Nindu Manasulu Serial Today August 2nd: నిండు మనసులు సీరియల్: సవతి ఇంట్లో భర్తని చూసి గుండె పగిలేలా ఏడ్చిన ఈశ్వరి.. గణపై పగపట్టేసిన విజయానంద్!
Nindu Manasulu Serial Today Episode August 2nd ఇందిర ఈశ్వరి ఇంటికి వెళ్లి భర్తని చూసి గుండె పగిలేలా ఏడ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ఇందిర ఈశ్వరి కార్‌ని ఫాలో అవుతూ ఇంటికి వస్తుంది. అక్కడ ఇందిరని సుధాకర్ చూసి నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని నాకు ముందే తెలుసే అక్క.. నీకు దండం పెడతా ఇంటికి వెళ్లిపోవే అని బతిమాలుతాడు. కానీ ఇందిర మాత్రం మీ బావని ఎలా అయినా ఈ రోజు చూడాల్సిందేరా అని పట్టు పడుతుంది.
సుధాకర్‌ని ఈశ్వరి చూసి సుధా అని పిలుస్తుంది. గణ తల్లి పిలుపుతో సుధాకర్ ఫ్యూజులు ఎగిరిపోతాయి. వణికిపోతాడు. ఇందిరను అక్కడే ఉండమని సుధాకర్ లోపలికి వెళ్తాడు. ఇక్కడేం చేస్తున్నావని ఈశ్వరి అడిగితే గణ సార్‌కి ఫైల్ ఇవ్వడానికి వచ్చానని చెప్తాడు. ఇంతలో ఈశ్వరి ఈవిడెవరు అని అంటుంది. సుధాకర్ తన అక్క లోపలికి రావడం చూసి బిత్తరపోతాడు. అది ఈవిడ.. ఈవిడ అంటూ సుధాకర్ తడబడతాడు. ఇక ఈశ్వరి ఇంతకు ముందు నేను చూసింది ఈమెనే కదా అంటుంది. ఎవరితో వచ్చింది ఈవిడ అని అడిగితే నాకు తెలీదు అని సుధాకర్ అంటే నీతోనే వచ్చాను కదా తమ్ముడు అని ఇందు ఇరికించేస్తుంది.
ఇక పనిమనిషి రాజశేఖరానికి సేవలు చేయలేకపోతున్నా అని తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే ఈశ్వరి భర్త కాలు చూసి షాక్ అయిపోతుంది. సుధాకర్ ఈశ్వరితో పని చూడమని ప్రాణం తీసేస్తుందమ్మా మీరు ఏమైనా పని ఇస్తారేమో అని తీసుకొచ్చా అంటాడు. ఈశ్వరి మనసులో ఈ పని మనిషి ఎప్పుడు మానేస్తుందో తెలీదు.. ఈమెను పెట్టుకుంటే బెటర్ అనుకొని నెంబరు ఇవ్వండి అవసరం అయినప్పుడు పిలుస్తా అని చెప్తుంది. ఇందిర నెంబరు చెప్తుంటే ఫోన్ తీసుకొస్తా అని మేడ మీద గదికి వెళ్తుంది. నేను మీ బావ దగ్గరకు వెళ్లి వస్తానురా అని ఇందిర అంటుంది. నన్ను చంపేయాలి అనుకుంటున్నావా అక్క మేడం గారు వస్తారే వద్దే అంటే ఇందిర వినకుండా పరుగులు తీస్తుంది.
మంచం మీద ఉలుకు పలుకు లేకుండా పడున్న రాజశేఖరాన్ని చూసి ఇందిర వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏమండీ ఏం జరిగిందండీ.. ఎందుకు ఇలా ఉన్నారండీ ఏమైంది అండీ అని ఏడుస్తుంది. మేడం వచ్చేలా ఉన్నారు అక్కా వచ్చేయ్‌వే అని బయట సుధాకర్ అనుకుంటూ టెన్షన్ పడుతుంటాడు. ఇందిర ఏడుస్తూ మీరు కట్టిన తాళికి విలువ లేదంటండీ.. మన బంధానికి వీళ్లకి సాక్ష్యాలు కావాలంట అండీ అని ఏడుస్తుంది. ఇందిర మాటలకు రాజశేఖరం కంటి నుంచి నీరు వస్తాయి. ఇంతలో ఈశ్వరి రావడం చూసి నా శవానికి దండ పడిపోయింది ఇక నేను చచ్చానురా అని సుధాకర్ గజగజ వణికి పోతాడు. ఇంతలో ఇందిర వచ్చేస్తుంది. ఈశ్వరి నెంబరు తీసుకుంటుంది. వస్తానమ్మా అని ఇందిర అంటే రావొద్దు అవసరం అయితే నేను పిలుస్తా అని ఈశ్వరి అంటుంది.
