Chinni Serial Today july 26th: చిన్ని సీరియల్: బాలరాజుకి పూర్వ వైభవం వస్తుందా.. దేవాపై ప్రతీకారం తీర్చుకుంటాడా? మహి జ్ఞాపకాల్లో చిన్ని!
Chinni Serial Today Episode july 26th మహి, మధులు ఒకరికి తెలీకుండా ఒకరు ఆంజనేయ స్వామి గుడికి బయల్దేరడం లోహిత మధుని ఇబ్బంది పెట్టాలని వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మహి తన ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఉంటే మధు వచ్చి మహిని ప్రేమగా చూస్తూ మహి ఎదురుగా నిల్చొంటుంది. మత్తులో ఉన్న తనకు మహి రాత్రి సేవలు చేయడం గుర్తు చేసుకొని నిన్న నువ్వు నా చేసిన సాయానికి థ్యాంక్యూ బాస్ అంటుంది. బాస్‌నా నిన్నటి వరకు పిల్లి గడ్డం అన్నావ్ తోడ ముడిచిన పిల్లిలా అయిపోయావ్. సారీలు థ్యాంక్స్‌లు చెప్పి నాకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నావేమో.. నీకు నిన్న సాయం చేసింది నీతో మంచోడిని అనిపించుకోవడానికి కాదు.. నీ ప్లేస్‌లో ఎవరు ఉన్నా నేను అలాగే చేస్తా నాదృష్టిలో నువ్వు వెజిటేబుల్వే అని అంటాడు. అయితే నువ్వు పిల్లిగడ్డానివే అని వెళ్లిపోతుంది చిన్ని.
ఇంతలో లెక్చరర్ వచ్చి టాపర్‌ల పేర్లు చేప్తారు. టాప్ 2 గా mvn వర్మ (మహి) వస్తాడు. టాప్ 1 గా మధుమిత వస్తుంది. మహి తన ఫ్రెండ్‌తో నేను ఫస్ట్ వస్తా అనుకున్నా కానీ ఈ వెజిటేబుల్‌కి ఇంత సీన్ ఉందా అని అంటాడు. తర్వాత క్లాస్ స్టార్ట్ అవుతుంది. మధుని చూసి మహి దీనికి నిజంగా అంత సీన్ ఉందా అంటే లోహిత విని ఎవరితోనే రాయించేసుంటుంది మ్యాడీ అంటుంది. మధు ఆ మాటలు విని నాతో ఈ ఫస్ట్ సెమ్‌లో పోటీ పడండి మీ ఇద్దరిలో ఒక్కరికైనా నా కంటే ఒక్కమార్కు ఎక్కువ వచ్చినా మీరు గెలిచినట్లే అని ఛాలెంజ్ చేస్తుంది.
మరోవైపు బాలరాజు తిరుగుతూ రోడ్డు మీద టీ తాగుతాడు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతుంటే విని దేవేంద్ర వర్మ మినిస్టర్ అని నాగవల్లి ఇంకా పవర్ ఫుల్ అయిందని తెలుసుకుంటాడు. దేవా ద్రాక్షారామంలో ఉంటున్నాడని తెలుసుకుంటాడు. దేవా ఫొటోని చూసి రాజకీయాల్లో అంత ఎత్తుకి ఎదిగిపోయావ్ ఇప్పుడు నిన్ను అంతం చేయడానికి నా శక్తి సరిపోదు. నీ కోసం చాలా శక్తి పోగేసుకుంటా. నన్ను ఇలా నరకయాతనలో పడేసిన నన్ను వదలనురా.. నీకు నీ పెళ్లానికి ఖర్మకాండ జరిపించకుండా వదలను.. నా చిన్నిని నా కావేరిని నాకు దూరం చేశావ్ అసలు బతికున్నారో లేదో తెలీదు నిన్ను వదలను.. నీకు నరకం చూపిస్తా నీ ప్రాణం పోయేది నా చేతిలోనే అని అంటాడు.
మధు చిన్నప్పుడు మహి ఇచ్చిన గడియారం పట్టుకొని కాలేజ్‌లో చూస్తుంటుంది. అది చూసి మహి నిన్నూ ఈ జ్ఞాపకాలను ఈ ఊరిని అన్నీ మర్చిపోవాలని అనుకుంటున్నా కానీ మర్చిపోలేకపోతున్నా ఈ మధ్య ఎక్కువ గుర్తొస్తున్నావ్ మనం మళ్లీ కలిస్తే బాగున్ను చందు లోహిత నేను కూడా కలిస్తే బాగున్ను అని అనుకుంటుంది. ఇక వెనకాలే ఉన్న మహి తన ఫ్రెండ్‌తో ఈ రోజు నేను ఓ స్పెషల్ పర్సన్‌ని కలుస్తానురా ఇప్పుడే ఆస్ట్రాలజీ అప్డేట్ వచ్చింది అని ఫోన్ చూసి సంతోషంగా చెప్తాడు. అది చిన్నినే అయింటుంది కదా అంత కంటే నాకు స్పెషల్ పర్సన్ ఎవరూ లేరు కదా అని అనుకుంటాడు.
మధు హనుమాన్ గుడికి వెళ్లి పూజారికి అడిగితే వాళ్ల గురించి తెలుస్తుందని అనుకుంటుంది. ఇక మహి కూడా హనుమాన్ గుడికి వెళ్తే చిన్ని కలుస్తుందేమో అని అనుకొని వెళ్తాడు. మరోవైపు వరుణ్ కాలేజ్‌కి వస్తాడు. అది చూసిన లోహిత ఎదురెళ్లి నా కోసమే వచ్చావా అంటే కాదు శ్రేయ కోసం వచ్చానని చెప్పి రికార్డ్ ఇస్తాడు. ఇక లోహిత వీకెండ్ ప్లాన్స్ అడుగుతుంది. వరుణ్ రెండు మీటింగ్స్ ఉన్నాయని తర్వా ఫ్యామిలీ డిన్నర్ అని చెప్తాడు. లోహిత తనని పిలవమని అంటుంది. వరుణ్ పిలుస్తాడు. నువ్వు ఎప్పుడు పిలుస్తావ్ అంటే లోహిత షాక్ అయిపోతుంది. అమ్మ ఇండియాలో ఉంటే అన్నయ్య ఉండడు అన్నయ్య ఉంటే అమ్మ ఉండదు మేం ముగ్గురమే తిని చాలా డేస్ అయింది అని తమది చాలా బిజీ ఫ్యామిలీ అని కట్టు కథలు అల్లేస్తుంది. తర్వాత లోహిత మధు హడావుడిగా వెళ్లడం చూస్తుంది.. ఎక్కడికి వెళ్తుందో బయటే దీని సంగతి తేల్చుతా అని ఫాలో అయిపోతుంది. ఇక మహి కూడా వెళ్తాడు. లోహిత తన ఫ్రెండ్ కారు తీసుకొని వెళ్తూ ఇద్దరు రౌడీలకు కాల్ చేసి రమ్మని చెప్తుంది. మహి గుడికి వెళ్తాడు. చిన్నని గుర్తు చేసుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ఆదిత్య-దేవాల పోరాటం.. మిథునని తండ్రి తీసుకెళ్లిపోతాడా? సత్యమూర్తి దేవాకి ఏం చెప్పాడు?





















