అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today November 8th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: అరవింద మిస్సింగ్.. ప్రాణాలతో తిరిగి రాదని దేవయానితో చెప్పిన మనీషా!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode అరవింద కనిపించకుండా పోవడం మనీషా దేవయానితో అరవింద ఇక ఎప్పటికీ తిరిగి రాదని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode పోలీస్‌ స్టేషన్ నుంచి కాల్ రావడంతో మిత్ర, లక్ష్మీ, జయదేవ్‌లు పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. ఇక బయట అరవింద కారు ఉండటంతో హడావుడిగా లక్ష్మీ వాళ్లు పోలీసు దగ్గరకు వెళ్లి.. మా అత్తయ్య కారు ఉందేంటి అని అడుగుతుంది. దాంతో పోలీసులు అరవింద ఫోన్, వాచ్ లక్ష్మీ వాళ్లకి ఇచ్చి గుర్తు పట్టమని అంటారు. అవి మా అమ్మవే మీ దగ్గరకు ఎలా వచ్చాయ్ అని చెప్తాడు.

పోలీస్‌: హైవే పక్కన పెట్రోలింగ్‌ టైంలో ఈ కారు అందులో ఇది దొరికాయి. కారు నెంబరు ఆధారంగా మీకు ఫోన్ చేశాం.
జయదేవ్: రోడ్డు పక్కన కారు ఉండటం ఏంటి కారులో ఇవన్నీ వదిలేసి అరవింద కనిపించకపోవడం ఏంటి. 
లక్ష్మీ: ప్లీజ్ సార్ మా అత్తయ్య గారికి ఏమైంది.
పోలీస్: తెలీదమ్మా కంప్లైంట్ ఇవ్వండి మిస్సింగ్ కేసు పెడతాం. 

ఇక పోలీసులు అక్కడే ఉన్న డ్రైవర్‌ని చూపిస్తారు. అతనికే మీ అమ్మ లాస్ట్ కాల్ చేశారు అని చెప్తాడు. నా కోసం వెళ్లి అత్తయ్య గారు కనిపించకుండా పోయారని లక్ష్మీ అనుకుంటుంది. మిత్ర ఆ డ్రైవర్‌ని పట్టుకొని ప్రశ్నిస్తే అరవింద అసలు తనని కలవలేదని అబద్ధం చెప్తాడు. వాడికి మొత్తం తెలుసు నాలుగు తగిలించమని లక్ష్మీ అంటే పోలీసులు కొట్టొద్దని అంటారు. నిజం చెప్పమని మిత్రి గొంతు పట్టుకుంటాడు. ఇక మా మామ్‌కి ఏమైనా అయితే ఎవరినీ వదలనని చెప్తాడు. వివేక్‌కి కూడా విషయం తెలుస్తుంది. జాను పిల్లలకు కూడా అరవింద కనిపించడం లేదని తెలుస్తుంది. 

దేవయాని: అరవింద అక్కని ఏం చేశావ్ మనీషా. మర్యాదగా నిజం చెప్పు.
మనీషా: నాకు ఏం తెలీదు అయినా ఏంటి బెదిరిస్తున్నారు. నేను ఇక్కడే ఉన్నాను కదా.
దేవయాని: నువ్వు ఇక్కడే ఉండి ఎక్కడైనా చక్రం తిప్పగలవు అని నాకు తెలుసు. పైగా అక్క అడ్డు తొలగిస్తా అని చెప్పావ్.
మనీషా: నేను ఏం చేయలేదు. సరయు ఏం చేసిందేమో నాకు తెలీదు.
దేవయాని: మీరు ఇద్దరూ కలిసే ఏదో చేశారు నాకు తెలుసు కోరి కష్టాలు తెచ్చుకుంటున్నావ్ మనీషా.
మనీషా: నాకు కష్టాలు రావు ఆంటీ నాతో పెట్టుకున్న వాళ్లకే కష్టాలు వస్తాయి.

