అన్వేషించండి

Podharillu Serial Today December31th: మహా పెళ్లిముహూర్తం ముందుకు జరిపించిన ప్రతాప్‌.. పెళ్లి ఆపిస్తానని మహాకు హామీ ఇచ్చిన చక్రి

Podharillu Serial December 31th: పెళ్లి వద్దని మహా చెప్పగానే....గట్టిగా కోప్పడి ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరిపించి తీరతానని ప్రతాప్‌ అంటాడు. అటు పెళ్లి ఎలా చెడగొట్టాలని చక్రి ఆలోచిస్తుంటాడు.

Podharillu Serial Today Episode: మహాఎదురుపడటంతో నేను కిడ్నాప్‌కు గురైనందుకు నీకు అసలు బాధగా లేదనుకుంటా అని నిలదీస్తాడు.అలాంటిదేమీ లేదని...వాళ్లు మిమ్మల్ని ఏమీ చేయకుండా వదిలిపెట్టినందుకు సంతోషంగా ఉందని అంటుంది. రిజిస్టర్ మ్యారేజీ  ఆగిపోయినందున మనం బాగా ఆలోచించి మళ్లీ నిర్ణయం తీసుకుందామని మహా అనగా....నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నానని చెప్పి భూషణ్‌ వెళ్లిపోతాడు.

                  పెళ్లి చెడిపోయిందన్న ఆనందంతో మహా పరుగులు పెట్టుకుంటూ  డైనింగ్ టేబుల్‌ వద్దకు వస్తుంది.అప్పటికే అక్కడ అందరూ అన్నం తింటుంటారు. పెళ్లి ఆగిపోయినందుకు ఏదో కీడులా ఉందని కాబట్టి గుడికి వెళ్లి పూజ చేయిద్దామని మహా వాళ్ల అమ్మ అంటుంది. ఏ ఆటంకాలు రాకుండా వినాయకుడికి పూజ చేయిద్దామని ప్రతాప్‌ అంటాడు. ఇదే తనకు తగిన టైం అని భావించిన మహా...నిజంగా అతను నాకు కరెక్ట్ కాదని వాళ్ల నాన్న ప్రతాప్‌తో  అంటుంది. అందుకే  దేవుడే ఈ పెళ్లివద్దని ఆపాడేమో అంటుంది.

ఇక ఇంతటితో ఈ సంబంధం క్యాన్సిల్‌ చేద్దామని చెప్పగా....ప్రతాప్‌ తీవ్రస్థాయిలో మండిపడతాడు. అసలు రిజిస్టర్ మ్యారేజీ ఆగిపోవడానికి కారణమే నువ్వు అని అంటాడు. పెళ్లి చూపులు మొదలైనప్పటి నుంచి నువ్వు అడ్డుతగులుతూనే ఉన్నావు. పెళ్లి ఆగిపోవాలని పదేపదే కోరుకున్నావు...అందుకే ఇలా అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. నెగిటివ్‌గా మాట్లాడి మాట్లాడి నీ పంతం నెగ్గించుకున్నావ్ అంటాడు. ఏం చేసినా ఈ పెళ్లి జరిపిస్తానని..ఎలాంటి అడ్డంకులు రాకూడదనే మూడురోజుల్లో  పెళ్లి ముహూర్తం పెట్టించానని చెప్పడంతో  మహా షాక్‌కు గురవుతుంది. ఈ పెళ్లిని ఏ శక్తి  ఆపలేదని...దీని గురించి మళ్లీ మాట్లాడి నాకు ఆగ్రహం తెప్పించొద్దంటూ చేతులు కడుక్కుని లేచి వెళ్లిపోతాడు ప్రతాప్‌.
    
                         మాధవ్‌ పెళ్లిచూపులకు వెళ్లిన అమ్మాయి కవిత తిరిగి మాధవ్‌కు ఫోన్ చేసి పలకరిస్తుంది. మీ అమ్మానాన్నలు మమ్మల్ని అపార్థం చేసుకుని వెళ్లిపోయారు కదా...మళ్లీ ఎందుకు ఫోన్ చేశారని మాధవ్ అంటాడు. మిమ్మల్ని పర్సనల్‌గా కలిసి మాట్లాడాలని అంటుంది. రెస్టారెంట్‌లో కలుద్దామని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలో వాళ్ల నాన్న చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి మహాకు కోపంతో నిద్రపట్టదు. వచ్చి చక్రితో గొడవపడుతుంది.

