అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today January 14th: సింధూజాక్షి, గోపికి ఫస్ట్‌నైట్‌ జరిగిందా...? ఇంట్లో నుంచి పారిపోవడానికి సింధూ మ్యాడీని ఎలా బ్లాక్‌మెయిల్‌ చేసింది ?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode January 14th: సింధూజాక్షి, గోపికి ఫస్ట్‌నైట్‌ జరిగిందా...? ఇంట్లో నుంచి పారిపోవడానికి సింధూ మ్యాడీని ఎలా బ్లాక్‌మెయిల్‌ చేసింది ?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: కొత్త కోడల్ని దీపం వెలిగించమని  గోపి వాళ్ల అమ్మ చెప్పగా....దేవుడి దగ్గర దీపం వెలిగించి  వెంటనే ఊది ఆర్పేస్తుంది. శ్రీలక్ష్మీ కలగజేసుకుని  ఏంటి ఇలా చేశావంటే  బర్త్‌డేకు ఇలాగే దీపం వెలిగించి  ఆర్పేస్తాం కదా అని అంటుంది. ఇలా చేయకూడదని చెబుతుంది. తనకు సంప్రదాయాలు పెద్దగా తెలియదు సారీ అని సింధూజాక్షి నాటకం ఆడుతుంది.  సర్లే మళ్లీ వెలిగించమని అత్తగారు చెబితే....దీపం కిందపడేస్తుంది.  దీంతో గోపీ వాళ్ల అమ్మకు  కోపం వస్తుంది.

గుమ్మంలో భర్త పేరు చెప్పి వచ్చావని....కుడి కాలు పెట్టమంటే  ఎడమకాలు పెట్టి వచ్చావని...ధాన్యం గిన్నె నెట్టమంటే గట్టిగా తన్ని వచ్చావని ప్రతీది కావాలనే చేస్తున్నావని గట్టిగా  మందలిస్తుంది.  ఈ తాతయ్యకు సంప్రదాయాలన్నా, ఆచారాలన్నా ఎంతో  గౌరవమని...అలాంటిది  ఇవన్నీ నీకు చెప్పుకుండానే  పెంచాడా అని నిలదీస్తుంది.  నీ వ్యవహారం  అంతా  తేడా తేడాగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీనికి సింధూజాక్షి కూడా గట్టిగానే ఆమెకు సమాధానం చెబుతుంది. దీపం పొరపాటున కిందపడిపోతే ఇంత రాద్ధాంతం చేస్తున్నారని మండిపడుతుంది.
                   

వెంటనే కలుగుజేసుకున్న గోపీ...మాఅమ్మకే కాదు నువ్వు చేస్తున్న పనులు నాకు కూడా  ఆశ్చర్యం కలిగిస్తున్నాయని అంటాడు. పెద్దాయన పెంపకంలో పెరిగిన నీవు ఇలా ప్రవర్తిస్తావని ఎవరూ అనుకోరు కదా అంటాడు.  మా అమ్మ నిన్ను అర్థం చేసుకోలేదని....ఆమె అర్థం చేసుకునేందుకు  కొంత సమయం పడుతుందని అంటాడు. వాళ్లంటే చదువుకోలేదని నీవు చదువుకున్నదానివే కదా...నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటని అంటాడు. ఇంతలో  శ్రీలక్ష్మీ కలుగజేసుకుని సర్దిచెబుతుంది. ఫస్ట్‌నైట్‌కు ముహూర్తం పెట్టారు కదా అన్ని సర్దుకుంటాయిలే అని చెబుతుంది. దీంతో సింధూ ఏడుస్తూ  తన రూమ్‌లోకి వెళ్లిపోతుంది. మ్యాడీ కూడా ఆమె వెంటే వెళతాడు. శ్రీలక్ష్మీ వాళ్ల అన్నకు క్లాస్‌ పీకుతుంది. పట్నం నుంచి వచ్చిన అమ్మాయికి పల్లెలో ఎలా ఉండాలో ఎలా తెలుస్తుందని నీవు వదినతో అలాగేనా మాట్లాడేదని కోప్పడుతుంది. తనకు  అర్థమయ్యేలా  వివరించి చెప్పి నీకు నచ్చినట్లు మలుచుకోవాలని అంటుంది.

అటు మ్యాడీ కూడా వాళ్ల అక్కకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. పెళ్లికానంత వరకు నిన్ను ఎలాగైనా  ఇక్కడ నుంచి తప్పించాలనుకున్నాను కానీ...ఇప్పుడు పెళ్లి అయిపోయింది కాబట్టి ఏం చేయలేకపోతున్నానని అంటాడు. వాడి మాటాల్లో తేడా గమనించి  సింధూ నాటకం మొదలుపెడుతుంది. ఇది అసలు తాళి కాదని నా మెడకు బిగించిన ఉరితాడు అని అంటుంది. ఇంట్లో  అడుగుపెట్టగానే మా అత్త పెత్తనం మొదలుపెట్టిందని....గోపీ కూడా నాకు సపోర్ట్‌గా లేడని అంటుంది. ఈ పల్లెటూరు వాడితో కాపురం చేయలేనని....తాతయ్య కోసం తలవంచి తాళి కట్టించుకున్నానని అంటుంది. తనను వీలైనంత త్వరగా ఈ నరకం నుంచి బయటపడేయాలని కోరుతుంది.

ఈరోజే ఇక్కడ నుంచి నన్ను పంపించేయాలని అడుగుతుంది. దీనికి మ్యాడీ కుదరదని  అంటాడు. అయితే నేను చచ్చిపోతానని సింధూ బెదిరిస్తుంది.  దీంతో మ్యాడీ  సరేనంటాడు. వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుండగా శ్రీలక్ష్మీ అక్కడికి వస్తుంది. మా వదిన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లడానికి ఇంకా పిచ్చిపిచ్చి ప్రయత్నాలు చేస్తుంటే మానుకోవాలని మ్యాడీకి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ రోజు రాత్రికే నిన్ను ఇక్కడి నుంచి పంపించేస్తానని మ్యాడీ వాళ్ల అక్కకు మాటిస్తాడు.

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today July 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీ, మదన్ మధ్య గొడవ – శశికి పడిపోయిన ఐషు
‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీ, మదన్ మధ్య గొడవ – శశికి పడిపోయిన ఐషు
Nuvvu leka Neanu Lenu Serial Today July 28th:హాల్‌లో చాపమీద పడుకున్న విక్కీ....తిట్టి రాధ గదిలోకి పంపించిన సునంద
నువ్వులేక నేను లేను: హాల్‌లో చాపమీద పడుకున్న విక్కీ....తిట్టి రాధ గదిలోకి పంపించిన సునంద
Illu Illalu Pillalu Serial Today July 28th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమ సీక్రెట్‌ అందరి ముందు బట్టబయలు! ఒక్క చెంప దెబ్బతో ట్విస్ట్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమ సీక్రెట్‌ అందరి ముందు బట్టబయలు! ఒక్క చెంప దెబ్బతో ట్విస్ట్!
Gundeninda Gudigantalu July28th Episode: రోహిణిపై అనుమానంతో అత్తింటికి వచ్చిన మనోజ్‌...అక్కడ ఏం చూశాడు...?.
గుండెనిండా గుడిగంటలు: రోహిణిపై అనుమానంతో అత్తింటికి వచ్చిన మనోజ్‌...అక్కడ ఏం చూశాడు...?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Embed widget