Chinni Serial Today October 22nd: చిన్ని సీరియల్: మ్యాడీనే మహి అని తెలుసుకున్న మధు! తానే చిన్ని అని చెప్పేస్తుందా!
Chinni Serial Today Episode October 22nd మ్యాడీనే మహి అని చిన్నికి తెలియడం.. తానే చిన్ని అని మధు మ్యాడీతో చెప్పడానికి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు, మ్యాడీ ఇద్దరూ నిమ్మకాయ దీపాలు చూసి ఒకరు కోసం ఒకరు వెతుకుతూ ఉంటారు. లోహిత వరుణ్‌తో మనం ఇంటికి వెళ్లడానికి ఏమైనా దారులు ఉన్నాయా అని అడుగుతుంది. మ్యాడీ బావ చెప్పాడు కదా వెయిట్ చేద్దాం అని వరుణ్ అంటాడు. 
లోహితకు చందు కాల్ చేస్తే లోహిత లిఫ్ట్ చేయదు.. వరుణ్ మాట్లాడమని చెప్తే నేను మాట్లాడితే నన్ను చంపేస్తారు.. మీ ఇంట్లో వాళ్లు మనల్ని ఒప్పుకుంటే అప్పుడు చెప్తా అని అంటుంది. ఈ సమస్యకు ఎలా అయినా ఫుల్‌స్టాప్ పెట్టాలని లోహిత అనుకుంటుంది. నేను బయటకు వస్తా అని చెప్పి లోహిత వరుణ్‌తో వెళ్తుంది. 
నాగవల్లి, దేవేంద్రవర్మ హోమం చేస్తుంటారు. మరోవైపు గుడిలో ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి. మధు, మ్యాడీ ఇద్దరూ వెతుకుతూ ఉంటారు. మధు మహి కోసం వెతుకుతూ మహి నువ్వు ఇక్కడే ఉన్నావ్ అని నా మనసు చెప్తుంది. కనిపించు మహి అని అనుకుంటూ ఉంటుంది. ఇక మ్యాడీ చిన్నిని వెతికి వెతికి ఓ చోట నిల్చొని చిన్నప్పటి చిన్ని ఫొటోలు చూస్తుంటాడు. ఇంతలో ప్రవచనాలు పూర్తి అయిపోవడంతో ఓ వ్యక్తి భక్తి గీతాలు కాసేపు పెట్టాలి అనుకుంటాడు. అతని ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోవడంతో అక్కడే ఉన్న మ్యాడీ ఫోన్ అడిగి కాసేపు భక్తి పాటలు పెడతానని అంటాడు. దాంతో మ్యాడీ ఫోన్ ఇస్తాడు. ఆ వ్యక్తి మ్యాడీ ఫోన్ కనెక్ట్ చేయడంతో మ్యాడీ చూస్తున్న చిన్నప్పటి ఫొటోలు ప్రొజెక్టర్ మీద కనిపిస్తాయి.. అతను ఓనర్ పిలిచాడు అని వెళ్లిపోతాడు. ఫొటోలు చూసుకోడు.. మ్యాడీ కూడా చూసుకోడు.
మధు మహి కోసం మొత్తం వెతుకుతూ ప్రొజెక్టర్ మీద తనవి మహివి ఫొటోలు చూస్తుంది. నావి మహివి ఫొటోలు వస్తున్నాయి అంటే ఈ వీడియో మహినే ప్లే చేయిస్తున్నాడా.. అసలు ఈ వీడియో ఎక్కడ నుంచి వస్తుంది. అక్కడికి వెళ్తే మహి కనిపిస్తాడు అని వెతుకుతూ అటు వెళ్తుంటుంది. ఇంతలో వ్రతం పూర్తి చేసిన నాగవల్లి, దేవాలు ప్రొజెక్టర్ మీద వస్తున్నా ఆ ఫొటోల వీడియో చూసి షాక్ అయిపోతారు. 
ఫొటోలు అందరూ చూస్తారు. మ్యాడీ దగ్గర ఫోన్ తీసుకున్న వ్యక్తి ఆ ఫొటోలు చూసి వెళ్లి ఆపేసి ఫోన్ తీసుకెళ్లి మ్యాడీతో మీ పర్సనల్ ఫొటోలు ప్లే అయిపోయావి సారీ సార్ అని చెప్పి ఫోన్ ఇస్తాడు. అప్పుడే మధు అక్కడికి వచ్చి మ్యాడీనే తన చిన్ననాటి మహి అని గుర్తిస్తుంది. అంటే మ్యాడీనే నా మహినా చాలా చాలా సంతోషపడుతుంది. చిన్ననాటి సంగతులు అన్ని గుర్తు చేసుకొని సంబరపడిపోతుంది. మహి మహి అని కన్నీరు పెట్టుకొని సంతోషం ఆపుకోలేకపోతుంది. మ్యాడీ దగ్గరకు పరుగులు పెడుతుంది. మ్యాడీ మధుని చూసి ఏంటి అలా చూస్తుందా అని చూస్తూ ఉంటాడు. 
మధు నువ్వు ఎప్పుడు వచ్చావ్ అని అడుగుతాడు. నా సంగతి తర్వాత ఇప్పుడు వీడియో ప్లే అయింది కదా అది ఎవరిది అని అడుగుతుంది. అది నేను నా చిన్ని అని మ్యాడీ చెప్తాడు. మధు చాలా చాలా సంతోషపడుతుంది. ఏంటి మధు ఏమైంది అని మ్యాడీ అడుగుతాడు. చెప్తాను కానీ ఇక్కడ కాదు నాతో రా అని మధు మ్యాడీని తీసుకొని ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు వెళ్తుంది. ఏంటో చెప్పు మధు అని మ్యాడీ అంటాడు. నేను చెప్పే మాట వింటే నువ్వు చాలా సంతోష పడతావ్ అది నేను అని మధు చెప్పే టైంకి నాగవల్లి వచ్చి మధు ముందు నిల్చొంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