సుధాకర్ ఇందిరను తీసుకొని బయటకు వెళ్తుంటే గణ ఎంట్రీ ఇస్తాడు. సుధాకర్ చూసి ఓ రేంజ్‌లో వణుకుతూ వచ్చాడు.. వచ్చాడు.. వచ్చేశాడు అని వణికిపోతుంటాడు.. భయంతో కళ్ల గుడ్లు బయటకు పెట్టేస్తాడు. ఇందిర చూసి ఇతన్ని ఎక్కడో చూశానే అని ఎవర్రా అని అడుగుతుంది. మాట్లాడకే ప్లీజే అని సుధాకర్ అంటాడు. మళ్లీ ఇందిర అడగటంలో నీ సవతి కొడుకే చాలా అంటాడు. ఇందిర షాక్ అవుతుంది. గణ రాగానే సుధాకర్ విష్ చేస్తాడు. ఈవిడ ఎవరు అని గణ సైగ చేస్తే సుధాకర్ ఏం అర్థం కానట్లు ఏంటి సార్ అంటాడు. ఈవిడ ఎవరు అని గణ అంటాడు. పని కోసం వచ్చింది సార్ అమ్మగారు మాట కూడా ఇచ్చారు అంటాడు.
ఇందిరను సుధాకర్ తీసుకెళ్తుంటే గణ పిలుస్తాడు. నీకు అప్పగించిన పనులు తప్ప అన్ని పనులు చేస్తుంటావు కదా సుధా.. ఆ ప్రేరణ తల్లి, చెల్లి ఎక్కడ ఉన్నారో కనుక్కోమన్నాను కాదా.. వాళ్ల ఆచూకి కనిపెట్టావా అంటే అదే పనిలో ఉన్నాను అని సుధాకర్ అంటాడు. వాళ్లు ఎక్కడా కనిపించడం లేదు సార్ పారిపోయి ఉంటారు అంటే.. గణ సుధా కాలర్ పట్టుకొని తను ఇక్కడే ఉంది ఈ సిటీలోనే తిరుగుతుంది. జేఆర్ ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చింది నన్నే సవాలు చేసింది సుధా అని అంటాడు. చాలా ఎక్కువ మాట్లాడింది.. దాని సవాలు ఎలా తిప్పి కొట్టాలో దాని భవిష్యత్ ఎలా నాశనం చేయాలో నాకు తెలుసు. కానీ దాని ఫ్యామిలీ ఎక్కడుందో నువ్వే కనిపెట్టాలి సుధా అని గణ చెప్తాడు. సుధా కనిపెట్టతే నీ ఉద్యోగం ఎలా పీకాలో నాకు తెలుసు అని అంటాడు. గణ మాటలకు ఇందిర షాక్ అయిపోతుంది.
విజయానంద్ ఫ్రీ కోచింగ్ పేరుతో తనకు పోయిన పరువు గుర్తు చేసుకొని రగిలిపోతూ ఉంటాడు. ఈ విజయానంద్‌కి ఘోరంగా అవమానం జరిగింది అని అంటాడు. ఒక వైపు నుంచి కాదు సార్ అన్ని వైపుల నుంచి మీకు ఈరోజు బ్యాండ్ బాజా మోగిపోయింది సార్.. ఓవైపు సిద్ధూ బాబు. మరోవైపు ఆ అమ్మాయి.. ఇక మినిస్టర్ ఏకంగా కాంట్రాక్ట్‌లు అన్నీ నో చెప్పేశారు దెబ్బ మీద దెబ్బ తగిలిందని విశ్వం అంటాడు. పోయిన పరువు మీ కాంట్రాక్ట్ తిరిగి రావాలి అంటే మీ పవర్ చూపించాలి అంటాడు. ఇవన్నింటికి ఆ గణ కారణం కదా వాడితో ఆట మొదలెడతా.. ఇక వాడి పని పట్టాలి అని విజయానంద్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















