Chinni Serial Today April 4th: చిన్ని సీరియల్: సత్యంబాబు కావేరిని కలవకుండా ఆపేసిన లాయర్ చెప్పిన నిజం ఏంటి?
Chinni Today Episode తండ్రి ఆబ్దికానికి ఉష అలియాస్ కావేరి ఆయనకు ఇష్టమైన వంటలు చేయడంతో సత్యంబాబు ఉషనే కావేరి అని తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్ని రాజు దగ్గరకు వచ్చి అమ్మకు నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అయిపోవాలి నాన్న అని చెప్తుంది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకొని నవ్వుకుంటారు. చిన్ని నాన్నకి ముద్దు పెట్టి బాయ్ చెప్తుంది. రాజు కూడా కూతుర్ని ప్రేమగా దగ్గరకు తీసుకొని ముద్దు పెడతాడు. మీ ఇద్దరికీ కలపడానికి చిన్ని చాలా ప్రయత్నిస్తుంది అన్న అని రాజుతో రాజు ఫ్రెండ్ చెప్తాడు. అది జరగని పనిరా ఆ విషయం చిన్నీకి తెలియడం లేదని రాజు అంటాడు.
రాజు, కావేరిల పెళ్లి రోజు..
కావేరి తండ్రి, అన్నయ్యకు చెప్పకుండా ఇంటి నుంచి పారిపోయి రాజుతో తనకు జరిగిన పెళ్లిని గుర్తు చేసుకొని బాధపడుతుంది. కావేరి పారిపోయి పెళ్లి చేసుకోవడం తన తండ్రి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం గుర్తు చేసుకుంటుంది. కావేరి ఏడుస్తుంటే భారతి వచ్చి ఏమైందని అడుగుతుంది. ఈ రోజు నేను మర్చిపోలేని రోజు ఆంటీ ఆ దుర్మార్గుడు బాలరాజు నా జీవితం నాశనం చేసిన రోజు అని ఏడుస్తుంది. ఇక బాల రాజు దగ్గరకు ఆఫ్ టికెట్ గాడు వచ్చి ఏంటి అన్నా ఇలా ఉన్నావ్ అని అడుగుతాడు. దానికి రాజు ఈ రోజు మా పెళ్లి రోజురా అని చెప్తాడు. పెళ్లి రోజు అయితే ఆనందంగా ఉండాలి కానీ బాధ పడతావేంటి అన్న అంటే ఈ రోజు మా మామయ్య గారు చనిపోయిన రోజు అని కూడా అంటాడు.
తండ్రిని పొట్టన పెట్టుకున్న కూతురు..
ఆ నీచుడిని పెళ్లి చేసుకోవడం వల్లే మా నాన్న చనిపోయారు ఆంటీ తండ్రిని పొట్టన పెట్టుకున్న కూతురిలా మిగిలిపోయానని ఏడుస్తుంది. బాధ పడుతూ కిందకి వెళ్లే సరికి బాలరాజు తండ్రి ఫొటో పెట్టి దీపం వెలిగించి నివాళులు అర్పిస్తారు. ఉషని చూసి చిన్ని ఏడ్వొద్దని సైగ చేసి లోపలికి రమ్మని చెప్తుంది. సరళ ఉషతో ఈయన గారి చెల్లి మా ఇంటి పెద్దాయన్ని అర్థాంతరంగా పోయేలా చేసిందని అంటుంది. ఇంటి విషయాలు తనకు ఎందుకు అని సత్యం బాబు అంటే.. మీ చెల్లిలా ఉంటాను అంటారు కదా నాతో చెప్తే ఏంటి ప్రాబ్లమ్ అని అంటుంది కావేరి.
మీ నాన్నని చంపిన చెల్లి మీద కోపం లేదా..
ఉష సత్యంతో బ్రో మీ చెల్లి మీ నాన్న గారి చావుకి కారణం అయింది అన్నారు కదా మరి మీకు మీ చెల్లి మీద కోపం లేదా అని అడుగుతుంది. దానికి సత్యం బాబు బాధ ఉంటుంది కానీ కోపం ఎందుకు ఉంటుందమ్మా నా పిల్లలు తప్పు చేస్తే ఎలా క్షమిస్తానో అలాగే నా చెల్లి కావేరి ఏం తప్పు చేయలేదు తన మీద ఎలా కోపం పెంచుకుంటాను. నేనేమైనా సాయం చేయాలా అని ఉష అడిగితే సరళ వద్దని అంటుంది. పిల్లలు టీచరమ్మ సాయం తీసుకోమని అంటారు. సత్యంబాబు కూడా సరే అంటాడు. దాంతో సరళ ఏం అనకుండా ఊరుకుంటుంది.
