Chinni Serial Today November 19th: చిన్ని సీరియల్: చందుకి నిజం తెలిసిపోయిందా! లోహితకు మధు వార్నింగ్! మ్యాడీకి గుడ్‌న్యూస్!
Chinni Serial Today Episode November 19th మధుకి చందు బట్టలు పెట్టడం లోహితకు మధు వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ మధుని ఓ చోట కలిసి చిన్ని గురించి వెళ్లావా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు నాకు కాల్ చేశావా.. నాతో మాట్లాడావా అని అంటాడు. చిన్ని గురించి ఏం చెప్పలేదు అనా కోపం అని మధు అంటే అలా కాదు ఉదయం నుంచి నువ్వు బయటకు వెళ్లావ్ కదా కనీసం మాట్లాడలేదు అని టెన్షన్‌గా ఉండదా అని మ్యాడీ అంటాడు.
మధు మ్యాడీతో కోపంగా ఉన్నావ్ కదా చల్ల చల్లని ఐస్‌క్రీం తీసుకొచ్చి కూల్ చేస్తా అని రెండు ఐస్‌క్రీంలు తెచ్చి ఇస్తుంది. వెళ్లిన చోట చిన్ని వివరాలు దొరకలేదు అని కానీ చిన్ని మీద నీకు ఉన్న ప్రేమే మీ ఇద్దరినీ కచ్చితంగా కలుపుతుందిఅని మధు అంటుంది. నువ్వు నీ చిన్ని కలిసి ఇలాగే ఐస్‌క్రీం తిందురులే అని అంటుంది. నిన్ను కూడా పిలుస్తాలే అని మ్యాడీ అంటాడు.
చందు కొత్త బట్టలు పట్టుకుంటే ఏంట్రా అది అని సరళ అంటే ప్రతీ సంవత్సరం నాన్న ఆబ్దికం రోజు చిన్నికి గుర్తుగా చిన్ని వయసు ఉన్న వారికి బట్టలు ఇవ్వడం నాకు అలవాటు కదా.. నిన్న ఇవ్వాలి అని గుడి దగ్గరకు వెళ్లాను ఎవరూ లేరు అందుకే ఈ రోజు వెళ్తున్నా అంటాడు. మీ నాన్న చెల్లి, మేనకోడలు అని చనిపోయాడు.. ఇప్పుడు నువ్వు ఇలా తయారయ్యావు అని అంటుంది. నాన్నని ఎలా గుర్తు చేసుకుంటానో చిన్నిని అలాగే గుర్తు చేసుకుంటా అని అంటాడు.
మధు అక్కడికి వస్తుంది. ఎక్కడికో వెళ్తున్నారు సార్ అని అంటే దానికి సరళ వాడికి ప్రతీ సంవత్సరం చిన్నికి గుర్తుగా బట్టలు ఇవ్వడం అలవాటు ఇవ్వడానికి వెళ్తున్నాడు అని అంటుంది. మధు చాలా సరదా పడుతుంది. ఇక సరళ ఎవరికో ఎందుకురా ఈ అమ్మాయికే ఇచ్చేయ్ అంటుంది. తను ఫీలవుతుంది అమ్మా అని చందు అంటే లేదు మాస్టారు నేను మీ చిన్ని అనుకొని నాకు ఆ బట్టలు ఇచ్చేయండి అని అంటుంది. చందు సంతోషంగా మధుకే బట్టలు ఇస్తాడు.లోహిత చూసి ఇదేంటి అప్పుడే ఇంటికి వస్తూ బట్టలు తీసుకుంటుంది.. ముందు ముందు ఈ మహాతల్లి ఇంకేం చేస్తుందో అని అనుకుంటుంది.
లోహిత కోపంగా చూడటం చందు చూసి ఏంటి అలా చూస్తున్నావ్.. అని అంటాడు. ఇక మధు చందుకి థ్యాంక్స్ చెప్తుంది. నాతో ఏంటి పని అని చందు అడిగితే ఏఐ మాస్టారు నీకు ఫ్రెండ్ కదా ఆయనకు చెప్పి నాకు ఏమైనా టిప్స్ చెప్పిస్తారా అని అడుగుతుంది. నేను మాట్లాడుతానులే అని చందు అంటాడు. మధు వెళ్లిపోయిన తర్వాత లోహితకు చందు పీజీ అడ్రస్ అడుగుతాడు. ఏం అవసరం లేదు నేనే వస్తా అని లోహిత తనని ఇబ్బంది పెట్టొద్దు అని వెళ్లిపోతుంది.
మధు బయట ఉంటే లోహిత వెళ్లి ఏంటే కళ్లు ఎగరేస్తున్నావ్ అని అడుగుతుంది. నువ్వు ఊహించని ట్విస్ట్ ఇస్తా అని మధు అంటుంది. నేను చాలా లక్కీ లోహి.. మీ గురించి ఎంత తెలుసుకోవాలని ప్రయత్నించినా మీరే నాకు ఎదురయ్యారు.. ఇక నా చిన్ని నాటి ఫ్రెండ్ నా మహి నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. త్వరలోనే నేనే చిన్ని అని చెప్పేస్తా అప్పుడు మ్యాడీ కూడా హ్యాపీ అని అంటుంది. నువ్వు కూడా నీ తప్పులు నాగవల్లి ఆంటీకి చెప్పేయ్.. ఇప్పటి వరకు నీకు పెళ్లి చేశా అని నిజం చెప్పాలి అనుకున్నా.. కానీ ఇప్పుడు నువ్వు నా మేనమామ కూతురివి ఇప్పుడు నేనే నీ గురించి చెప్పేస్తా,, అయినా నువ్వు రిచ్ అని చెప్పి పెద్ద గొయ్యి తవ్వుకున్నావ్.. అందులో పడిపోకముందే నిజం చెప్పే లేదంటే కుప్పకూలిపోతావ్ అంటుంది. పరిస్థితులు చేజారిన తర్వాత నువ్వు కాళ్ల బేరానికి వచ్చినా నేను నిన్ను కాపాడలేను గుర్తు పెట్టుకో అని మధు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.
మ్యాడీ ఓ చోట ఉంటే మధు అక్కడికి వెళ్తుంది. మధుతో మ్యాడీ చిన్ని నా చుట్టూ ఉన్నట్లు అనిపిస్తుంది కానీ వెతకలేకపోతున్నా అని బాధ పడతాడు. ఇక ఇంతలో అక్కడికి సోదమ్మ వస్తుంది. మ్యాడీ ఆవిడతో సోది చెప్పమని అంటాడు. నువ్వు వెతుకుతున్న కూన నీ దగ్గరే ఉంది.. నీ చుట్టూ తిరుగుతుంది.. నీతో దోబూచులాడుతుంది.. అని మధుని చూసి చెప్తుంది. నా చిన్ని ఎక్కడ ఉంది అని మ్యాడీ ఎగ్జైట్ అవుతాడు. త్వరలోనే తను ఎవరో నీకు తెలుస్తుంది.. తనే నీ ముందుకి వచ్చి నేనే చిన్ని అని చెప్తుందని మ్యాడీతో చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