జయదేవ్ కారు చూసి ఎక్కడున్నావ్ అరవింద ఏమైపోయావ్ అని బాధ పడతాడు. ఇక స్వామీజీ శిష్యుడు ఆపద గురించి చెప్పిన మాటలు గుర్తు చేసుకొని బాధ పడతాడు. లక్ష్మీ, మిత్రలు జయదేవ్‌కి ధైర్యం చెప్తారు. జయదేవ్ ఏడుస్తాడు. ఇదంతా మనీషా పని అయింటుందని లక్ష్మీతో చెప్తాడు. మనీషానే కారణం అయితే మనీషా ప్రాణం తీసి అయినా అత్తయ్యని జాగ్రత్తగా తీసుకొస్తానని లక్ష్మీ అంటుంది. ఇక పిల్లలు ఆరు బయట బాధగా ఉంటే ఆంజనేయస్వామి వస్తారు. స్వామికి నానమ్మ కనిపించడం లేదని చెప్తారు. ఆంజనేయ స్వామికి సాయం అడుగుతారు. ఖర్మ ఫలితం అనుభవించాలని అంటాడు. ఇక పిల్లలు స్వామిని ఇంటికి పిలుస్తారు. నేను ఎవరికీ కనిపించకుండా ఇంట్లో వాళ్లికి సంతోషపెడతాను అని నా గురించి ఎవరికీ చెప్పొద్దని స్వామి చెప్పి పిల్లలతో బయల్దేరుతారు. 

అరవింద ఆంటీ ప్రాణాలతో రాదని అరవింద ఆంటీ గొంతు కూడా వినిపించడని మనీషా దేవయానితో చెప్తుంది. ఆంజనేయ స్వామి ఇంట్లో అడుగుపెట్టగానే మనీషా, దేవయానిలు తెలియని ఇబ్బంది ఫీలవుతారు. ఎవరో గుండెల మీద కాలు పెట్టినట్లుందని అనుకుంటారు. స్వామి నడుచుకుంటూ లక్ష్మీ దగ్గరకు వెళ్తారు. అక్కడ లక్ష్మీ పచ్చి మంచి నీరు కూడా తాగను అని ఏడుస్తుంది. ఇంతలో అక్కడే ఉన్న ల్యాండ్ లైన్‌కి ఫోన్ వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: కరెంట్ షాక్ కొట్టి కాకిలా అయిపోయిన భైరవి.. మైత్రి ఇక విమానం ఎక్కాల్సిందే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR In Lagcherla Attack: లగచర్ల దాడి ఘటనలో భారీ ట్విస్ట్- రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు, అవసరమైతే చంపేందుకు రెడీ!
లగచర్ల దాడి ఘటనలో భారీ ట్విస్ట్- రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు, అవసరమైతే చంపేందుకు రెడీ!
Jagan: సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్‌లో భారీ మార్పు చేయనున్న మెటా - గ్యాలరీ ఎంతలా మారిపోనుందంటే?
వాట్సాప్‌లో భారీ మార్పు చేయనున్న మెటా - గ్యాలరీ ఎంతలా మారిపోనుందంటే?
Tata Curvv: టాటా కర్వ్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!
టాటా కర్వ్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR In Lagcherla Attack: లగచర్ల దాడి ఘటనలో భారీ ట్విస్ట్- రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు, అవసరమైతే చంపేందుకు రెడీ!
లగచర్ల దాడి ఘటనలో భారీ ట్విస్ట్- రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు, అవసరమైతే చంపేందుకు రెడీ!
Jagan: సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్‌లో భారీ మార్పు చేయనున్న మెటా - గ్యాలరీ ఎంతలా మారిపోనుందంటే?
వాట్సాప్‌లో భారీ మార్పు చేయనున్న మెటా - గ్యాలరీ ఎంతలా మారిపోనుందంటే?
Tata Curvv: టాటా కర్వ్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!
టాటా కర్వ్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!
Pushpa 2: 'పుష్ప 2' ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్ ఇచ్చిన శ్రీవల్లి - డబ్బింగ్ స్టూడియోలో నేషనల్ క్రష్ రష్మిక
'పుష్ప 2' ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్ ఇచ్చిన శ్రీవల్లి - డబ్బింగ్ స్టూడియోలో నేషనల్ క్రష్ రష్మిక
The Rana Daggubati Show: 'ది రానా దగ్గుబాటి షో' ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ - ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చ అంటే?
'ది రానా దగ్గుబాటి షో' ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ - ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చ అంటే?
Vizag Crime News: విశాఖలో పట్టపగలే దారుణం, ఇంట్లోకి ప్రవేశించి మహిళపై హత్యాయత్నం! ట్విస్ట్ ఏంటంటే
విశాఖలో పట్టపగలే దారుణం, ఇంట్లోకి ప్రవేశించి మహిళపై హత్యాయత్నం! ట్విస్ట్ ఏంటంటే
Patnam Narendar Reddy: లగచర్ల దాడి కేసు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్
లగచర్ల దాడి కేసు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్
Embed widget