Chinni Serial Today March 31st: చిన్ని సీరియల్: ఉష, చిన్నిలకు డీఎన్‌ఏ టెస్ట్.. ఈసారి కావేరి దొరికిపోవడం ఖాయం.. చేతులెత్తేసిన రాజు!
Chinni Today Episode ఉష కావేరి అని నిరూపించడానికి విజయ్ ఉష, చిన్నిలకు డీఎన్‌ఏ టెస్ట్ చేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode ఉష( కావేరి) సత్యంబాబు దగ్గరకు వెళ్లి పరామర్శించి మందులు వేసుకోవడానికి వచ్చి కాళ్లకు బామ్ రాస్తుంది. సత్యం వద్దని చెప్తారు. నన్ను చూస్తే మీ చెల్లిన చూసినట్లు ఉందని అన్నారు కదా ఈ మాత్రం మీ చెల్లి మీకు చేయకూడదా అని కావేరి అన్నయ్యకి బామ్ రాస్తుంది. ఇంతలో చిన్ని వచ్చి నేను చూసుకుంటా టీచరమ్మ అంటే మా బ్రోకి నేను చేయకూడదా అని ఉష అడిగి తాను కాళ్లు నొక్కుతుంది.
ఇంతలో సరళ వచ్చి చూసి చిరాకుతో ఉషని లేపి తోసేస్తుంది. చిన్ని పట్టుకుంటుంది. ఉషని తిడుతుంది. చిన్ని రావడంతో సగం దరిద్రం పట్టుకుంటే ఇప్పుడు ఈవిడ రావడంతో పూర్తి దరిద్రం పట్టుకుందని అంటుంది. దీని వల్లే పోలీస్ స్టేషన్‌కి వెళ్లావని మా ఆయనకు నేనే సేవలు చేస్తానని అనుకుంటుంది. చిన్ని దగ్గర బాక్స్ చూసి ఏసీపీకి అయిపోయావా నీ సేవలు అని అడుగుతుంది. ఉష వాళ్లతో మీరేం టెన్షన్ పడకండి ఇక నేను ఆ కేసు విషయం చూసుకుంటా అవసరం అయితే నేనే కావేరి అని ఒప్పుకొని జైలుకి వెళ్తా కానీ మిమల్ని ఇబ్బంది పెట్టనివ్వను అని చెప్పి ఉష వెళ్లిపోతుంది. చిన్ని మనసులో అమ్మ ఇలా అంటుంది ఏంటి తను కావేరి అని చెప్పేస్తుందా ఏంటి అని అడుగుతుంది.
ఇక విజయ్, గౌతమ్‌లు ఏం చేయాలా అని ఆలోచిస్తుంటారు. మనకు ఉన్న అన్ని దారులు మూసుకుపోయావి ఏం చేయలేం అనిపిస్తుందని గౌతమ్ అంటే చేయగలం అని కావేరి అలియాస్ ఉషకి చిన్నికి డీఎన్‌ఏ టెస్ట్ చేయిద్దామని విజయ్ చెప్తాడు. ఇద్దరి బ్లడ్ తీసుకోవడానికి వాళ్ల ఇంటికి వెళ్దాం పోలీసుకు చెప్పమని విజయ్ అంటాడు. ఇక చిన్ని దిగులుగా ఉంటుంది. చందు చిన్నిని పట్టించుకోకపోవడంతో ఏమైంది చందు నాతో మాట్లాడం లేదు అంటే నీ మీద కోపం ఉందని టీచర్‌కి నాన్నకి మనల్ని ఎంతో బాధ పెట్టిన ఆ ఏసీపీకి నువ్వు టిఫెన్ తీసుకెళ్తే నాకు కోపం రాదా అంటాడు. తనని అర్థం చేసుకోమని చిన్ని అంటుంది. ఇంతలో విజయ్ తన టీమ్‌తో అక్కడికి వస్తే పిల్లలతో పాటు సరళ చూసి చాలా భయపడతారు.
విజయ్ గౌతమ్ తన టీమ్‌ని ఉష దగ్గరకు పంపి పని పూర్తి చేయమని అంటాడు. ఇక సత్యంతో విజయ్ మాట్లాడుతాడు. ఉష కావేరి అని తాము బలంగా నమ్ముతున్నాం అందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాం అని చెప్తాడు. ఇక గౌతమ్ వాళ్లు ఇళ్లంతా సెర్చ్ చేయాలని ఉషతో చెప్పి ఇళ్లంతా వెతుకుతారు. కావేరి వెంట్రుకలు తీసుకుంటారు. వెంట్రుకలు చూసిన కావేరి కొండను తవ్వి ఎలుకని తీశారు అంటే కాదు మేడం ఎలుకతో కొండని తవ్వుతున్నామని చెప్తాడు. ఇక ఉషని విజయ్ పిలుస్తాడు. మీ ఇద్దరికీ డీఎన్‌ఏ టెస్ట్ చేయాలి అని అందుకు బ్లడ్ సాంపిల్స్ తీసుకోవాలని చెప్తాడు. ఉష షాక్ అవుతుంది. ఉష, చిన్ని ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూస్తారు. ఇద్దరి దగ్గర డాక్టర్ బ్లడ్ తీసుకుంటారు.
ఇక విజయ్ ఉష, సత్యంబాబులకు థ్యాంక్స్ చెప్పి రిపోర్ట్ వచ్చాక త్వరలోనే కలుద్దామని చెప్పి వెళ్లిపోతాడు. ఉష ఏం మాట్లాడకుండా వెళ్లి ఏడుస్తుంది. అంతా అయిపోయిందని ఇక తాను దొరికిపోతాను చిన్నికి దూరం అయిపోతాను అని నా ఒక్కదాని వల్ల అందరూ చాలా బాధ పడతారు అని ఏడుస్తుంది. ఇక పెద్దావిడ రాజుకి కాల్ చేసి డీఎన్‌ఏ టెస్ట్ కోసం కావేరి, చిన్ని బ్లడ్ తీసుకెళ్లారని ఉష ఏడుస్తుందని చెప్తుంది. కావేరికి ఎలాగోలా ధైర్యం చెప్పమని అంటాడు. ఈసారి బయట పడటం కష్టమని కానీ ఏదో ఒకటి చేస్తానని రాజు చెప్తాడు. కావేరి దొరికిపోయేలా ఉందని రాజు ఏడుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: సీఈఓ స్థానం కావాలన్న ఫణి.. బాల ఆస్తులకు సర్వ హక్కులు త్రిపురవే!





















