Illu Illalu Pillalu Serial Today August 2nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్: వల్లీ ప్రెగ్నెంట్? షాక్ లో రామరాజు, భాగ్యం! అసలు నిజం తెలిస్తే నవ్వాగదు!
Illu Illalu Pillalu Serial Today Episode August 2nd వల్లీ నెల తప్పిందని ప్రేమ, నర్మదలు ఇంట్లో వాళ్లకి నమ్మించి భాగ్యాన్ని ఇంటికి రప్పించి ఆమెను ఫాలో అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode నర్మద, ప్రేమలు శ్రీవల్లి తల్లిదండ్రుల్ని ఇంటికి రప్పించి వాళ్లు తిరిగి ఇంటికి వెళ్లినప్పుడు ఫాలో అయి వాళ్ల ఇళ్లు ఎక్కడో తెలుసుకొని శ్రీవల్లి పుట్టింటి బాగోతం తెలుసుకోవాలని ప్లాన్ చేస్తారు. అందుకే జీడిపప్పు ఉప్మా చేసి వల్లి నోరూరించి మొత్తం వల్లీ తినేలా చేస్తారు.
శ్రీవల్లి మొత్తం తినేసిన తర్వాత ఇక అసలు డ్రామా మొదలు పెడతారు. అక్క ఇక ఎక్కువ టైం ఉండదు.. చావడం ఖాయం.. యముడు వచ్చి తీసుకెళ్లిపోతాడు.. ఇలా శ్రీవల్లిని వణికించేస్తారు. ఏమైందో అర్థం కాక వల్లి అమాయకంగా ముఖం పెట్టి నా ప్రాణాలు పోవడం ఏంటి అని అడుగుతుంది. దాంతో ప్రేమ బొద్దింక పడిన ఉప్మా తిన్నావు కదా అక్క ఇక నీకు చావే అంటుంది. వల్లి గుండె ఆగినంత పని అయిపోతుంది. అచ్చ బాబోయ్ నాకు దరిద్రం ఇట్టా పట్టేసిందేంట్రా దేవుడా అని తల బాదుకొని తిన్నది వాంతి చేసుకోవడానికి పరుగులు పెడుతుంది.
నర్మద ప్రేమతో అసలు కథ ఇప్పుడు మొదలు పెడదాం పద అని ఇంట్లో అందర్ని పిలుస్తారు. వేదవతి వచ్చి అంటే అన్నాను కానీ ఎందుకే పొద్దున్న అలా అరుస్తారు అని అంటుంది. దాంతో నర్మద, ప్రేమలు వాంతులు చేసుకుంటున్న వల్లిని చూపిస్తారు. వల్లి నెల తప్పిందని చెప్తారు. వేదవతి మురిసిపోతుంది. ఇక చందుని తమ్ముళ్లు, తిరుపతి ఆటపట్టిస్తారు. అందరూ వల్లీ దగ్గరకు వెళ్తారు. అత్తయ్యా అది అని వల్లి అంటే వేదవతి సరదాగా చెప్పారమ్మా మొత్తం చెప్తారు.. నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. ఇదేంటి ఉప్మా తిన్నాను అంటే సంతోషం అంటున్నారు అని వల్లి అనుకుంటుంది.
ఇంతలో రామరాజు వచ్చి ఏమైంది అని అడిగితే వల్లీ నెలతప్పింది అని వేదవతి చెప్తుంది. వల్లీ బిత్తర పోతుంది. రామరాజు వల్లీ తల నిమిరి.. నన్ను తాతని చేస్తున్నావ్.. చాలా సంతోషంగా ఉందమ్మా అని చందుని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. ఇక వల్లీ నిజం చెప్పాలని రామరాజు దగ్గరకు పరుగులు తీస్తుంటే ప్రేమ, నర్మదలు ఆపి నువ్వు ఒట్టి మనిషివి కాదు పరుగెత్తకూడదు.. నిల్చొకూడదు అని కంగారు పెట్టి కూర్చొపెట్టి చీర కొంగులతో విసురుతూ వల్లీని కదలనివ్వరు. వేదవతితో వల్లి పుట్టింటి వాళ్లకి విషయం చెప్పమని అంటుంది. వేదవతి భాగ్యానికి విషయం చెప్పి త్వరగా వచ్చేయమని అంటుంది.
