అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today December 23rd: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మనీషా పార్టీలో చేరిన జాను.. అక్క, బావల మీద తిరుగుబాటు.. ఫ్యామిలీ విడిపోవడం ఖాయం!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode వివేక్‌ని పనోడిలా బానిసలా చూస్తున్నారని జాను తన అక్క లక్ష్మీ బావ మిత్రల మీద ఫైర్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ, మిత్రలు ఆఫీస్‌కి టైం అయిపోయిందని చెప్పడంతో తింటున్న వివేక్ లేచి పరుగులు పెడతాడు. దేవయాని కొడుకుని సరిగ్గా తిండి కూడా తిననివ్వడం లేదని బాధ పడుతుంది. మనీషా జానుని రెచ్చగొడుతుంది. ఇక మనసు బాగుంటుందని చెప్పి బయటకు తీసుకెళ్తుంది. మనీషా జానుని తన ఫ్రెండ్స్ దగ్గరకు తీసుకెళ్తుంది. అక్కడ అందరూ కిట్టీ పార్టీ చేసుకుంటారు. బెట్టింగ్ గేమ్ ఆడుతారు. జాను దగ్గర డబ్బు లేదని చెప్పడంతో మీ అక్కా, బావలు నిన్ను నీ భర్తని పని వాళ్లలా చూస్తున్నారని మనీషా ఫ్రెండ్స్ అంటారు.

జాను లక్ష్మీకి కాల్ చేసి లక్ష డబ్బు కావాలని అడుగుతుంది. ఎందుకని లక్ష్మీ అడిగితే కిట్టీ పార్టీలో ఉన్నానని చెప్తుంది. లక్ష్మీ తిట్టేసి ఫోన్ పెట్టేస్తుంది. జాను ఇంకా రగిలిపోతుంది. ఇదే టైం అనుకొని మనీషా జానుని బాగా రెచ్చగొడుతుంది. ఇక దీక్షితులు గారి దగ్గరకు వెళ్లిన జయదేవ్‌తో మీ ఫ్యామిలీ మొత్తానికి గండం ఉందని విడిపోయే ప్రమాదం ఉందని జాగ్రత్త పడండి అని చెప్తారు. ఇక లక్ష్మీ వాళ్లకి ప్రాజెక్ట్ వస్తుంది. ఆ సంతోషంలో లక్ష్మీ స్టాఫ్ మొత్తానికి బోనస్ ప్రకటించేస్తుంది. మిత్ర లక్ష్మీ దగ్గరకు వెళ్లి అంతా నీ ఇష్టమేనా నా నిర్ణయం తీసుకోవా ఆఫీస్‌లో నా స్థానం ఏంటి అని లక్ష్మీని అడుగుతాడు. ఎగ్జైట్ మెంట్‌లో చెప్పేశానని లక్ష్మీ మిత్రకు సారీ చెప్తే మిత్ర నవ్వి క్లాప్స్ కొట్టి మంచి పని చేశావ్ అని లక్ష్మీని హగ్ చేసుకుంటాడు. లక్ష్మీ షాక్ అయిపోయి చాలా సంతోషిస్తుంది. మిత్ర లక్ష్మీకి కంగ్రాట్స్ చెప్తాడు.  

జయదేవ్ ఢీలా పడి ఇంటికి వస్తాడు. జాను గురించి అడిగితే మనీషాతో వెళ్లిందని దేవయాని చెప్తుంది. దాంతో జయదేవ్ కంగారు పడతాడు. జాను ఎందుకు మనీషాతో వెళ్లిందని అనుకుంటాడు. ఇక వివేక్, లక్ష్మీ, మిత్ర వాళ్లు వస్తూ పార్టీ ఇవ్వాలని అనుకుంటారు. ఇక మిత్ర, వివేక్ ఇద్దరూ లక్ష్మీని ఛైర్మన్ అని లక్ష్మీని ఆటపట్టిస్తారు. జాను ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తుందని వివేక్ గొప్పగా చెప్తాడు. కానీ జాను మనసు మాత్రం మనీషా మార్చేస్తుంది. మీ అక్క సక్సెస్ అయింది కానీ నువ్వు కాలేదని నీకు కనీసం లక్ష కూడా  ఇవ్వలేదని అంటాడు. ఇక మిత్ర వివేక్‌తో చెల్లి అంటే అలా ఉండాలిరా నువ్వు నా గురించి ఒక్క రోజైనా అలా మాట్లాడావా నాకు సపోర్ట్ చేశావా నీ సపోర్ట్ ఎప్పుడూ మీ వదినకే అంటాడు. ఇక వివేక్‌ వాళ్ల కారు టైర్ పంక్చర్ అవుతుంది.

