Chinni Serial Today January 15th: చిన్ని సీరియల్: హల్వా.. మల్లెపూలతో మధు మ్యాడీని మార్చేస్తుందా! నాగవల్లి ప్లానేంటి!
Chinni Serial Today Episode January 15th మధు మల్లెపూలు పెట్టుకొని మ్యాడీని ఆటపట్టించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode దేవా బాలరాజు దగ్గరకు వెళ్లి మందు సిట్టింగ్ ఏర్పాటు చేస్తారు. బాలరాజు మందు ముందే తాగేస్తాడు.ఏంటి అలా తాగేశావ్ అని దేవా అడిగితే సంతోషంతో తాగేశా.. నీ బాధ నాకు సంతోషం.. నీ కొడుకు నీ మేనకోడలిని కాదని వేరే ఎవరినో పెళ్లి చేసుకున్నాడు కదా.. అందుకే నీ బాధే నా సంతోషం అని అంటాడు.
దేవా బాలతో పారాణి ఆరకముందే ఆ కోడల్ని పాడెక్కిస్తా.. నా మేనకోడల్ని కోడల్ని చేసుకుంటా.. అని అంటాడు. మనుషుల ప్రాణం అంటే నీకు లెక్క లేదు కదరా.. చేసిన దానికి ఖర్మ అనుభవిస్తావ్ అని బాలరాజు అంటాడు. ఎవరు తప్పించుకున్నా నీ కూతురు మాత్రం నా నుంచి తప్పించుకోలేదు.. వెతికి వెతికి తనని చంపేస్తా అని చెప్తాడు. బాలరాజు చాలా టెన్షన్ పడతాడు. కూతుర్ని చంపి ఆ వార్త నీకు చెప్తా రెడీగా ఉండు అని అంటాడు.
మధు మల్లెపూలు పెట్టుకొని రెడీ అయి గది మొత్తం క్యాండిల్ లైట్స్ ఏర్పాటు చేసి అగర్బర్తీలు పెడుతుంది. గది మొత్తం ఈ పొగ ఏంటి అని మ్యాడీ అడిగితే రమ్మనిచెప్పే పొగ ఇది అని అంటుంది. హల్వా కూడా మ్యాడీ చూసి ఇది ఎందుకు అని అడుగుతాడు. పెద్దావిడ ఏంచెప్పిందో గుర్తు చేసుకో అని అంటుంది. మ్యాడీ గుర్తు చేసుకొని మధుకి దగ్గరకు వెళ్తాడు. దగ్గరకు రావొద్దు రావొద్దు అనుకుంటూ మధు దగ్గరకు వెళ్తాడు. మ్యాడీ ఎప్పుడూ చలించడు అని చెప్పి వెళ్తాడు. నీతో చాలా జాగ్రత్తగా ఉండాలే అని మధుని అంటాడు. మధు కొంటెగా చూస్తే ఏంటే అలా చూస్తావ్ అని అంటాడు. ఇక వెళ్తూ వెళ్తూ మ్యాడీ పడిపోతే మధు పట్టుకుంటుంది. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు. తర్వాత మధు మ్యాడీకి కింద వదిలేస్తుంది. మ్యాడీ నడుం పట్టేస్తుంది. అయినా సరే మధు సాయం తీసుకోకుండా బయటకు వెళ్లిపోతాడు.
దేవా, నాగవల్లి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు చేరుకుంటారు. మధు జడనిండా మెల్లెపూలు పెట్టుకొని నవ్వుతూ అక్కడే ఉండటం చూసి వసంత, శ్రేయ వెళ్లిపోతుంటే నాగవల్లి ఆపి కొత్త కోడలు చేసిన వంట రుచి చూడకుండా వెళ్లిపోతారా ఉండమని అంటుంది. వసంత, శ్రేయ వద్దని వెళ్తుంటే మధు మ్యాడీతో ఏంటి మ్యాడీ మీ అమ్మ శివగామి తన మాటే శాసనం అని చెప్పావ్ మరి ఇలా వెళ్లిపోతున్నారు అని అంటుంది. దాంతో వసంత, శ్రేయ కవర్ చేసి కావాలనే ఇలా బిల్డప్ ఇచ్చాం.. నీ కోసం కాదు కదా ఆ దేవుడి కోసం కూడా వదిన మాట దాటం.. వదిన మాటే మాకు శాసనం అని కూర్చొంటారు.
మధు అందరికీ వడ్డిస్తుంది. మధు వంటలు అందరూ బాగున్నాయని అంటారు. ఇక మధు లోహిత దగ్గరకు వెళ్లి లోహి నీకు ఈ కర్రీ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం కదా వేయనా అంటే దానికి నాగవల్లి వాళ్లు షాక్ అయి నీకు లోహి చిన్నప్పటి నుంచి తెలుసా అని అడుగుతుంది. లోహిత తనకు మధు తెలీదు అని అంటుంది. దానికి మధు క్యాంటీన్‌లో చెప్పిందని అంటుంది. మ్యాడీ తినకుండా చేయి కడిగేస్తే ఏమైందని అందరూ అడిగితే మధు ఇలాగే ఇందాక బయటకు వెళ్తే పచ్చిమిర్చి బజ్జీ తినిపించింది కడుపు బాలేదు అని అబద్ధం చెప్తాడు.
నాగవల్లి మధులో ఇలా రోజు ఏదో ఒక కారణంతో వాడు నీ మీద అప్‌సెట్ అవుతూనే ఉంటాడు. ఇలాగే నిన్ను తన జీవితం నుంచి గెంటేస్తాడు అని అంటుంది. ఎప్పటికైనా నేను మ్యాడీ దగ్గరవ్వడమే జరుగుతుంది అని అంటుంది. మధు గదిలోకి వెళ్లి కడుపు నొప్పి అని అంటుంది. ఏమైందని మ్యాడీ అడిగితే పాతిక మిరపకాయ బజ్జీలు తిన్నా కదా అందుకే ఇలా అంటుంది. మ్యాడీ ఆకలి అని అనడంతో హల్వా తినమని మధు అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















