Ammayi garu Serial Today April 3rd: అమ్మాయి గారు సీరియల్: మాధవి కొడుకుని కిడ్నాప్ చేసిన రాజు.. సీఎం మీద మాధవి అత్యాచార నింద వేస్తుందా!
Ammayi garu Today Episode రాజు, రూపలు మాధవి కొడుకుని కిడ్నాప్ చేసి ఫైల్ తీసుకోవడం, జీవన్ రగిలిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode మాధవి జీవన్ ఫైల్ మీద సీఎం సూర్యప్రతాప్‌తో సంతకం పెట్టించేస్తుంది. మాధవిని చూసి సూర్యప్రతాప్ సిన్సియర్ సీఎంకు సిన్సియర్ పీఏ నేను చాలా లక్ అనుకుంటాడు. ఇక రాజు మాధవి అడ్రస్ పట్టుకుంటాడు. రూప రాజుకి కాల్ చేసి మాధవి సంతకాలు పెట్టించేసిందని చెప్తుంది. రాజు షాక్ అయిపోతాడు. మాధవిని ఎలా అయినా ఆపాలని రూప చెప్తుంది.
సంతోషంలో జీవన్..
రాజు తన ప్లాన్ రూపతో చెప్తాడు. రూప వెంటనే ఇంటి నుంచి బయల్దేరుతుంది. జీవన్ దగ్గరకు ఇద్దరు అధికారులు వచ్చి సంతకాలు అయిపోతాయి అన్నారు ఎక్కడ అని అంటారు. ఇంతలో జీవన్‌కి మాధవి కాల్ చేసి సంతకాలు అయిపోయావని చెప్తుంది. జీవన్ చాలా సంతోషిస్తారు. స్పీకర్ ఆన్ చేస్తాడు. మన డాక్యుమెంట్స్ మీద సీఎం సంతకం పెట్టారని మాధవి అంటుంది. జీవన్ రాధికను డాక్యుమెంట్స్ ఇచ్చి పేమెంట్ తీసుకెళ్లమని అంటాడు. రాధిక జీవన్ ఇంటికి బయల్దేరుతుంది.
రాధిక కొడుకు కిడ్నాప్..
రాధిక అలియాస్ మాధవి ఎగురుకుంటూ జీవన్ దగ్గరకు ఫైల్ తీసుకొని బయల్దేరుతుంది. ఇంతలో రాధిక కొడుకు చెర్రీని రాజు, రూపలు కిడ్నాప్ చేస్తారు. వీడియో కాల్ చేసి ఫైల్ ఇస్తేనే నీ కొడుకు బతుకుతాడని చెప్తారు. కొడుకుని చంపేస్తా అనడంతో మాధవి ఫైల్ ఇస్తానని చెప్తుంది. రాజు వాళ్లు చెప్పిన అడ్రస్‌కి మాధవి పరుగులు పెడుతుంది. రాజు, రూపలు చెర్రీకి చాక్‌లెట్ ఇచ్చి మీ అమ్మ మీద మేం ఫ్రాంక్ చేస్తున్నాం అని చెప్తారు. జీవన్ వాళ్లు రాధిక కోసం వెయిట్ చేస్తుంటారు. ఇంకా రాలేదు ఏంటి అని అనుకుంటారు.
ఫైల్ ఇచ్చేసిన రాధిక..
మాధవి కొడుకుని తీసుకొని ఫైల్ ఇచ్చేస్తుంది. మీరు ఎవరు అని రాధిక అడగటంతో రాజు, రూపలు ముసుగు తీస్తారు. అది చూసి రాధిక షాక్ అయిపోతుంది. మీర అని నోరెళ్లబెడుతుంది. జీవన్ వాళ్లు టెన్షన్‌తో రాధిక ఎవరికైనా దొరికిపోయిందా అనుకుంటారు. రూప ఆ డాక్యుమెంట్స్‌ని చింపేసి రాధికను లాగిపెట్టి కొడుతుంది. మా ఫ్యామిలీ జోలికి వస్తే చీరేస్తా అని తిడుతుంది. నేను ఉండగా మా పెద్దయ్యగారిని టచ్ చేయలేరు అని అంటాడు.
అనుకున్నదొకటి అయినది ఒకటి..