వివేక్ క్యాబ్ బుక్ చేసి లక్ష్మీ, మిత్రలను పంపేసి వివేక్ కారు టైరు మార్పించి వస్తానంటాడు. లక్ష్మీ వాళ్లు ఇంటికి బయల్దేరుతారు. ఇక అటుగా వస్తున్న మనీషా, జానులు వివేక్ రోడ్డు మీద కారు టైరు మార్చడం  చూస్తారు. కారు ఆపి వివేక్‌కి ఏమైందని అడుగుతారు. అక్కా బావ ఏరి అని జాను అడిగితే క్యాబ్‌లో వెళ్లారని చెప్తాడు. జాను చాలా ఫీలయి అది వదిలేసి వచ్చి కారు ఎక్కమని చెప్తుంది. బలవంతంగా వివేక్‌ని తీసుకొని వెళ్లిపోతుంది. లక్ష్మీ, మిత్రలు ఇంటికి వస్తే దేవయాని వివేక్ గురించి అడుగుతుంది. వివేక్‌ పొద్దున్న కూడా మీ కంగారు వల్ల తినకుండా వచ్చేశాడు ఇప్పుడు మీరే వచ్చారు వివేక్ ఎక్కడా అని అడుగుతుంది. దాంతో లక్ష్మీ కారు రిపేర్ అయితే మేం క్యాబ్లో వచ్చేశాం వివేక్ రిపేర్ చేయించడానికి అక్కడే ఆగిపోయాడని చెప్తుంది. దాంతో దేవయాని షాక్ అయిపోతుంది. 

దేవయాని: ఓ వాడిని రోడ్డు మీద వదిలేసి మీరు ఎంత చక్కగా వచ్చేశారన్నమాట. 
మిత్ర: వాడిని రమ్మని చెప్పాం పిన్ని వాడే రాలేదు.
దేవయాని: వాడేంటి వాడు వాడికో పేరు లేదా వాడేమైనా మీ డ్రైవర్ అనుకున్నారా. వాడు వరసకు నీకు తమ్ముడు కావొచ్చు కానీ వాడికి ఈ ఇంట్లో కంపెనీలో నీతో పాటు సమాన వాటా ఉంది.  
మిత్ర: ఇంత చిన్న విషయానికి ఎందుకు అంత గొడవ పిన్ని.
దేవయాని: ఇది చిన్న విషయమా వాడి స్థానంలో నువ్వు ఉంటే అర్థమయ్యేది వాడిని పనోడిలా వాడుకుంటున్నారు. కూలోడి కంటే హీనంగా చూస్తున్నారు. మీరు ఒక డ్రైవర్‌ని పెట్టుకోవచ్చు కదా వాడిని ఎందుకు డ్రైవర్‌గా వాడేస్తున్నారు. మీరు పిలవడంతో వాడు పెంపుడు కుక్కలా మారుతున్నాడు. నువ్వైనా డ్రైవ్ చేయొచ్చు కదా మిత్ర. ప్రతీ సారి వివేక్‌తో ఎందుకు పని చేయిస్తున్నారు. వాడిని ఎందుకు జీతం లేని పనోడిలా చూస్తున్నారు.


