Chinni Serial Promo Today April 4th: చిన్ని సీరియల్ ప్రోమో: ఉషనే తన చెల్లి అని తెలుసుకున్న సత్యంబాబు.. నిర్ణయం ఏంటి?
Chinni Promo Today సత్యం బాబుకి ఉషనే తన చెల్లి కావేరి అని తెలియడం ఉషని ఇకపై తన చెల్లి కావేరిలానే బతికేలా చేస్తానని సత్యంబాబు అనుకోవడంతో ఇవాళ్టి ప్రోమో ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Promo Today చిన్ని సీరియల్ రోజు రోజుకు చాలా ఆసక్తికరంగా మారుతోంది. కావేరి జైలు నుంచి తప్పించుకొని డెహ్రాడూన్‌కి చెందిన పీటీ ఉషగా పేరు, ఐడెంటిటీ మార్చుకొని తన సొంత ఊరిలోనే ఉంటుంది. తనకు ఎంతో ఇష్టమైన అన్న ఇంటిపైనే అద్దెకు ఉంటూ చిన్నితో హ్యాపీగా ఉంటుంది. అయితే ఏసీపీ విజయ్ కావేరి కేసు రీ ఓపెన్ చేసి ఉష కావేరి ఒక్కరే అని నిరూపించడానికి రంగంలోకి దిగుతాడు. ఏపీసీ విజయ్ ఎంట్రీ అయినప్పటి నుంచి చిన్ని సీరియల్ ఓ క్రైమ్ థ్రిల్లర్‌లా ప్రతీ క్షణం ఉత్కంఠగా మారింది. ఈ తరుణంలో తాజాగా వచ్చిన ప్రోమో చాలా ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ప్రోమోలో ఏం ఉంది అంటే..
"కావేరి, సత్యం బాబుల తండ్రి ఫొటో దగ్గర రకరకాల పిండి వంటలు ఉంటాయి. సత్యం బాబు వాటిని చూసి భార్య సరళకు ఇవన్నీ ఏంటి అని అడుగుతాడు. మీ చెల్లి కాని చెల్లెలు చేసిందని ఉషని ఉద్దేశించి చెప్తుంది. సత్యం బాబు ఆ వంటల్ని టేస్ట్ చేసి అచ్చం తన చెల్లి కావేరి చేసినట్లే ఉన్నాయేంటా అని అనుకుంటాడు. ఆ అనుమానంతోనే ఉష గది దగ్గరకు వెళ్తాడు. అక్కడ ఉష అలియాస్ కావేరి తండ్రి ఫొటో పట్టుకొని ఏడుస్తూ తోడబుట్టిన అన్నయ్య కడుపున పుట్టిన చిన్ని అందరూ నా వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు చిన్ని చేత నోరారా అమ్మా అని పిలిపించుకుంటానో తెలీడం లేదు. అని ఏడుస్తుంది. అదంతా చూసి షాక్ అయిన సత్యం బాబు చిన్ని అనుకున్నట్లు తను కావేరినే ఉష కాదు అని కుప్పకూలిపోతాడు. తను ఇక ఉషలా ఉండకూడదు. నా చెల్లి కావేరిలానే ఉండాలి.. కావేరిలానే బతకాలి అని నిర్ణయించుకుంటాడు. దీంతో ప్రోమో పూర్తయిపోతుంది."
విజయ్ ప్లానేనా..
ఉష కావేరి అని నిరూపించడానికి ఏసీపీ విజయ్ వేలిముద్రల దగ్గర నుంచి చివరకు చిన్ని, ఉషలకు డీఎన్‌ఏ టెస్ట్ కూడా చేసి అన్ని ప్రయత్నాల్లోనూ విఫలం అయిపోతాడు. కావేరి ముద్రలు మార్చడం దగ్గర నుంచి గత ఎపిసోడ్‌లో జరిగిన డీఎన్‌ఏ టెస్ట్ వరకు కావేరి భర్త రాజు తెలివిగా అన్నీ మార్చేస్తాడు. దాంతో కావేరి ఉష ఒకరే అని ఏపీసీ నిరూపించలేకపోతాడు. రాజు గతంలో చేసిన తప్పునకు ఇప్పుడు తన భార్యకూతుర్ని కాపాడుకోవడానికి శ్రేయాభిలాషిగా మారి ఉషకి సాయం చేస్తుంటాడు. కావేరి ఉష ఒక్కరే అని నిరూపించలేకపోయిన విజయ్ కేసు క్లోజ్ చేసి వెళ్లిపోతాడు. అయితే విజయ్ వెళ్తూ వెళ్తూ చిన్ని మెడలో తన చైన్ వేస్తాడు. చిన్నిని చూస్తే అచ్చం తన కూతుర్ని చూసినట్లే ఉంటుందని చిన్నితో అనుబంధం పెంచుకున్న విజయ్ ప్రేమతోనే చైన్ చిన్ని మెడలో వేశాడా.. దాని ద్వారా ఉష గురించి తెలుసుకోవడానికి వాయిస్ రికార్ట్ లేదంటే సీక్రెట్ కెమెరా ఇలా ఏమైనా తన పోలీస్ బుద్ధి ఉపయోగించాడా అనే అనుమానం కలుగుతుంది. మొత్తానికి విజయ్ ఈరోజు నుంచి సీరియల్‌లో ఉండడు. విజయ్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశపడతారు అనే చెప్తాలి.
చిన్ని తల్లిదండ్రుల్ని కలుపుతుందా..
మరోవైపు చిన్ని తన తండ్రి రాజుని తల్లి జైలుకి వెళ్లడానికి కారణం అడుగుతుంది. రాజు చిన్నమ్మ భారతి వల్ల శ్రేయాభిలాషిలా తన తండ్రే తల్లిని కాపాడుకుంటున్నాడని తెలుసుకుంటుంది. తండ్రి నిజస్వరూపం తెలిసిన చిన్ని మొదటి సారి రాజుని నాన్న అని పిలుస్తుంది. తల్లిదండ్రల్ని కలపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కూతురి కోసం రాజు కూడా భార్యతో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఉష మాత్రం రాజు ఛీ కొడుతూనే ఉంటుంది. చూడాలి మరి చిన్ని ప్రయత్నం ఫలిస్తుందా.. రాజు, కావేరిలు కలుస్తారా లేదా.. ఇక సత్యం కావేరిని కావేరిలా ఉండనివ్వాలి అనుకున్నాడు అంటే ఏం చేయాలి అనుకుంటున్నాడో తెలియాలి అంటే ఎపిసోడ్ మొత్తం చూడాల్సిందే.
Also Read: అమ్మాయి గారు సీరియల్: మాధవి కొడుకుని కిడ్నాప్ చేసిన రాజు.. సీఎం మీద మాధవి అత్యాచార నింద వేస్తుందా!





















