Chinni Serial Today March 26th: చిన్ని సీరియల్: అసలు నువ్వు ఉషవా.. కావేరివా.. సత్యం అరెస్ట్‌తో ఉషపై సరళ ఫైర్!
Chinni Today Episode కావేరి కేసు విషయంలో సత్యంబాబుని విజయ్ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లడంతో సరళ, పిల్లలు, ఉష అందరూ ఏడుస్తూ సరళ ఉషని నిందించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode విజయ్ పోలీసులతో సత్యం ఇంటికి వస్తే సరళ, చిన్ని షాక్ అయిపోతారు. పోలీసులతో మీరు ఎందుకు వచ్చారని సరళ విజయ్‌ని అడిగితే నేను పోలీస్‌నే పీఈటీ టీచర్‌ని కానని ఓ కేసు ఇన్విస్టిగేషన్ కోసం వచ్చానని చెప్తాడు. సరళ షాక్ అయిపోతుంది. చిన్ని కూడా షాక్ అయిపోతుంది. విజయ్ ఇంట్లో చూసిన గన్ అన్నీ గుర్తు చేసుకుంటుంది. విజయ్ సత్యంని పిలవమని చెప్తాడు. సత్యం రావడంతో కావేరి కేసు గురించి మాట్లాడాలి అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే వచ్చిన కావేరి కూడా టెన్షన్ పడుతుంది.
సత్యం: కావేరి గురించి మాట్లాడటానికి ఏం ఉంటుంది బాబు తను ఫైర్ యాక్సిడెంట్‌లో చనిపోయింది కదా.
విజయ్: అబద్ధం. తను చనిపోలేదు. ఉషలా పేరు మార్చుకొని మీ ఇంటి పైనే ఉంటుంది.
సత్యం: లేదు సార్ మీరు పొరపాటు పడుంటారు. తను ఉషే మా కావేరి కాదు.
పోలీస్: మీ చెల్లి ఉషగా పేరు మార్చుకొని చట్టాన్ని మోసం చేస్తుంది.
ఉష: లేదు సార్ నేను ఏ చట్టాన్ని మోసం చేయడం లేదు. ఏసీపీ గారు కూడా రెండు సార్లు విఫలం అయ్యారు.
విజయ్: ఆ సారి విఫలం కాదు సఫలం అవుతా. చూడండి సత్యం బాబుగారు మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఈమె కావేరి. అందుకే మిమల్ని స్టేషన్‌కి తీసుకెళ్లి విచారించాలి.
సరళ: ఏంటండి మీరు అనేది ఈమె ఉష, కావేరి మీరు ఆమెతో తేల్చుకోవాలి కానీ మా ఆయన మీద పడటం ఏంటి.
విజయ్: ఆమె పక్కాగా తప్పించుకుంటుంది. అందుకే మీ ఆయన్ను విచారించాలి.
సత్యం: సార్ తను ఉషనో కావేరినో తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్ వరకు అవసరం లేదు సార్ ఇక్కడే తెలుస్తుంది. ఒక సారి ఆ ఫొటో చూడండి సార్. చెల్లి పోకుండా ఏ అన్న అయినా చెల్లి ఫొటోకి దండ వేస్తాడా. దీపం పెడతాడా చెప్పండి.
విజయ్: అలాంటి ఫొటోలు దండలు కంటే మేం సాక్ష్యాలనే నమ్ముతాం అందుకే మీరు రావాలి.
చిన్ని మామయ్యని తీసుకెళ్లొద్దని విజయ్‌ని వేడుకుంటుంది. విజయ్ చిన్నితో నేను జాగ్రత్తగా మళ్లీ ఇంటికి తీసుకొస్తా అని చెప్తాడు. ఉష వల్లే ఇదంతా అని సరళ ఉషని తిడుతుంది. పిల్లలు సత్యంబాబుని పట్టుకొని వెళ్లొద్దు అని ఏడుస్తారు. సరళ, పిల్లలు అందరూ ఏడుస్తారు. పోలీసులు సత్యంబాబుని తీసుకెళ్లిపోతారు. అన్నయ్యని ఎలా రక్షించుకోవాలి అని ఉష ఏడుస్తుంది. తర్వాత రాజుకి కాల్ చేసి జరిగింది అంతా చెప్తుంది. ఉషకి రాజు ధైర్యం చెప్తాడు కానీ తను కుప్పకూలిపోతాడు. తాను చేసిన ఒక తప్పు వల్ల కావేరి, చిన్ని, సత్యంబాబులు ఇబ్బంది పడుతున్నారని తనని తాను కొట్టుకుంటాడు. ఇక రాజు దగ్గరున్న వ్యక్తి రాజుని ఆపి నువ్వే సత్యం బాబుని కాపాడాలి అని చెప్తాడు.
అందరూ సత్యం కోసం ఏడుస్తూ ఉంటారు. చిన్ని కావేరిల వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందన సరళ పిల్లలతో చెప్పుకొని ఏడుస్తుంది. ఆవేశంగా చిన్ని దగ్గరకు వెళ్లి నువ్వు ఎందుకు ఏడుస్తావే నిన్ను కొంపలోకి రానిచ్చినందుకు మేం ఏడ్వాలి అంటుంది. తర్వాత మీదకు వెళ్లి ఉషని పిలుస్తుంది. భారతి, ఉష ఇద్దరు బయటకు వస్తారు. మా కొంపలో మీరు కాలు పెట్టినప్పటి నుంచి మాకు దరిద్రం పట్టింది అని ఇక మీరు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని లగేజ్, సామాను అన్నీ బయటకు విసిరేసి ఉషని గెంటేస్తుంది. ఏసీపీ విజయ్ లేనిపోని అనుమానాలతో ఇలా చేస్తున్నాడని ఉష అంటుంది. నువ్వు నిజంగా కావేరి అయితే మా ఆయన తిరిగి రాడు కదా.. నిజం చెప్పు నువ్వు ఉషవా కావేరివా అని సరళ ప్రశ్నిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: త్రిపుర అఖండ జ్యోతి దీక్ష నెరవేరిందా...? ఆమెకు ఎదురైన అడ్డంకులు ఏంటి..?





















