Chinni Serial Today August 2nd: చిన్ని సీరియల్: మధు తల పగలగొట్టేసిన రౌడీలు.. కండీషన్ సీరియస్.. తల్లదిల్లిపోతున్న మహి!
Chinni Serial Today Episode August 2nd మధు తల మీద రౌడీలు కొట్టేయడం మహి మధుని హాస్పిటల్‌కి తీసుకురావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మహి చిన్ని కోసం దగ్గర్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ చూస్తూ ఉంటాడు. అదే ఏరియాలో మధుమిత కూరగాయలు అమ్ముతుంటుంది. కొందరు రౌడీలు కావాలనే మధు బండిని గుద్ది మధుతో గొడవ పడతారు. మధు కూరగాయలు అన్నీ పడేసి.. మధు చేయి పట్టుకొని లాగేస్తారు.
మధు ఆ రౌడీని లాగిపెట్టి ఒక్కటిస్తుంది. దాంతో వాడు నన్నే కొడతావా అని మధుని కొట్టడానికి చేయి ఎత్తుతాడు. ఇంతలో మహి వచ్చి రౌడీలను చితక్కొడతాడు. ఫైట్ మధ్యలో మహి రౌడీ చేతిని మడత పెట్టేసి ఆ రౌడీ చేతితోనే తన జుట్టుని సరిచేసుకుంటూ నవ్వే సీన్ సినిమా హీరో ఎంట్రీ రేంజ్‌లో చాలా బాగుంటుంది. ఓ రౌడీ మహిని నెట్టేయడంతో బైక్ హ్యాండిల్ మహి కంటి పైన తగిలిపోతుంది. మహికి రక్తం వస్తుంది. ఇంతలో మరో రౌడి మధు తల మీద కర్రతో కొట్టేస్తాడు. మ్యాడీ.. మ్యాడీ అంటూ మధు కుప్పకూలిపోతుంది. మధు మధు అంటూ మహి మధుని పట్టుకుంటాడు.
మధుకి తల నుంచి రక్తం కారిపోతుంటుంది. మహి చాలా కంగారు పడతాడు. మహి ఫ్రెండ్ రాహుల్‌ని ఆటో తీసుకురమ్మని చెప్తాడు. దగ్గర్లో ఆటో లేకపోవడంతో మహి మధుని ఎత్తుకొని తీసుకొని పరుగులు పెట్టి ఓ ఆటోని చూసి ఆపి మధుని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తాడు. మధు నీకేం కాదు అని చెప్తూ ఉంటాడు. హాస్పిటల్‌లోకి మధుని ఎత్తుకొని పరుగులు పెడతాడు. డాక్టర్ మధుని ఐసీయూలోకి తీసుకెళ్తుంటే మధు చేతి తాడుకి మహి చేతి తాడు అతుక్కుంటుంది. మధు మ్యాడీ... మ్యాడీ అని పిలుస్తుంటే మహి అలా చూస్తూ ఉండిపోతాడు. మహి చేతులు మీదగా మధు లోపలికి వెళ్లడం ఒకరి చేయి ఒకరు తాకడం.. సీతారామం సినిమాలో నేనే నీ నేనే గాలిలో తాకుతున్న స్పర్శలో.. అనే సాంగ్ బ్యౌగ్రౌండ్‌లో రావడం చాలా ఎమోషనల్‌గా ఉంటుంది.
మహి ఐసీయూ బయట నిల్చొని మధుని చూసి చాలా భయపడతాడు. ఇంతలో రాహుల్ అక్కడికి రావడంతో రేయ్ మధుకి ఏం కాదు కదరా.. తన పాటికి తాను కూరగాయలు అమ్ముకుంటుంటే ఎవర్రా తన మీద అటాక్ చేసింది.. తగకు దెబ్బ తగిలింది.. చాలా రక్తం వచ్చేసింది.. రేయ్ ఏం కాదు కదరా మధుకి.. చెప్పరా అంటే ఏం జరగదులేరా అని రాహుల్ అంటాడు. ఇక మధు రాహుల్‌తో మహి ఫ్యామిలీకి విషయం చెప్పమని అంటాడు.
ఇక ఓ డాక్టర్ మహిని చూసి నాగవల్లి వాళ్ల కొడుకు కదా అని అనుకుంటుంది. నాగవల్లికి కాల్ చేసి మీ మ్యాడీ మా హాస్పిటల్‌లో కనిపించాడని అంటుంది. ఏమైంది మా మ్యాడీకి అని నాగవల్లి చాలా కంగారు పడుతుంది. 5 నిమిషాల్లో వచ్చేస్తా అంటుంది. మరోవైపు మధు ఫ్యామిలీ, పద్దు హాస్పిటల్‌కి వస్తారు. అందరూ ఏడుస్తుంటారు. మధుకి ఏం కాకూడదని మొక్కుకుంటారు. హాస్పిటల్‌లోకి వచ్చి మధుకి ఎలా ఉందని అంటే లోపల ట్రీట్మెంట్ జరుగుతుందని మహి చెప్తాడు. మా మధు లేకపోతే మేం బతకలేం బాబు.. మా బిడ్డని కాపాడిన మీరు మాకు దేవుడు అని అంటారు.
మధు నా క్లాస్ మెట్ అని మహి అంటాడు. గ్లాస్ నుంచి చూసి సుబ్బు వాళ్లు ఏడుస్తారు. నర్సు వచ్చి తలకు బాగా గాయం అయింది అర్జెంటుగా రక్తం ఎక్కించాలని.. మధుది ఏబీ బ్లడ్ గ్రూప్ అది దొరకలేదని చెప్తుంది. నాదీ సేమ్ గ్రూప్ నేను ఇస్తానని మహి అంటాడు. సుబ్బు మహికి చేతులు జోడించి దండం పెట్టి మీ మేలు మర్చిపోలేను బాబు మీరు మా పాలిట దేవుడు బాబు అని మహి కాళ్ల మీద పడతారు. మీరు పెద్ద వాళ్లు అలా చేయకూడదండీ అని మహి రాహుల్‌కి వాళ్లని అప్పగించి బ్లడ్ ఇవ్వడానికి వెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















