Brahmamudi Serial Weekly Roundup September 1st to 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్: గత వారం జరిగిన బ్రహ్మముడి సీరియల్ ఏపిసోడ్స్ హైలెట్స్ ఓసారి చూద్దాం.
Brahmamudi serial Weekly episode September 1st to 6th: బ్రహ్మముడి సీరియల్ గత వారం చాలా ఆసక్తికరంగా జరిగింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Brahmamudi Serial Weekly Episode: తాను ఎంత దూరం పెట్టినా తనను కావ్య మనఃస్పూర్తిగా ప్రేమించిందని కావ్య దగ్గరకు వెళ్లి రాజ్ ఎమోషనల్ అవుతుంటాడు. ఎలా ప్రేమించగలిగావు.. ఇప్పటికీ కూడా నీ ప్రేమే గొప్పదని నిరూపించుకున్నావు అంటూ రాజ్ బాధపడుతుంటాడు. ఎందుకు కళావతి ఎందుకు ఇదంతా చేస్తున్నావు.. అందుకే ఇప్పుడు చెప్తున్నాను కళావతి కొండంత నీ ప్రేమ ముందు నా ప్రేమ అణువంతం నీ ముందు ఓడిపోయింది కళావతి. గతంలో నేను చేసిన తప్పులను క్షమిస్తావా..? తిరిగి నన్ను అంతే ప్రేమిస్తావా..? అని రాజ్ ఏడుస్తూ అడగ్గానే కావ్య కూడా ఏడుస్తూ వెళ్లి రాజ్‌ను హగ్ చేసుకుంటుంది.
తర్వాత రాజ్, కావ్యను మెట్ల మీద నడవొద్దని ఎత్తుకుని వెళ్లడం అప్పు, కళ్యాణ్ చూస్తారు. అప్పు కూడా తనను అలా ఎత్తుకుని పైకి తీసుకెళ్లమని అడుగుతుంది. కళ్యాణ్ బలవంతంగా అప్పును పైకి తీసుకెళ్తాడు. రోజూ ఈ పైకి మోసే భారం తగ్గాలంటే ఏం చేయాలని రాజ్, కళ్యాణ్ ఆలోచిస్తారు. కింద రూముల్లో ఉన్న అమ్మానాన్నలను పైకి పంపిద్దాం అని ప్లాన్ చేస్తారు. టూర్ ప్లాన్ చేశామని అబద్దం చెప్పి వారిని పైకి వెళ్లండి అని చెప్తారు. వాళ్లు షాక్ అవుతారు.
తర్వాత రాజ్ తాను యామిని దగ్గరకు ఎలా వెళ్లానని కావ్యను అడుగుతాడు. దీంతో కావ్య.. జరిగిన విషయం మొత్తం చెప్తుంది. గతంలో మీరు ఆ యామిని ప్రేమ పావురం కదా..? ఆ చాన్స్‌నే అడ్వాంటేజ్‌గా తీసుకుని మీకు యాక్సిడెంట్ అవ్వగానే మీరు ఆ యామినికి మేనబావ అని మీ అమ్మనాన్నలు చిన్నప్నుడే చనిపోతే వాళ్లే చేరదీసి పెంచారని మిమ్మల్ని నమ్మించింది. తర్వాత చేయాల్సినవన్నీ చేసింది అంటూ కావ్య ఎమోషనల్ అవుతుంది. దీంతో రాజ్ కోపంగా యామిని ఇంత చేస్తుంటే నువ్వెందుకు ఊరుకున్నావు.. అయినా ఇప్పుడే యామినిని చంపేస్తాను అంటూ రాజ్ ఆవేశంగా యామిని ఇంటికి వెళ్తాడు. వెనకాలే కావ్య వెళ్తుంది. రాజ్ రావడం చూసిన కావ్య ఎదురుగా వెళ్లి తాను చేసింది తప్పేనని తనను క్షమించమని కాళ్ల మీద పడుతుంది. దీంతో రాజ్ కోపంగా యామినికి వార్నింగ్ ఇచ్చి ఇంటికి వెళ్తాడు.
ఇంట్లో వినాయక చవితి గ్రాండ్‌గా జరిపించాలని ఇందిరాదేవి చెప్తుంది. అప్పుడే బయటి నుంచి వచ్చిన రాజ్, కావ్య కూడా చాలా అంటే చాలా గ్రాండ్ గా చేసుకుందామని కావ్య చెప్తుంది. అయితే రుద్రాణి సెటైర్లు వేస్తుంది. రుద్రాణికి వినాయక పండుగ గొప్పతనం గురించి కావ్య క్లాస్ తీసుకుంటుంది. ఇందిరాదేవి కూడా రుద్రాణిని తిడుతుంది. ఇంతలో కనకం, మూర్తి వస్తారు.
ఇక అందరూ కలిసి గ్రాండ్‌గా పండుగ చేసుకుందామని హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటే కావ్య బయటకు వెళ్తుంది. వెనకే వెళ్లిన రాజ్ ఏమైందని అడుగుతాడు. అప్పుడు కావ్య రేవతి గురించి చెప్తుంది. వెంటనే అక్కను చూడాలని రాజ్ రేవతి ఇంటకి వెళ్తాడు. కావ్య కూడా వెళ్తుంది. రేవతికి రాజ్‌కు గతం గుర్తుకు వచ్చిందని కావ్య చెప్తుంది. అందరూ మాట్లాడుకున్న తర్వాత వినాయక చవితి పూజకు ఇంటికి రావాలని రాజ్ చెప్పి వెళ్లిపోతాడు.
హాస్పిటల్‌లో ఉన్న అప్పు, కళ్యాణ్‌కు డాక్టర్ భయంకరమైన వార్త చెప్తుంది. కావ్య గర్బసంచి వీక్‌గా ఉందని తొమ్మిది నెలలు బిడ్డను మోయలేదని అంత వరకు మోస్తే తల్లికి పిల్లకు డేంజర్ అని చెప్తుంది. డాక్టర్ మాటలకు అప్పు, కళ్యాణ్ షాక్ అవుతారు. అదే బాధతో ఇంటికి వస్తారు. అప్పటికే ఇంది దగ్గర గణపతి విగ్రహం చేసిన రాజ్ ను కావ్య ఆట పటిస్తుంది. దీంతో ఇద్దరూ నవ్వుతూ ఉంటారు. వాళ్లను చూసిన అప్పు బాధగా లోపలికి వెళ్లి దేవుడి ముందు నిలబడి ఎమోషనల్ అవుతుంది. కళ్యాణ్ వచ్చి అప్పును ఓదారుస్తాడు.
ఇంట్లో గణపతి పూజకు ఏర్పాట్లు జరుగుతుంటాయి. అపర్ణ, కావ్యను పలిచి నెక్లెస్ ఇస్తుంది. ఇంతలో అక్కడకు వచ్చిన రుద్రాణి కోడలు ప్రెగ్నెంట్ అని గిఫ్ట్ ఇస్తున్నావా.. వదిని అని అడుగుతుంది. రుద్రాణిని కావ్య, అపర్ణ తిడతారు. రుద్రాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత పూజ చేయడానికి వచ్చిన పంతులు ఇంకా టైం ఉందని ఇంట్లో వాళ్ల చేతులు చూసి జాతకాలు చెప్తుంటాడు. అలాగే కావ్య చేయి చూసి కావ్య ఇద్దరు పిల్లలు ఉన్నారని మొదట అమ్మాయి పుడుతుందని చెప్తుంటాడు. ఇంతటితో గడిచిన వారం బ్రహ్మముడి అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















