Chinni Serial Today December 31st: చిన్ని సీరియల్: గుడిలో మధు, మ్యాడీ ఏం చేస్తున్నారు? మధుని తన లైఫ్‌లో ఉండిపోమన్న మ్యాడీ! శ్రేయతో పెళ్లి క్యాన్సిలేనా!
Chinni Serial Today Episode December 31st మ్యాడీ మధు కోసం వెతికి గుడిలో మధుని చూసి కాపాడి ఇద్దరూ రాత్రంతా గుడిలో ఉండటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు కనిపించడం లేదని మ్యాడీ మళ్లీ వెనక్కి వెళ్లాడని లోహిత వాళ్లు నాగవల్లి, దేవాలకు చెప్పడంతో ఆ మధు కోసం వెనక్కి వెళ్తాడా అని కోప్పడతారు. శ్రేయ కంటే తనకు తన ఫ్రెండే ఎక్కువ అని లోహిత అంటుంది. నాగవల్లి మ్యాడీకి కాల్ చేస్తే సిగ్నల్ ఉండక ఫోన్ కలవదు.. ఇద్దరూ గుడిలో ఇరుక్కుపోయింటారని వసంతి అంటుంది.
నాగవల్లి పూజారికి కాల్ చేస్తుంది. గుడిలో ఇరుక్కుపోయాడని అనుమానంగా ఉందని ఒకసారి చూసి చెప్పండి అని అంటుంది. దాంతో పంతులు గుడిలో ఎవరూ లేరని అంతా చెక్ చేసే తలుపులు వేశామని చెప్తారు. మ్యాడీ మధు కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక గదిలో మధుని చూస్తాడు. తాళం వేసి ఉండటం చూసి తాళం పగలగొట్టి మధు దగ్గరకు వెళ్తాడు. మధుని లేపి ఎవరు నిన్ను ఇక్కడ బంధించారు అని అడుగుతుంది. ఏమో తెలీదు అని మధు చెప్తుంది. నిన్ను గదిలో బంధించాల్సిన అవసరం ఎవరికి ఉంది అని మ్యాడీ అడుగుతాడు. ఏం తెలీదు అని మధు కంగారు పడుతుంది.
మధు ఫోన్ కూడా కనిపించకపోవడంతో మ్యాడీ మా డాడీకి కాల్ చేస్తా పంతులుకి చెప్పి మెయిన్ డోర్ తీయిస్తారు అని అంటాడు. తీరా చూస్తే ఫోన్ కలవదు. డోర్స్ కొడదామని ఇద్దరూ వెళ్తారు. మధు తల్లిదండ్రులు కూడా కంగారు పడుతూ ఉంటారు. మ్యాడీ ఇంట్లో కూడా కంగారు పడుతూ ఉంటారు. లోహితకు మధు తల్లి కాల్ చేసి మధు, మ్యాడీ వచ్చారా అని అడుగుతుంది. లేదని లోహిత చెప్తుంది. ఏమైనా తెలిస్తే మాకు వెంటనే చెప్పండి అని అడుగుతుంది. బావ రాలేదు మధు రాలేదు ఏం జరిగుంటుంది అని శ్రేయ చాలా కంగారు పడుతుంది.
మధు, మ్యాడీలు ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటారు. నువ్వు ఇక్కడ ఇరిక్కిపోవడం వల్ల నేను ఇరుక్కుపోవాల్సి వచ్చింది.. అమెరికా వెళ్లిపోతున్న నన్ను ఆపి శ్రేయతో పెళ్లి నిశ్చితార్థం అయ్యేలా చేసింది నువ్వు అందుకే ఇలా చీకట్లో ఉండాల్సి వచ్చిందని అంటాడు. అన్నీంటికీ నువ్వే కారణం అని మ్యాడీ మధుని అంటాడు. మ్యాడీ మాటలకు మధు షాక్ అయిపోతుంది. మ్యాడీ మధుతో రేపు శ్రేయతో పెళ్లి అయితే నేను పడే ప్రతీ బాధకి నువ్వే కారణం అవుతావ్.. నా జీవితం చీకటి అవ్వడానికి కారణం నువ్వే అని చెప్పి బాధ పడతాడు. నావల్లే నీ జీవితం చీకటి అయిపోయిందా అని మధు ఏడుస్తుంది.
మధు అలిగి వెళ్లి వేరో చోట కూర్చొంటుంది. మ్యాడీ కూడా మధు దగ్గరకు వెళ్తాడు. మళ్లీ ఏంటి నా దగ్గరకు వచ్చావ్ అని మధు అడిగితే నాకు చీకటి అంటే భయం అందుకే ఇలా మాట్లాడా అని అంటాడు. అంటే ఇప్పటి వరకు చీకటి గురించి మాట్లాడావా.. అంటే నీ భయం చీకటికా అని మధు కావాలనే మ్యాడీని భయపెడుతుంది. తర్వాత మ్యాడీ కోసం మొత్తం దీపాలు వెలిగిస్తుంది. నక్షత్రాల్లో చందమామలా ఉన్నావ్ ఫోన్‌లో చార్జింగ్ లేదు లేదంటే మంచి ఫోటో తీసేవాడిని గుర్తుగా ఉండేది అని మ్యాడీ అంటాడు. కొన్ని గుర్తులు మనసులో దాచుకోవాలి అని మధు అంటుంది. దానికి మ్యాడీ అయితే నువ్వు లైఫ్ లాంగ్ ఇలాగే నా లైఫ్‌లో ఉండిపోతావా అని అడుగుతాడు. లైఫ్ లాంగ్ బెస్ట్ ఫ్రెండ్‌లా ఉండిపోతావా అని అడుగుతాడు.
మధు అలా చూస్తూ ఉండిపోతుంది. మనసులో లైఫ్‌లో బెస్ట్ ఫ్రెండ్‌లా కాదు.. నీ లైఫ్‌నే నేను అయిపోతా అని అనుకుంటుంది. శ్రేయ చాలా కంగారు పడుతుంది. బావ మధు ఒక్క చోటే ఇరుక్కున్నారా.. నా పెళ్లి ఆపాలి అని మధు ఏమైనా ప్లాన్ చెప్తే నా జీవితం ఏమైపోతుందని అని చాలా కంగారు పడుతుంది. ఇక మ్యాడీకి నిద్ర రావడంతో మధు తన ఒడిలో నిద్ర పుచ్చుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















