Chinni Serial Today June 18th: చిన్ని సీరియల్: బాలరాజుకి ఉరి శిక్ష వేయమన్న సరళ.. కానిస్టేబుల్ సాక్ష్యం చెప్తాడా.. కోర్టులో ఉత్కంఠ!
Chinni Today Episode బాలరాజుని కేసు నుంచి కాపాడుకోవడాకికి కావేరి పోరాటం చేయడం నాగవల్లి చిన్నిని చంపేస్తానని కావేరిని బెదిరించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్ని, ఆఫ్ టికెట్‌ని తీసుకొని గుడికి వెళ్తుంది. కావేరి కానిస్టేబుల్‌ని కలవడానికి వెళ్తుంది. కానిస్టేబుల్ తన కూతురిని స్కూల్‌కి డ్రాప్ చేస్తూ మధ్యలో ఆగుతారు. ఇంతలో కావేరి వస్తుంది. కావేరి పర్సనల్ అని చెప్పడంతో కానిస్టేబుల్ తన కూతుర్ని పక్కకు పంపిస్తాడు. బాలరాజు ఆ నేరం చేయలేదు అని కావేరి అంటే తెలుసు అని కానిస్టేబుల్ అంటారు.
బాలరాజు విషయంలో సాయం చేయమని కావేరి అడుగుతుంది. బాలరాజు నేరం చేయలేదు అని మీకు తెలుసు అంటే ఎవరు చేశారో కూడా తెలుసు కదా అది ఎవరో చెప్పండి అని బతిమాలుతుంది. కాళ్లు కూడా పట్టుకోవడానికి రెడీ అవుతుంది. మీ స్టూడెంట్ తండ్రి కోసం మీరు ఎందుకు ఇంతలా బాధ పడుతున్నారు టీచర్ నాకు ఏం తెలీదు అని కానిస్టేబుల్ అంటే తను నా కూతురి తండ్రి అంతే కాదు బాలరాజు నా భర్త అని చెప్తుంది. కానిస్టేబుల్ షాక్ అయిపోతాడు. బాలరాజుని కాపాడుకునే మార్గం చెప్పమని అంటుంది.
కానిస్టేబుల్ చెప్తానని అంటారు. బాలరాజుని కాపాడుకోవడానికి ఒకే ఒక అవకాశం ఉందని మీ అన్నయ్యని పొడిచిన కత్తి మీద బాలరాజు వేలి ముద్రలతో పాటు మరొకరి ముద్రలు ఉన్నాయి ఈ విషయాన్ని కోర్టులో చెప్పి అసలైన ఫోరెన్సిక్ రిపోర్ట్ తీసుకొస్తే బాలరాజు విడుదల అవుతాడని అంటారు. తప్పుడు రిపోర్ట్‌తో బాలరాజుని ఇరికించేశారని నేను చెప్తాను అంటారు. అలా చెప్తే మీ జాబ్ అని కావేరి అంటే ఓ మనిషిని కాపాడటం కంటే జాబ్ ముఖ్యం కాదు అని నేను నిర్దోషిగా విడిపిస్తానని కూతుర్ని స్కూల్‌లో డ్రాప్ చేయడానికి వెళ్తారు.
