Chinni Serial Today April 16th: చిన్ని సీరియల్: "అమ్మానాన్న ఉన్న అనాథని.. మా నాన్న ఆటోడ్రైవర్ అని చెప్పుకోగలను నాన్న"
Chinni Today Episode దేవా సత్యంబాబు దగ్గరికి వెళ్లి ఉష గురించి ఆరా తీయడం సత్యంబాబు ఫ్యామిలీని టార్గెట్ చేసి కావేరికి నరకం చూపించాలని నాగవల్లితో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్నిని నేను స్కూల్‌కి తీసుకెళ్తా అంటే నేను తీసుకెళ్తా అని కొట్టుకుంటారు. చిన్నిని పంపను అని రాజు అంటే ఉష ఆటో కీ విసిరేసి చిన్నిని తీసుకొని వెళ్లిపోతుంది. దాంతో బాలరాజు, చందు, లోహితలు కీ వెతికి ఆటోలో వెళ్తారు. మరోవైపు మహి స్కూల్‌కి వెళ్లను అని మారాం చేస్తాడు.
సత్యంబాబు ఫ్యామిలీని టార్గెట్ చేయాలి..
దేవా ఏమైందని అడిగితే ప్రమీల దేవాతో మహికి అవార్డు వచ్చిందని అది తీసుకోవడానికి పేరెంట్స్ వెళ్లాలి అని చెప్పడంతో మిమల్ని ఇబ్బంది పెట్టలేక మహి స్కూల్‌కి వెళ్లను అంటున్నాడు అని ప్రమీల చెప్తుంది. దాంతో దేవా స్కూల్‌కి వస్తానని చెప్తాడు. నాగవల్లి బావతో మన ఉమ్మడి శత్రువు గురించి ఏం ఆలోచించావని దేవాని అడుగుతుంది. దానికి దేవా అది కావేరి అయినా పీటీ ఉషఅయినా సరే దానికి నరకం చూపించి కుక్క చావు చచ్చేలా చేయాలి అని అలా చేయాలి అంటే సత్యంబాబు ఫ్యామిలీని టార్గెట్ చేయాలని చెప్తాడు. ఆ ఫ్యామిలీని నువ్వో వైపు నుంచి నేను ఓ వైపు నుంచి నరుక్కురావాలని తన ఐడియా నాగవల్లికి చెప్తాడు. వల్లి ఐడియా సూపర్ అని అంటుంది.
మీరు మీ హబ్బీనే కదా..
ఉష స్కూల్‌కి వెళ్లడంతో ఓ టీచర్ ఉషని పలకరిస్తుంది. కంగ్రాట్స్ చెప్తుంది. ఎందుకు అని ఉష అడిగితే మీరు పెళ్లి చేసుకోబోతున్నారు కదా అని అంటుంది. అదేంటి అని ఉష అడిగితే పేపర్‌లో రాజు, ఉషల ఫొటో చూపిస్తుంది. కాబోయే దంపతులు కాబట్టే కలిసి కల్యాణం చేశారని అంటే అంత సీన్ లేదు అని చెప్తుంది.
నాన్న ఆటో వెనక చిన్ని పరుగులు..
చిన్నితో ఓ టీచర్ నువ్వు కూడా ఎక్సలెన్స్ అవార్డు తీసుకుంటావ్ కదా ఇలాంటి ప్రౌడ్ మూమెంట్‌లో మీ వాళ్లు వచ్చి నీ పక్కన ఉంటే బాగున్ను అంటుంది. దాంతో చిన్ని తన మామయ్యని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదని అత్త కూడా బిజీగా ఉందని అంటుంది. ఇక చిన్ని రాజు కోసం పరుగున వెళ్తుంది. ఆటో వెనక పరుగులు పెడుతుంది. రాజు అద్దంలో చూసి చిన్ని దగ్గరకు పరుగులు పెడతాడు. తనకు అవార్డు వచ్చిందని చిన్ని రాజుతో చెప్తుంది. తనతో పాటు రాజుని స్కూల్‌కి రమ్మని చెప్తుంది. కూతురు అవార్డు తీసుకుంటున్నప్పుడు నాన్న పక్కన ఉండాలి కదా అంటుంది.
మీ నాన్న నేను అని చెప్తావా..