నువ్వు కిడ్నాప్ చేసి పెళ్లి ఆపేస్తే....వాళ్లు మూడురోజుల్లో ముహూర్తం పెట్టించారని చెబుతుంది. పెళ్లికొడుకును కిడ్నాప్ చేశారంటే...ఎవరో ఈ పెళ్లి ఆపడానికి ట్రై చేస్తున్నారన్న సంగతి మా వాళ్లకు అర్థమై ఉంటుందని...అందుకే ఈపెళ్లి ముందుకు జరిపారని మహా చెబుతుంది. ఇందులో నేను చేసిన తప్పు ఏంటని చక్రి అంటాడు. మీవాళ్లు ముహూర్తం మందుకు తెస్తే...నాకు ఏం సంబంధం అంటాడు. అయితే ఈ పెళ్లి ఎలా ఆపాలని మహా అడుగుతుంది. మీరు ఇప్పుడే కదా చెప్పారు...ఇంకా మూడురోజుల సమయం ఉందిలేండి అని చక్రి అభయమిస్తాడు. అంతా నేను చూసుకుంటానని మీరు హ్యాపీగా వెళ్లి పడుకోండని చెబుతాడు.
  
                        మహాలక్ష్మీ వాళ్ల ఇంట్లో తెల్లారగానే పెళ్లిపనులు మొదలుపెట్టేస్తారు. పసుపు కొట్టడం స్టార్ట్‌ చేస్తారు. ఇల్లంతా బంధువులతో కళకళలాడుతుంటుంది. చక్రికి ఏం చేయాలో అర్థం కాదు. మహాకూడా  చాలా భయపడుతుంటుంది. 

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today NOV 9:అనసూయ పెళ్లి గురించి రాధ విక్కీకి చెబుతుంది. ఆనందంతో పొంగిపోయిన విక్రమ్‌కృష్ణ
నువ్వులేక నేను లేను: అనసూయ పెళ్లి గురించి రాధ విక్కీకి చెబుతుంది. ఆనందంతో పొంగిపోయిన విక్రమ్‌కృష్ణ
Gundeninda Gudigantalu Nov 9: సుమతి అరుణ్‌ను ప్రేమించడం తట్టుకోలేకపోయిన బాలు..తనపై కోపంతో మరదలని ట్రాప్‌ చేశాడని అనుమానం
గుండెనిండా గుడిగంటలు: సుమతి అరుణ్‌ను ప్రేమించడం తట్టుకోలేకపోయిన బాలు..తనపై కోపంతో మరదలని ట్రాప్‌ చేశాడని అనుమానం
Brahmamudi Serial Today November 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఫోటో కోసం గొడవ – రేఖకు రాజు వార్నింగ్‌
‘బ్రహ్మముడి’ సీరియల్: ఫోటో కోసం గొడవ – రేఖకు రాజు వార్నింగ్‌
Illu Illalu Pillalu Serial Today November 9th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీ కోసం నర్మద, వేద గొడవ! రామరాజు కాళ్లు పట్టుకున్న భాగ్యం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీ కోసం నర్మద, వేద గొడవ! రామరాజు కాళ్లు పట్టుకున్న భాగ్యం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MPTC ZPTC Election Results: ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా ఎన్నికల ఫలితాలు
ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా MPTC, ZPTC Results
Hyderabad News: బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
Real World Mileage: కొత్త Honda City Hybridలో ఫుల్ ట్యాంక్‌తో 750km ప్రయాణించవచ్చా? రియల్‌ వరల్డ్‌లో ఎంత మైలేజ్ ఇస్తోంది?
2026 హోండా సిటీ హైబ్రిడ్ నిజమైన మైలేజ్ ఎంత? సిటీలో, హైవేపై 'రియల్ టెస్ట్‌'లో తెలిసిన నిజాలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Gym Beginner Guide : జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
Petrol Saving Tips: మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Embed widget