అన్వేషించండి

Brahmamudi November 18th Today Episode : అర్ధరాత్రి అరుణ్, స్వప్నలను చూసేసిన రాజ్, కావ్య !

Brahmamudi Serial Today Episode : స్వప్న అరుణ్ ఒంటరిగా మాట్లాడుకోవడం రాజ్ చూసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Brahmamudi Serial November 18th Episode : కావ్య రాజ్‌ను కవ్విస్తున్నట్లు కవితలు చదువుతుంటే రాజ్‌ కోపంతో కావ్య దుప్పటి లాగేస్తాడు. ఇక రాజ్‌ సీరియస్‌గా నీకు నాకు మధ్య ఎప్పటికీ ఏ బంధం, సంబంధం ఉండదు అని తేల్చిచెప్తేస్తాడు. ఎలా ఉండదో నేనూ చూస్తానని కావ్య అనుకుంటుంది. 

స్వప్న: అరుణ్ కాల్ చేస్తా అని మెసేజ్ పెట్టాడు. ఇంకా చేయలేదు ఏంటి. సరిగ్గా రాహుల్ ఉన్న టైంలో చేస్తాడో ఏంటో. నాకెందుకీ ఖర్మ. తప్పులు చేసినప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు. ఏ తప్పు చేయకుండానే వీడికి భయపడాల్సి వస్తుంది. 

రాహుల్: ఏంటి లేటు ఎక్కడ ఉన్నావ్.. వచ్చేశావా.. సరే నేను చెప్పినట్లు గేటు లోపలికి వచ్చి స్వప్నకి కాల్ చేసి గార్డెన్ ఏరియాలోకి రమ్మని చెప్పు.

అరుణ్: అది నేను చెప్తే రాదు సార్.. నా మాట వినే మనిషి అయితే నేనే పెళ్లి చేసుకునేవాడిని కదా..

రాహుల్: ఇప్పుడు పిలువు వస్తుంది. తన ఫొటోలు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తుంది. 

స్వప్న: (అరుణ్ ఫోన్ చేస్తాడు) అసలు నీకు బుద్ధి ఉందా.. ఫొటోలు ఎందుకు పంపించావు. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది. నీతో కలిసి తిరిగినంత మాత్రానా నీ ఫొటోలు పంపిచేస్తావా. అని చాలా తిడుతుంది. మర్యాదగా ఇంటికి వచ్చి రాంగ్ అడ్రస్‌ అని చెప్పి ఫొటోలు తీసుకెళ్లు.

అరుణ్: (ఆ తిట్లు భరించలేక ఫోన్ దూరంగా పెట్టి) ఈ పిచ్చిది నేను చెప్పిన మాట వినదు అని చెప్పినా రాహుల్ సార్ నమ్మలేదు. ఇప్పుడేమో ఇది చాలా తిడుతుంది. అనుకుంటాడు. ఏంటి ఇందాక నుంచి నా ఫొటో నా ఫొటో అంటున్నావ్ ఏంటి మన ఇద్దరం ఉన్న ఫొటోలు కూడా పంపించాను కదా నేను చెప్పేది పూర్తిగా విను. నేను మీ ఇంటి ముందే ఉన్నాను. కిందకి రా నీతో మాట్లాడి విషయం చెప్పి వెళ్లిపోతాను.

స్వప్న: ఏంట్రా వచ్చేది ఇదేమైనా నా నాన్న ఇళ్లు అనుకున్నావా. నా కాపురం నాశనం అయిపోతుంది. 

అరుణ్: ఈ ఒక్కసారికి రా..  లేదంటే నేనే మీదకు వస్తా..

స్వప్న: చంపేస్తా నువ్వు లోపలికి వస్తే. నేనే వస్తున్నా.. 

రుద్రాణి: రాహుల్ ఇదే రైట్ టైం నువ్వు రాజ్‌ను బయటకు తీసుకొచ్చి స్వప్నను అరుణ్‌ని చూసేలా చెయ్. తర్వాత జరగాల్సింది దానంతట అదే జరుగుతుంది. 