తండ్రి ఆబ్దికానికి కావేరి వంటలు..
తండ్రి ఆబ్దికం కోసం కావేరి అందరితో కలిసి రకరకాల వంటలు చేస్తుంది. చేసిన వంటలు పట్టుకొని ఎమోషనల్ అవుతుంది. అందరూ కలిసి రకరకాల పిండి వంటలు చేస్తారు. పెద్దాయన ఫొటో దగ్గర పెట్టి దండం పెట్టుకుంటారు. కావేరి దండం పెట్టుకుంటూ నాన్న మీ ఆబ్దికం రోజు మీకు నచ్చిన అన్నీ నా చేతితో నేనే చేశాను నాన్న అని ఏడుస్తూ వెళ్లిపోతుంది. ఇక అప్పుడే సత్యం బాబు వస్తాడు.
అచ్చం కావేరి చేసినట్లుందే..
అన్ని రకాల పిండి వంటలు చూసిన సత్యం బాబు సరళతో ఇంతకు ముందు ఎప్పుడూ నువ్వు ఇవి చేయలేదు కదా ఇప్పుడు ఎలా చేశావు అంటే మీ చెల్లెలు కాని చెల్లెలు చేసిందని సరళ చెప్తుంది. సత్యం బాబు మనసులో నాన్నకి ఇష్టమైన వంటకాలు ఉషకి ఎలా తెలుసు అని అనుకుంటాడు. తర్వాత దండం పెట్టుకొని ఆలోచిస్తాడు. ఆబ్దికం అయిపోయిన తర్వాత వంటలు రుచి చూస్తాడు. వాటిని తిని అచ్చం నా చెల్లి కావేరి చేసినట్లు ఉందేంటి అనుకుంటాడు. నాన్నకి నచ్చిన వంటలు ఉష చేయడం ఏంటి? ఉష వంటలు చేస్తే కావేరి చేసినట్లు రావడం ఏంటి? ఒకవేళ కావేరినే ఉషలా వచ్చిందా అని ఉష ఇంటికి పరుగులు తీస్తాడు.
ఉషనే నా చెల్లా..
కావేరి తండ్రి ఫొటో పట్టుకొని నా వల్లే నాన్న నా వల్లే మీరు చనిపోయారు. మీరు చూసిన సంబంధం చేసుకోకుండా బాలరాజుతో వెళ్లిపోవడం వల్లే మీరు చనిపోయారని ఏడుస్తుంది. మీ చావుకి కారణం అయినందుకే చేయని పాపానికి జైలులో శిక్ష అనుభవించానని.. పదేళ్ల తర్వాత మొదటి సారి మీ ఆబ్దికానికి నా చేతితో వంట చేశానని ఏడుస్తుంది. తోడ పుట్టిన అన్నయ్య కడుపున పుట్టిన చిన్ని అందరూ నా వల్ల ఇబ్బంది పడుతున్నారని కావేరిలా వాళ్లని ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు ఉషలా కూడా ఇబ్బంది పెడుతున్నానని ఏడుస్తుంది. నేను నిర్దోషిలా నిరూపించుకుంటేనే కావేరిగా పరిచయం అవుతానని ఎప్పుడు నేను అన్నయ్య అని పిలుస్తాను.. ఎప్పుడు చిన్నితో నోరారా అమ్మ అని పిలిపించుకుంటానో ఇలాంటి బతుకు బతికే కంటే చనిపోయి ఉంటే బాగున్ను అని ఏడుస్తుంది. తను నా చెల్లి కావేరి తను నా చెల్లి కావేరి అని సత్యంబాబు ఏడుస్తాడు.
ఇప్పుడేం చేయాలి..
సత్యం బాబు సంతోషంతో మెట్ల మీద కూలబడిపోతాడు. ఇప్పుడేం చేయాలి. అజ్ఞాతంలో ఉన్న నా చెల్లిని ఉషలా వదిలేయాలా కావేరిలా ఉంచాలా అనుకుంటాడు. తనని కావేరి గానే ఉంచుతానని అనుకొని కావేరి దగ్గరకు పరుగులు తీస్తాడు. ఇంతలో లాయర్ కాల్ చేసి దేవేంద్ర ఉషని కావేరి అనుకొని ఇదంతా చేసినట్లు అనిపిస్తుందని దేవేంద్ర పెద్ద దుర్మార్గుడని జైలులో ఫైర్ యాక్సిడెంట్ కూడా వాడే చేసుంటాడని అనుమానంగా ఉందని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: మాధవి కొడుకుని కిడ్నాప్ చేసిన రాజు.. సీఎం మీద మాధవి అత్యాచార నింద వేస్తుందా!





