జయదేవ్: దేవయాని ఏంటి ఆ మాటలు వాళ్లిద్దరూ అన్నదమ్ములు వాళ్ల మధ్య ఎలాంటి తారతమ్యాలు లేవు. 
దేవయాని: అని మీరు అనుకుంటే సరిపోదు బావగారు మిత్ర, లక్ష్మీ అనుకోవాలి సరైన గౌరవం ఇవ్వాలి.
లక్ష్మీ: వివేక్‌ని జీతం లేని పనోడిలా కాదు జీవితాంతం తోడుండే లక్ష్మణుడిలా మిత్ర గారు చూసుకుంటున్నారు. 
దేవయాని: అవును వాడు మీ కోసం బానిసలా గొడ్డు చాకిరి చేస్తున్నాడు.
జయదేవ్: ఏం మాట్లాడుతున్నావ్ దేవయాని ఈ మాటలు జాను వింటే బాధ పడదా.
దేవయాని: బాధ పడటానికి అది ఇంట్లో ఉంటే కదా. నా కొడుకుని నేను తప్ప ఇక్కడ ఇంకెవరూ పట్టించుకోవడం లేదు.
లక్ష్మీ: మీరు ఏదేదో మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నారు చిన్నత్తయ్య గారు మీ ఉద్దేశం ఏంటో చెప్పండి.
జాను: చెప్పాల్సింది నువ్వు అక్క. ముందు నీ ఉద్దేశం ఏంటో బావగారి ఉద్దేశం ఏంటో చెప్పు అక్క. 
వివేక్: జాను జాను.
జాను: మీ ఇద్దరూ మా ఆయన గురించి ఏమనుకుంటున్నారు ఆయన మీకు పనోడా. డ్రైవరా.. పీఏనా పనోడా లేక బానిసనా. ఆయన్ను మీరు ఏ రకంగా చూస్తున్నారు. 
వివేక్: జాను అసలు నువ్వేం మాట్లాడుతున్నావ్.
దేవయాని: తను కరెక్ట్ గానే మాట్లాడుతుందిరా మీ చెల్లి అడుగుతుంది సమాధానం చెప్పు లక్ష్మీ. 
జాను: నేను నీకు చెల్లినే కావొచ్చు అక్క ఆయన బావగారికి తమ్ముడే కావొచ్చు కానీ ఎవరి స్థాయి వాళ్లకి ఉంటుంది. ఆ గుర్తింపు ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు.
వివేక్: జాను ఇక చాలు. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: పట్నం చేరుకున్న త్రినేత్రి బామ్మ.. ఇంట్లో రచ్చ చేస్తున్న వల్లభ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, నిందితులకు బెయిల్
Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, నిందితులకు బెయిల్
Congress vs Tollywood: సినీ ఇండస్టీని కాంగ్రెస్  ప్రభుత్వం టార్గెట్ చేసిందా ? సినీ పెద్దలపై ఎందుకంత పగ?
సినీ ఇండస్టీని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందా ? సినీ పెద్దలపై ఎందుకంత పగ?
AP Belt Shops: గ్రామాల్లో బెల్ట్‌ బాజా, గోదావరి జిల్లాల్లో ఎటు చూసినా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
గ్రామాల్లో బెల్ట్‌ బాజా, గోదావరి జిల్లాల్లో ఎటు చూసినా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
Hyderabad CP CV Anand: సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, నిందితులకు బెయిల్
Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, నిందితులకు బెయిల్
Congress vs Tollywood: సినీ ఇండస్టీని కాంగ్రెస్  ప్రభుత్వం టార్గెట్ చేసిందా ? సినీ పెద్దలపై ఎందుకంత పగ?
సినీ ఇండస్టీని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందా ? సినీ పెద్దలపై ఎందుకంత పగ?
AP Belt Shops: గ్రామాల్లో బెల్ట్‌ బాజా, గోదావరి జిల్లాల్లో ఎటు చూసినా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
గ్రామాల్లో బెల్ట్‌ బాజా, గోదావరి జిల్లాల్లో ఎటు చూసినా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
Hyderabad CP CV Anand: సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
PV Sindhu Wedding: ఘనంగా పీవీ సింధు వివాహం, ఉదయ్‌పూర్‌లో వెంకట దత్తసాయితో ఏడడుగులు వేసిన స్టార్ షట్లర్
ఘనంగా పీవీ సింధు వివాహం, ఉదయ్‌పూర్‌లో వెంకట దత్తసాయితో ఏడడుగులు వేసిన స్టార్ షట్లర్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Weather Update Today: ఏపీలో 4 రోజులు భారీ వర్షాలతో అలర్ట్, మత్స్యకారులకు వార్నింగ్- తెలంగాణపై నో ఎఫెక్ట్
ఏపీలో 4 రోజులు భారీ వర్షాలతో అలర్ట్, మత్స్యకారులకు వార్నింగ్- తెలంగాణపై నో ఎఫెక్ట్
Embed widget