భాగ్యం భర్తని గిరగిరా తిప్పేసి మన అమ్మడు నెల తప్పింది అని చెప్తుంది. మరో ఇడ్లీ పుడుతున్నాడని ఆనంద్ రావు గెంతులేస్తాడు. మన అమ్మాయికి ఇప్పుడే పెత్తనం వచ్చేసింది.. ఇప్పుడు మన అమ్మాయి మొదట బిడ్డని ఇవ్వబోతుంది అని సంబర పడతారు. గెటప్‌లు మార్చేసి రామరాజు ఇంటికి బయల్దేరుతారు. భాగ్యం, ఆనందరావు వాళ్ల డొక్కు ఇడ్లీ బండి మీద వెళ్తూ ఇలా వెళ్లామంటే ఆ రామరాజు మన అంతు చూస్తాడు. అందుకే ఈ బండి కాస్త దూరంలో పెట్టి కొబ్బరి కమ్మలు కప్పేసి నడుచుకుంటూ వస్తారు.
వల్లీని చూసి సంబర పడిపోతారు. వల్లీని మాట్లాడనివ్వకుండా ఇద్దరు కోడళ్లు ముందు వచ్చినా నా కోడలే ముందు నెల తప్పింది అని అంటుంది. ఆనంద్ ఇడ్లీ, దోసె అంటూ మాట్లాడుతారు. తిరుపతి ఆనంద్‌తో నీకు ఇడ్లీ దోసె తప్ప ఇంకేం మాటలు రావా అంటాడు. ఇక భాగ్యం వేదవతితో వదిన గారు మా అమ్మాయే మీ ఇంటి మహాలక్ష్మీ అని మీకు ఇప్పటికైనా అర్థమైందా అని అంటుంది. వల్లి అమ్మ ఇంక ఆపు అని అరుస్తుంది. కడుపుతో ఉన్నావ్ అలా అరుస్తావేంటే అని భాగ్యం అంటే కడుపు లేదు కాకరకాయ లేదు ఆగమ్మా అని వల్లి అంటుంది. అందరూ షాక్ అయిపోతారు.
వల్లి అందరితో తనకు నెలతప్పడం వల్ల వాంతులు కాలేదని బొద్దింక పడిన ఉప్మా తినడం వల్ల వాంతులు అయ్యావని.. నర్మద, ప్రేమలు ఉప్మా పెట్టారు అంటుంది. వెంటనే నర్మద అక్క నువ్వు నెల తప్పలేదని మా మీద తప్పు తోసేస్తావా అని అడుగుతుంది. నువ్వు తిన్నా ఉప్మానే మేం తిన్నాం మాకు వాంతులు కావాలి కదా.. మరి మాకు వాంతులు ఎందుకు కాలేదు. అయినా మేం నీకు ఎందుకు బొద్దింక పడిన ఉప్మా పెడతాం. నువ్వు మమల్ని ఎంత కోప్పడ్డా మేం మాత్రం నిన్ను మా సొంత అక్కలా చూసుకుంటున్నాం అని ప్రేమ, నర్మద అంటారు. వాళ్ల మాటలకు వల్లీ షాక్ అయిపోతుంది.
రామరాజు కోపంగా ఏంటి వల్లీ ఈ అర్థంపర్థం లేని మాటలు అంటాడు. దాంతో వల్లీ నేను భయపడి వాంతులు చేసుకున్నా అంటుంది. నువ్వు నిజంగా నెలతప్పావని మేం సంబర పడిపోయాం అని వేదవతి అంటుంది. నానమ్మ అవ్వాలన్న నా ఆశలు అన్నీ ఆవిరి అయిపోయావి చూస్తూ ఉండండి అంటుంది. ఇక భాగ్యం చందుని చూసి ఇక్కడే ఉంటే అల్లుడు గారు పది లక్షల కోసం అడుగుతారు అని చందుని మాట కూడా మాట్లాడనివ్వకుండా భర్తని తీసుకొని భాగ్యం పారిపోతుంది.
నర్మద, ప్రేమలు గేటుకి ఎదురెళ్లి నిల్చొంటారు. భాగ్యం షాక్ అయిపోతుంది. ఇద్దరూ భాగ్యం దగ్గరకు వెళ్లి ఏంటి పారిపోతున్నావ్ అని నర్మద అడుగుతుంది. మాకు పని ఉంది అని భాగ్యం వెళ్లిపోతుంది. నన్ను రోడ్డు మీదకి లాగుతా అంటారా ఇప్పుడు మిమల్ని రోడ్డు మీదకి లాగుతా.. నా టైం బాలేదు అన్నావా.. ఇప్పుడు మీ టైం ఎలా ఉందో చూపిస్తా అని అంటుంది. ఆనంద్ రావు, భాగ్యం వాళ్ల బండి మీద వెళ్తుంటే ప్రేమ, నర్మదలు స్కూటీ మీద వెళ్తారు. చాలా బిల్డప్ ఇచ్చారు కదా ప్రేమ ఎలా డొక్కు బండి మీద వెళ్తున్నారో చూడు అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