రాజ్ గది వరకు వెళ్లిన రాహుల్ ఈ టైంలో రాజ్‌ను లేపి ఫూల్ అవ్వడం ఎందుకు అని వేరు ప్లాన్ వేస్తాడు. మరోవైపు స్వప్న అరుణ్‌ని కలుస్తుంది. గట్టిగా చెంపదెబ్బ కొడుతుంది. అది చూసిన రాహుల్.. అమ్మో ఇది పెద్ద ఫైర్‌ బ్రాండ్ డబ్బు లేకున్నా క్యారెక్టర్ ఉంది. నాకు క్యారెక్టర్ లేకున్నా డబ్బే ముఖ్యం కదా.. ఇప్పుడు కానీ రాజ్‌ని తీసుకొచ్చుంటే స్వప్న మీద మంచి అభిప్రాయం ఏర్పడేది అనుకుంటాడు. ఇక రాహుల్ రాజ్‌కి కాల్ చేసి బాల్కానీకి పిలుస్తాడు

మరోవైపు స్వప్న ఎందుకు వచ్చావ్ అని అరుణ్‌ని అడుగుతుంది. దీంతో అరుణ్ ఐ లవ్ యూ అంటాడు. దీంతో స్వప్న ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు నాకు పెళ్లయింది. ఇది చెప్పడానికి ఈ టైంలో వచ్చావా అంటుంది. మరోవైపు కావ్య వారిద్దరూ మాట్లాడుకోవడం చూస్తుంది. ఇక రాజ్ రాహుల్ దగ్గరకు వచ్చి ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు అంటాడు. మరోవైపు రాజ్ స్వప్న, అరుణ్ మాట్లాడుకోవడం చూసి ఈ టైంలో స్వప్న అబ్బాయితో మాట్లాడుతుందేంటా అని అనుకుంటాడు. ఎవరు అతను అనుకుంటాడు. విషయం తెలుసుకోకుండా తప్పుగా ఆలోచించడం తప్పు అని అక్కడి నుంచి వెళ్లి పోతాడు రాజ్.  

కావ్య: ఏంటక్కా ఇది ఒకటి పోతే ఇంకొటి అన్నట్లు ఏదో ఒక సమస్యను నెత్తిన వేసుకోవడం నీకు సరదా అయిపోయిందా. అరుణ్ ఇక్కడ ఏం చేస్తున్నాడు. అదికూడా ఇంత రాత్రి పూట. నీకేమైనా పిచ్చా నీవ్వు అత్తారింట్లో ఉన్నావు. నీకో మొగుడు ఉన్నాడు. ఇలా వెళ్లి పాత ఫ్రెండ్స్‌ని అర్ధరాత్రి పూట కలుస్తున్నావు అంటే ఏమంటారు తెలుసా. 

స్వప్న: ఒక్కసారి తప్పు చేశాకదా అని అన్ని సార్లు నాదే తప్పు అంటే నేను ఊరుకోను. వాడో పిచ్చోడు వాడు ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు అంట. రాహుల్ నన్ను సరిగి చూసుకోవడం లేదని నేను ఒప్పుకుంటే తిరిగి పెళ్లి చేసుకుంటా అని చెప్పడానికి వచ్చాడు. వాడు అలా అనుకుంటే కూడా నా తప్పే అవుతుందా. 

కావ్య: ఏంటి నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడా. నువ్వేం చెప్పకుండానే వాడికి ఆ ఆలోచన ఎలా పుట్టుకొచ్చింది. ఇన్నాళ్లుగా పట్టించుకోని వాడు ఇప్పుడు సడెన్‌గా వచ్చి ఇలా ఎందుకు మాట్లాడుతాడు. కలిసినప్పుడు అడగాలి కదా. నాకు చెప్పకుండా కలవడం మాత్రం వచ్చా. నువ్వు తెలివైన దానివి అనుకుంటావ్ కానీ నిజంగా తింగరి దానివి. నా మీద అరవమంటే ఆరు అడుగులు లేస్తావ్. బయట వాళ్ల ముందు మాత్రం అరఅంగులం లేవలేవు. 

స్వప్న: వాడికి నేను సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చాను. ఇకపై వాడు నా జోలికి రాడు. నువ్వు అంత కంగారు పడాల్సిన పని లేదు. 

కావ్య: ఇన్ని రోజులు నువ్వు నీ లైఫ్‌ని ఏం చేసుకుంటావో అని కంగారు పడేదాన్ని. కానీ ఎప్పుడైతే నువ్వు ఇంట్లో అందరి ముందు నీ తప్పులో నన్ను భాగం చేశావో అప్పుడే నిన్ను వదిలేశాను. ఇకపై నువ్వు ఏ తప్పు చేసినా నేను ఊరుకోను. ఈ ఇంట్లో వాళ్లకంటే ముందు నేనే నీకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది. 