నాగవల్లి వస్తూ ఉంటుంది. బాలరాజుకి కచ్చితంగా శిక్ష పడుతుందని అనుకుంటుంది. తర్వాత కావేరి, చిన్నిలను పైకి పంపించాలి అనుకుంటుంది. ఇంతలో కావేరి నాగవల్లి ఒకరికి ఒకరు ఎదురుపడతారు. ఇద్దరూ గొడవపడతారు. ఒకర్ని ఒకరు ఏమే ఏంటే అని అనుకుంటారు. నీ మొగుడు బయటకి వస్తాడు అని అనుకుంటున్నావా ఇంకా నమ్మకం ఉందే నీకు అని నాగవల్లి అంటే నీ మొగుడి ఆటలు సాగుతాయి అని నువ్వు అనుకుంటున్నావా అని కావేరి అడుగుతుంది. దానికి నాగవల్లి నా అక్కని చంపినట్లు నువ్వు బయట పడినట్లు నీ అన్నని చంపిన కేసులో నీ భర్త బయటకు రాడు నీ భర్తకి శిక్ష పడిన తర్వాత నీకు నీ కూతురికి నేను మరణ శిక్ష వేస్తా నీ కళ్ల ముందే నీ కూతుర్ని చంపేస్తా అంటే కావేరి నాగవల్లి గొంతు పట్టేస్తుంది. నువ్వు నీ మొగుడు చేసిన దుర్మార్గాలకు మిమల్ని ఎప్పుడో చంపేసేవాళ్లం కానీ మహి ముఖం చూసి వదిలేశాం తొందర్లోనే ఎవరు ఏంటో అర్థమవుతుంది ఈ లోపు ఎలాంటి ఎక్స్ట్రాలు చేయొద్దని కావేరి అంటుంది.
కోర్టు దగ్గర లాయర్, చిన్ని, ఆఫ్ టికెట్, కావేరి ఉంటారు. బాలరాజుని తీసుకొని పోలీసులు రాగానే చిన్ని బాలరాజుని పట్టుకొని ఏడుస్తుంది. నాన్న నువ్వు నిర్దోషిగా బయటకు వస్తావు నాన్న అని దేవుడి బొట్టు తండ్రికి పెడుతుంది. చేతికి తాడు కడుతుంది. నీకేం కాదు అని కావేరి చెప్తుంది. కోర్టు సీన్ మొదలవుతుంది. కావేరి, చిన్ని చాలా టెన్షన్ పడతారు. బాలరాజుని బోనులో నిల్చొపెడతారు. వాదనలు మొదలవుతాయి. బాలరాజు సత్యంబాబుని చంపేశాడని తాజాగా నలుగురు రౌడీలను బెయిల్ మీద ఉన్న బాలరాజు కొట్టాడని గతంలో నేర చరిత్ర పెద్దదే అని పేపర్ చూపిస్తారు. బెయిల్ మీద వెళ్లి ఎందుకు రౌడీలతో తిరిగావ్ రౌడీలను ఎందుకు కొట్టావ్ అని బాలరాజుని జడ్జి ప్రశ్నిస్తారు.
బాలరాజు మనసులో ఆ మెమోరీ కార్డు మిస్ అవ్వకపోయి ఉంటే జడ్జికి మొత్తం చెప్పేవాడిని అని అనుకుంటాడు. ఇక పీపీ సరళ చెప్పిన సాక్ష్యాన్ని వీడియో రికార్డ్ చేసి జడ్జి ముందు ఉంచుతాడు. సరళ బాలరాజు నీచుడని వాడి వల్లే మా కుటుంబం నాశనం అయిపోయిందని తన ఆడపడుచు కావేరిని ఆస్తి కోసం తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకున్నాడని సరళ కథ మొత్తం చెప్తుంది. కావేరి చావుకి కూడా బాలరాజే కారణం అని అంటుంది. బాలరాజుకి ఉరి శిక్ష వేయాలని సరళ కోరి ఏడుస్తుంది. బాలరాజుకి శిక్ష పడేలా ఉంది ఇంకా కానిస్టేబుల్ రాలేదు ఏంటా అని కావేరి అతనికి కాల్ చేస్తుంది. ఫోన్ స్విఛ్ ఆప్ వస్తుంది. తర్వాత ఆయన కాల్ చేసి 5 నిమిషాల్లో కోర్టు దగ్గర ఉంటానని చెప్తారు. లాయర్ హరి బలమైన సాక్షి ఉన్నారని 5 నిమిషాలు గడువు అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తి అయిపోతుంది.
Also Read: రాఘవని కలిసి ఎమోషనలైన ఆనంద్.. లొకేషన్‌కి చేరుకున్న రాజు, రూపలు.. ఏం జరుగుతుంది?





