రాజు చిన్నితో అలా అయితే నేను మీ నాన్న అని స్కూల్‌లో తెలిసిపోతుంది. అలా తెలీకూడదు అది చాలా ప్రమాదకరం అని అంటాడు. చిన్ని అవన్నీ కుదరదు అని నువ్వు రావాలి అంటుంది. అమ్మ పక్కనే ఉన్న చెప్పుకోలేను. నాన్న ఉండి కూడా చెప్పుకోవద్దా అని బాధ పడుతుంది. నువ్వు మా నాన్న అని ఎందుకు చెప్పుకోకూడదు నాన్న.. మా నాన్న ఆటో డ్రైవర్ అని చెప్పుకోవడానికి నేనేం ఫీల్ అవ్వను నాన్న నేను చాలా సంతోషంగా ఉంటాను అంటుంది. నేను మీ నాన్న అని తెలిస్తే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయని బాలరాజు చెప్తాడు. కారణం చెప్పు అని చిన్ని బాలరాజుని అడుగుతుంది. పరిస్థితి అర్థం చేసుకోకుండా విసిగించకు చిన్ని అని రాజు అంటాడు.
అమ్మానాన్న ఉన్న అనాథని..
అమ్మానాన్న ఉన్న కూడా నేను అనాథని అని అందరి ముందు అమ్మని అమ్మా అని నాన్నని నాన్న అని పిలవలేని దురదృష్టవంతురాలిని అని అర్థమైందని ఏడుస్తుంది. రాజు చిన్నిని దగ్గరకు తీసుకొని నువ్వు చాలా మంది కంటే అదృష్టవంతురాలివి అని అంటాడు. నేను వస్తానులే అని అంటాడు. దాంతో చిన్ని వద్దులే ఏదో ప్రమాదం అన్నావ్ అంటుంది. దాంతో రాజు ఏం పర్లేదులే ఎన్ని ప్రమాదాలు వచ్చినా ఎదుర్కొంటా ఎన్ని సమస్యలు వచ్చినా పరిష్కరించుకుంటా అని అంటాడు. చిన్నీతో పాటు స్కూల్ లోపలికి వెళ్తాడు.
సత్యంబాబుని ఎంక్వైరీ చేసిన దేవా..
దేవా సత్యంబాబు టైలరింగ్ షాప్ దగ్గరకు వెళ్తాడు. సత్యం దేవాకి కూర్చోడానికి టేబుల్ వేస్తాడు. దేవా సత్యంబాబుని నువ్వు నేను ఫ్రెండ్స్ అంటే మీ లాంటి గొప్పోలు మాకు ఫ్రెండ్ ఏంటి అని అంటారు. దానికి దేవా మన పిల్లలు ఫ్రెండ్స్ అయితే మనం కూడా ఫ్రెండ్సే కదా ఈ అంతస్తు ఏంటి అని అడుగుతాడు. ఇక దేవా తన కంపెనీలో వర్కర్స్‌కి బట్టలు కుట్టే పని మీకు ఇస్తున్నా అని అంటాడు. ఇక ఉష గురించి మాట్లాడుతాడు. ఎంతో అదృష్టం ఉంటే అలాంటి చెల్లి, కూతురు ఉండాలి అని దేవా అంటాడు. సత్యంబాబు ఎమోషనల్‌గా మాట్లాడితే దేవా మనసులో కచ్చితంగా అది కావేరినే అనుకుంటాడు. సత్యంబాబు రామ్మోహన్ రావు, రాజేశ్వరి గారు అదృష్టవంతులు అని ఉష అమ్మానాన్న గురించి చెప్తాడు. వాళ్లు డెహ్రాడూన్‌లో ఉంటారు అని చెప్తాడు. సత్యంబాబు దగ్గర ఏం సమాచారం రాలేదని దేవా వెళ్లిపోతాడు.
చిన్ని పక్కన మీరు ఉండరా..
ప్రిన్సిపల్ మేడం పిల్లలు వాళ్ల తల్లిదండ్రులతో పర్సనల్‌గా మాట్లాడుతుంది. ఉష ప్రిన్సిపల్ మేడం దగ్గర సంతకం తీసుకోవడానికి వెళ్తుంది. తర్వాత ఉష వెళ్లిపోతుంటే ప్రిన్సిపల్ మేడం వెళ్లి చిన్ని అవార్డు తీసుకుంటే తల్లిగా మీరు పక్కన ఉండరా అని అంటుంది. ఆ అదృష్టం నాకు లేదని మనం ఇక్కడ ఏం మాట్లాడినా నేను కావేరి అని తెలిసిపోతుందని అంటుంది. దాంతో పీటీ టీచర్ గానే నువ్వు చిన్ని పక్కన ఉండు అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: "మీరంతా కలిసి నా భర్తకి ఈ పరిస్థితి తీసుకొచ్చారు.. జీవితంలో నీ ముఖం చూపించకు"





















