Chinni Serial Today June 10th: చిన్ని సీరియల్: దేవాని పెళ్లి చేసుకోనున్న వల్లి.. మీ అక్కని చంపింది మీ బావే.. వల్లికి నిజం చెప్పిన కావేరి!
Chinni Today Episode చిన్ని గడియారం తన ఫ్రెండ్స్‌కి చూపించడం లోహిత దాన్ని కొట్టేయడం మహికి అనుమానం వచ్చి ప్లాన్ వేసి తిరిగి చిన్నికి ఇప్పించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode బాలరాజు కావేరి మీద తన ప్రేమను చెప్పడానికి కావేరికి కొత్త చీర గిఫ్ట్ ఇచ్చి తర్వాత పూలతో ఐలవ్‌యూ అని రాస్తాడు. టిఫెన్ కూడా సిద్ధం చేస్తాడు. కావేరి హ్యాపీగా ఫీలవుతుంది. మహిని నాగవల్లి, ప్రమీల స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారు. మహి ఇద్దరికీ ముద్దు పెట్టి లోపలికి వెళ్తాడు.
మహిని చూసి నాగవల్లి బాధ పడుతుంది. ప్రమీల నాగవల్లి మహికి అన్నీ ఉన్నాయి కానీ అమ్మ లేదు. అమ్మ లేని లోటు తీర్చాలి అందుకు నేను ఓ ఆలోచన చేశాను అంటుంది. ప్రమీల కూడా ఎగ్జైట్ అవుతూ నేను ఓ ఆలోచన చేశాను అంటుంది. ఏంటి అని ఒకర్ని ఒకరు అడుగుతారు. నాగవల్లికి మొదటగా చెప్పమని ప్రమీల అంటుంది. దాంతో నాగవల్లి తాను బావని పెళ్లి చేసుకొని మహికి తల్లి అవుతా అని అంటుంది. ప్రమీల షాక్ అవుతుంది. నాగవల్లి ఏమైంది అని అడిగితే నాకు వచ్చిన ఆలోచనే నీకు వచ్చింది అంటుంది. అంటే నువ్వు బావని పెళ్లి చేసుకోవాలి అనుకున్నావా అని వల్లి అడిగితే బామ్మర్ది గారిని నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను. నాకు కూడా మీ ఇద్దరికీ పెళ్లి చేయాలి అనే ఆలోచన వచ్చింది అంటుంది. దానికి నాగవల్లి మేం ఇద్దరూ కలిసి బయటకు వెళ్తే నీకు ఇష్టం లేదు అన్నట్లు సెటైర్లు వేసేదానివి కదా అంటే అలా అయినా మీ ఇద్దరి మనసులో పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన వస్తుందని అలా అన్నాను అంటుంది. దేవా తనని పెళ్లి చేసుకుంటాడో లేదో అని వల్లి అంటే ఇద్దరం ఒప్పిద్దామని అనుకొని వెళ్తారు. అదంతా విన్న ఓ టీచర్ మహి వాళ్ల పిన్నిది చాలా గొప్ప మనసు మహి చాలా అదృష్టవంతుడు అనుకుంటుంది.
చిన్ని మహి ఇచ్చిన గిఫ్ట్ చూస్తూ ఉంటుంది. తన ఫ్రెండ్స్ అందరూ గిఫ్ట్ చాలా బాగుందని అంటారు. మహి చిన్ని దగ్గరకు వచ్చి ఏంటి చిన్ని నేను నీకు ఫ్రెండ్లీగా ఇచ్చిన గిఫ్ట్ అందరికీ చూపిస్తున్నావ్ అంటాడు. దానికి చిన్ని ఏం నా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ నేను అందరికీ చూపించకూడదా అంటుంది. ఇక అదంతా చాటుగా చూసిన లోహిత బ్యాగ్‌లో చిన్ని గిఫ్ట్ ఎవరూ చూడకుండా తీసేస్తుంది. మహి చిన్నితో గిఫ్ట్ జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా అందరికీ చూపించడం ఏంటి అంటాడు. దానికి చిన్ని నేను జాగ్రత్తగా ఉంచుకున్నా అంటుంది. దానికి మహి జాగ్రత్త అంటే జిప్పు వేయకుండా చూడటమా అంటాడు. చిన్ని బ్యాగ్ చూస్తే అందులో గడియారం లేదు అని ఏడుస్తుంది. ఎవరో కొట్టేసుంటారని మహి అని చుట్టూ చూస్తాడు. లోహిత మహిని చూసి అనుమానంగా పారిపోతుంది. మహికి లోహిత మీద అనుమానం వస్తుంది.
