరికి దేవి మరి మా నాయన ఎవరమ్మా అని అడుగుతుంది. అందుకే ఇసువంటి వాళ్ళు మా నాయన అంటే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నా అని అంటుంది. మీ నాయన ఎవరనేది ముందు ముందు నీకే తెలుస్తుందని రుక్మిణి అంటే నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుంది నిజం చెప్పి మా నాయన ఉన్నాడా పోయాడా అని దేవి కోపంగా అడుగుతుంది. ఆ మాటకి రుక్మిణి కోపంగా కొట్టేందుకు చెయ్యి ఎత్తుతుంది. మరి మా నాయన ఎవరో చెప్పు అని దేవి ఏడుస్తూ పదే పదే అడుగుతుంది. ఆదిత్య దేవికి మీ నాన్న నేనే అని నిజం చెప్పే లోపు కళ్ళు తిరిగి పడిపోతుంది.
Also Read: మాధవ్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆదిత్య-సూపరంటే సూపర్ అంతే
దేవుడమ్మ, సత్య దేవి కోసం కంగారు పడుతుంటే ఆదిత్య వచ్చి విషయం చెప్తాడు. దేవి కనిపించడం లేదంటే ఎంత బాధపడ్డానో ఎంత భయపడ్డాను అని కంగారు పడుతుంది. ‘మీ నాయన ఎవరో నీకు చెప్పలేక నిన్ను బాధపెడుతున్నా నీకు మీ నాయన ఎవరో చెప్తే నీకు మంచిగానే ఉంటుంది కానీ నాకే మస్త్ కష్టాలు ఉంటాయి. నువ్వు అడిగే ప్రశ్నలకి నాదగ్గర సమాధానం ఉండదు అందుకే చెప్పలేకపోతున్నా కానీ తొందరలోనే మీ నాయన ఎవరు అనేది చెప్తాను’ అని రుక్మిణి మనసులోనే బాధపడుతుంది.