Chinni Serial Today Episode: చిన్ని సీరియల్: జైలుకి బాలరాజు, కావేరి-చిన్నిల కన్నీళ్లు.. మెమొరీ కార్డు కోసం వేట!
Chinni Today Episode: బాలరాజుని జైలుకి తీసుకెళ్లడం కావేరి, చిన్ని చాలా ఎమోషనల్ అవడం బాలరాజు కావేరి, చిన్నిలకు జాగ్రత్తలు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode కానిస్టేబుల్ శంకరం సాయంతో బాలరాజుని కావేరి, చిన్నిలు పోలీస్ స్టేషన్‌కి తీసుకొస్తారు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం అని ముగ్గురు కానిస్టేబుల్‌కి దండం పెడతారు. దాంతో కానిస్టేబుల్ ఇది రుణం కాదు ప్రాయశ్చిత్తం.. నా కూతురిని కిడ్నాప్ చేసి నన్ను బెదిరించడంతో నిజం చెప్తాను అని అన్న నేను అబద్ధం చెప్పి నీకు శిక్ష పడేలా చేశాను.. ఈ క్షణం నాకు కాస్త ఊరటగా ఉంది. నువ్వు నిర్దోషి అని నిరూపించడానికి నా వంతు సాయం నేను చేస్తా అంటారు.
బాలరాజు పెద్దాయనకు హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్తాడు. నువ్వు నన్ను జైలుకి తీసుకొచ్చినందుకు నీకు ప్రాబ్లమ్ అ వుతుందా అంటే నేను ఏం చెప్పాలో అది చెప్తా అంటారు. కానిస్టేబుల్‌కి పై అధికారి ఫోన్ చేయడంతో వెళ్తారు. చిన్ని తండ్రితో నువ్వు 14 ఏళ్లు జైలులో ఉండాల్సిందేనా నిర్దోషి అని నిరూపించుకునే అవకాశం లేదా అని ఏడుస్తుంది. ఉందమ్మా నేను మీ అమ్మ నిర్దోషులం అని నిరూపించుకునే అవకాశం ఉంది మేం చూసుకుంటా అని బాలరాజు అంటాడు. చిన్ని ఏడుస్తు పదేళ్లు నేను అమ్మ జైలులో ఉన్నాం.. నువ్వు బయట ఉన్నావ్.. ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్తున్నావ్ మేం బయట ఉంటున్నాం.. ముగ్గురం కలిసి ఉండే రోజు వస్తుందా అని ఏడుస్తుంది. నిజంగా ఆ రోజు వస్తుందా అని కావేరి అడుగుతుంది.
బాలరాజు కావేరికి ధైర్యం చెప్తాడు. కానిస్టేబుల్ వచ్చి జైలర్ గారు నిన్ను తీసుకురమ్మని చెప్పారు వెళ్దామా అంటారు. బాలరాజు కన్నీరు పెట్టుకొని కావేరి, చిన్నిలకు జాగ్రత్తలు చెప్తాడు. చిన్నినితో జాగ్రత్త చిన్ని బాగా చదువుకో ఈ నాన్నకి నువ్వే ప్రాణం జాగ్రత్త అంటాడు. కావేరి దగ్గరకు వెళ్లి ప్రేమగా నిమిరి నువ్వు జాగ్రత్త కావేరి చిన్నిని జాగ్రత్తగా చూసుకో అంటాడు. కావేరి చిన్ని ఏడుస్తారు. బాలరాజుని తీసుకెళ్తుంటే చిన్ని తండ్రిని పట్టుకొని ఏడుస్తుంది. బాలరాజు ఏడుస్తూ బలవంతంగా కన్నీరు ఆపుకొని ఎందుకు ఏడుస్తున్నావ్ చిన్ని నేను వచ్చేస్తా అని చెప్పా కదా అంటాడు. కావేరి కూడా ఏడుస్తుంటే నువ్వేంటి కావేరి ఇలాంటి టైంలోనే ధైర్యంగా ఉండాలి అని అంటాడు. నేను శాశ్వతంగా జైలులో ఉండాలి అని వెళ్లడం లేదు నిర్దోషిగా నిరూపించుకొని వస్తాను అంటాడు.
కానిస్టేబుల్ బాలరాజుని తీసుకెళ్లి జైలులో అప్పగిస్తాడు. బాలరాజుకి సంతకం పెట్టమని అంటే కన్నీరు రిజిస్టర్ మీద పడతాయి. బయట కావేరి, చిన్నిలు కుప్పకూలి ఏడుస్తారు. ఆ సీన్స్ రెండు కన్నీరు తెప్పిస్తాయి. ఉదయం కావేరి, చిన్నిలు గుడికి వెళ్తారు. గుడి దగ్గర చిన్ని ఫ్రెండ్ సహస్ర వాళ్ల అమ్మతో పాటు వచ్చి చిన్నితో మాట్లాడుతుంది. ఇక సహస్ర చిన్నితో నువ్వు స్కూల్‌కి రాలేదని మహి చాలా ఫీలయ్యాడు లంచ్ కూడా చేయలేదని చెప్తుంది. రేపటి నుంచి వస్తాను మహికి చెప్పు అని చిన్ని చెప్తుంది. చిన్ని కావేరి ఇద్దరూ దేవుడి దర్శనం చేసుకొని దండం పెట్టుకుంటారు. కావేరి మెమోరీ కార్డు దొరకాలని మొక్కుకుంటుంది.
కావేరి చిన్నిని అక్కడే కూర్చొపెట్టి తాను మెమోరీ కార్డు వెతకడానికి వెళ్తుంది. చిన్ని మహి గురించి ఆలోచిస్తుంది. ఏంటి నేను ఒక్క రోజు రాకపోతే మహి ఇంత ఫీలవుతున్నాడేంటి పాపం అనుకుంటుంది. ఇక సహస్ర మహికి విషయం చెప్తుంది. దాంతో మహి వెంటనే నేను చిన్నిని కలిసి వస్తాను అని డ్రైవర్‌కి చెప్పి వెంటనే శివాలయానికి తీసుకెళ్లమని అంటాడు. చిన్ని వచ్చి ఏంటి అమ్మా వెతుకుతున్నావ్ అంటే మెమోరీ కార్డు కోసం చిన్ని నాన్న ఇక్కడే పొగొట్టుకున్నారని అంటుంది. ఆ మెమోరీ కార్డు దొరికితే నాన్న నిర్దోషిగా వస్తారా అంటే తప్పకుండా అని కావేరి అంటుంది. దాంతో చిన్ని కూడా వెతుకుతుంది. గుడిలో ఓ వ్యక్తి దేవుడికి దండం పెట్టుకుంటూ గంట మోగిస్తే చిన్ని అతని దగ్గరకు వెళ్లి చాలా థ్యాంక్స్ అండీ అంటుంది. ఎందుకు అమ్మా థ్యాంక్స్ అంటే నేను ఓ కోరిక కోరుకున్నా మీరు టైంకి గంట కొట్టారు అందుకే అంటుంది. మంచి కోరిక ఆ అమ్మవారు తప్పకుండా తీర్చుతుందని ఆయన అని దేవుడి వైపు చూపిస్తే అక్కడ ఒకామె నిమ్మ దీపం పెట్టడం చూసి చిన్ని వెళ్లి అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: కోర్టులో ఉత్కంఠ.. లక్ష్మీకి శిక్ష గ్యారెంటీ.. విహారి ఏం చేయనున్నాడు!





