స్వప్న: అది కాదు కావ్య. నేను నిజం చెప్తున్నానే. ఆ రోజు పెళ్లి చెడిపోయిన తర్వాత వాడితో నేను ఇప్పటి వరకు మాట్లాడలేదు. సడెన్‌గా ఎందుకు వచ్చాడో తెలీదు. పెళ్లి చేసుకుంటా అని ఎందుకు అన్నాడో అర్ధం కాలేదు. అందుకే నేనే వెళ్లి వార్నింగ్ ఇచ్చా. అసలే ఇంట్లో అందరూ నా మీద కోపంగా ఉన్నారు. అందుకనే ఇలా దొంగతనంగా కలవాల్సి వచ్చింది. నిజం చెప్తున్నా కావ్య ఇందులో నేను ఏం తప్పు చేయలేదు. అయినా ఒక్కసారి ఆలోచించు నా గురించి నీకు బాగా తెలుసు కదా. చదువుకునే రోజుల్లోనే వాడు రిచ్ కాదు అని మొహం కూడా చూసేదాన్ని కాదు. అలాంటిది ఇప్పుడు ఎందుకు తప్పు చేస్తాను. నేను కోరుకొని గొడవ పడి మరీ ఎందుకు ఈ ఇంటికి కోడలిగా వచ్చాను. అలాంటప్పుడు అలాంటి వాళ్లతో నేనేందుకు మాట్లాడుతాను. 

కావ్య: ఇదొక్కటి నిజం చెప్పావ్ అందుకే నిన్ను నమ్మి వెళ్తున్నా మళ్లీ ఇలాంటిది రిపీట్ అయితే నేను ఊరుకోను. వాడు మళ్లీ వస్తే నాకు చెప్పు.

స్వప్న: తప్పకుండా చెప్తా కావ్య నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు..

కావ్య: అంత నటించకు. నీకు చెప్పమని అడుగుతున్నది నిన్ను కాపాడటానికి కాదు. నా కాపురం చిక్కుల్లో పడకుండా చూసుకోవడానికి. ఎంతైనా ఒకే ఇంటి నుంచి వచ్చాం కదా నువ్వు తప్పు చేస్తే అది నాకే కాకుండా మన అమ్మానాన్నలకు కూడా చుట్టుకుంటుంది. అంత నా తలరాత. జీవితాంతం నిన్ను మోయాలని ఆ భగవంతుడు నా నుదిటిన రాశాడు. 

మరోవైపు కనకం ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి తన భర్త వస్తాడు. అర్థరాత్రి అయినా పడుకోకుండా ఎందుకు ఇక్కడ కూర్చొన్నావు. ఏం ఆలోచిస్తున్నావ్. పద పడుకుందాం. ఇక కనకం తన భర్తకు ఓ విషయం అడగాలి అని అంటుంది. మీతో చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పకపోతే మీ ముందు తప్పుచేసిన దానిలా ఉంటానని చెప్తున్నాను అంటుంది. ఏమైందని తన భర్త అడిగితే ఇంకో సమస్య మొదలైంది అని కనకం చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Nellore Alert : నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
Poco M7 Pro 5G: పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!
పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Nellore Alert : నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
Poco M7 Pro 5G: పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!
పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!
Ravichandran Ashwin: అశ్విన్... స్పిన్ కింగ్, క్రికెట్ పిచ్ పై చెరగని సంతకం రవిచంద్రన్
అశ్విన్... స్పిన్ కింగ్, క్రికెట్ పిచ్ పై చెరగని సంతకం రవిచంద్రన్
Thandel Second Single: కాశీలో... శివుడి సన్నిధిలో 'తండేల్' సెకండ్ సాంగ్ రిలీజ్... 'శివ శక్తి'లో చైతన్య - సాయి పల్లవిని చూశారా?
కాశీలో... శివుడి సన్నిధిలో 'తండేల్' సెకండ్ సాంగ్ రిలీజ్... 'శివ శక్తి'లో చైతన్య - సాయి పల్లవిని చూశారా?
Telangana Congress Protest : తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Embed widget