కావేరి స్కూల్‌కి వస్తే ఓ టీచర్ కావేరి దగ్గరకు వచ్చి నాగవల్లి దేవాని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుందని చెప్తుంది. కావేరి షాక్ అయి వెంటనే విషయం బాలకి చెప్తుంది. ఆ దుర్మార్గుడి గురించి తెలీక పెళ్లికి రెడీ అయిపోయింది అని బాల అని అయినా నీ మీద పగ పెంచుకున్న తను ఏం చేస్తే నీకు ఎందుకు అని బాల అంటాడు. దానికి కావేరి నేను తన అక్కని చంపాను అని నా మీద నాగవల్లికి కోపం ఉంది కానీ తను చాలా మంచిది. అక్క కొడుకు కోసం రెండో పెళ్లి వాడిని కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది తను ఈ పెళ్లి చేసుకోకుండా ఆపాలి అని అంటుంది. తన ప్లాన్ బాలకి చెప్తుంది.
మహి లోహిత గడియారం తీసిందని తన ఫ్రెండ్స్‌ని లోహిత దగ్గరకు తీసుకెళ్తాడు. కావాలనే చిన్ని గడియారం పోయిందని ప్రిన్సిపల్‌కి కంప్లైంట్ ఇచ్చిందని టీచర్ అందరి బ్యాగ్స్ చెక్ చేసి పనిష్మెంట్ ఇస్తారని గడియారం తీసుకున్న వాళ్లు చెట్టు దగ్గర పెట్టేయాలి అని చెప్పిస్తాడు. భయపడిపోయిన లోహిత దాన్ని చెట్టు దగ్గర పడేస్తుంది. మహి దాన్ని తీసుకొని చిన్నికి ఇస్తాడు. చిన్ని చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఇక చిన్నిమహిల దగ్గరకు వాళ్ల ఫ్రెండ్స్ వచ్చి మీ పిన్ని మీ నాన్నని పెళ్లి చేసుకుంటుంది చెప్తారు. మహి చాలా సంతోషపడతాడు. చిన్ని మహితో నువ్వు చాలా అదృష్టవంతుడివి పిన్ని నీకు అమ్మలా వస్తుందని అంటుంది.
నాగవల్లి దేవాతో విషయం చెప్తుంది. వల్లి ఎంత చెప్పినా దేవా వద్దని అంటాడు. నాగవల్లి దేవాతో మనకు పిల్లలు పుడితే మహిని నిర్లక్ష్యం చేస్తా అనుకుంటున్నావ్ కదా అసలు నేను పిల్లల్నే కనను అని చెప్తుంది. ప్రమీల వచ్చి మీ గురించి మహి గురించి నాగవల్లి కంటే ఇంకెవరూ అర్థం చేసుకోరు నాగవల్లిని చేసుకోండి అంటే దేవా నేను నాగవల్లిని చేసుకోను అని అంటాడు. నాగవల్లికి మంచి సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తా అంటాడు. ప్రమీల వల్లితో మనమే ఏదో ఒకటి చేద్దాం అని అంటుంది. నాగవల్లి ప్రమీలని హగ్ చేసుకొని తప్పుగా అర్థం చేసుకున్నా సారీ అంటుంది.
బాలరాజు ఆఫ్ టికెట్‌తో కావేరి వచ్చిన తర్వాత మాకు చిన్ని పని ఉంది నువ్వు చిన్నిని జాగ్రత్తగా చూసుకో అని అంటాడు. ఇంతలో కావేరి చిన్ని వస్తారు. చిన్ని తల్లిదండ్రులకు నాగవల్లి దేవాని పెళ్లి చేసుకుంటుందని చెప్తుంది. బాలరాజు, కావేరి ఇద్దరూ నాగవల్లిని కలుస్తారు. మీ అక్కని మీ బావనే చంపేశాడని కావేరి చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ, విహారిల రహస్యం ఆదికేశవ్‌కి తెలిసిపోతుందా.. క్షణక్షణం ఉత్కంఠ!





