రాధిక ఫోన్‌కి జీవన్ ఫోన్ చేస్తాడు. రాజు ఫోన్ లిఫ్ట్ చేసి అనుకున్నదొకటి అయినది ఒకటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా అని పాట పాడుతాడు. నీ దగ్గర ఫోన్ ఉంది ఏంట్రా అని జీవన్ అడిగితే.. ఒక మగాడిని ఎదుర్కొవడానికి ఆడవాళ్లని అడ్డుపెట్టుకున్నావ్ నువ్వేం మగాడివిరా అని రాజు అంటాడు. నీతో మాట్లాడాలి అంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది పెట్టరా ఫోన్ అని రాజు కట్ చేసేస్తాడు. జీవన్ కోపంతో అరుస్తూ ఫోన్ పగలగొట్టేస్తాడు.
మాధవిని కొట్టిన జీవన్..
జీవన్ మాధవిని కలిసి మాధవిని కొడతాడు. ప్లాన్ అంతా సర్వనాశనం చేసేశావ్ నీ చేతకాని తనం వల్ల కోట్లు పోయావని అంటాడు. నువ్వు ఇచ్చింది నా చిరకాల కల అని బిడ్డ పోతే మరో బిడ్డను కనొచ్చు కానీ సూర్యప్రతాప్‌ని నాశనం చేసే అవకాశం పోగొట్టావని అంటాడు. రాజు రూపతో ఆపేపర్లు డ్రగ్స్ కంపెనీకి సంబంధించినవి సీఎం వాటికి పర్మిషన్ ఇచ్చినట్లు సంతకం పెట్టించింది అని చెప్తాడు. మాధవి ఏదో ఒకటి చేసి మళ్లీ సంతకం చేయిస్తానని జీవన్‌తో చెప్తుంది. ఇంట్లో మాధవిని ఆపాం కానీ బయట ఆపలేం అని రాజు, రూపలు అనుకుంటారు.
సీఎం అత్యాచారం చేశాడని చెప్పు..
మాధవి తేనీటి విందు ఉందని చెప్తే దానికి జీవన్ ఒక పని చేయ్ అని అంటాడు. నీ మీద సూర్యప్రతాప్ అత్యాచారం చేసినట్లు చేయమని అంటాడు. నేను అలా చేయలేను అని రాధిక అంటుంది. ఈ ప్లాన్‌లో ఏ మాత్రం తేడా వచ్చినా నేను నిన్ను వదలను అని అంటాడు. ఏ బిడ్డ కోసం బంగారం లాంటి అవకాశం పోగొట్టావో ఆ బిడ్డనే చంపేస్తా అంటాడు. రూప, రాజులు కూడా తేనీటి విందులో ఏమైనా ప్లాన్ చేస్తుంది మన గమనిస్తూ ఉండాలని అనుకుంటారు.
తేనీటి విందు హడావుడి..
సీఎం పార్టీ నేతలందరికీ తేనీటి విందు ఇస్తారు. అందరూ కార్యక్రమానికి వస్తారు. మాధవి కూడా ఉదయం వస్తుంది. రాజు, రూపలు సీరియస్‌గా చూస్తారు. మాధవిని చూస్తుంటే ఏదో తేడా కొడుతుందని రూప అంటుంది. మాధవి సీఎం గారు ఎక్కడ ఉన్నారు అని చంద్రని అడిగి సీఎం గదికి వెళ్తుంది. మీడియాని కూడా పిలిచాను అంటుంది. ఎందుకు పిలిచావ్ నేను చెప్పలేదు కదా అంటే మనసులో నీ పరువు తీయాలని నేనే చేశా అనుకుంటుంది. ఎమ్మెల్యేలు అందరూ వస్తారు. విరూపాక్షి కూడా వస్తుంది. రూప, రాజులు చాలా సంతోషిస్తారు. విరూపాక్షిని చూసిన సూర్యప్రతాప్ నువ్వు ఎందుకు వచ్చావ్ అంటే నన్ను నీ పార్టీలోకి ఆహ్వానించారు కదా అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: తండ్రి కాలర్ పట్టుకున్న కార్తీక్.. శ్రీధర్ చెప్పిన నిజం దీప మాయం!





















